itc chairman
-
భారీగా పెరిగిన ఐటీసీ చైర్మన్ వేతనం - ఎన్ని కొట్లో తెలుసా..?
ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్ బోనస్ అండ్ కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు. (ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?) నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది. -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
పారిశ్రామిక విప్లవం 4.0
► రేపటి నుంచి భారత సాంకేతిక సదస్సు ► బెంగళూరు వేదికగా శాస్త్రవేత్తల సమావేశం ► పారిశ్రామిక, వ్యవసాయరంగాలపై చర్చలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, బెంగళూరు: భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో ‘ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్–2017’ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు 2013లో తొలిసారి బెంగళూరులోనే మొదలైంది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో కీలక సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్(ఐటీసీ) చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి అధ్యక్షత వహిస్తారు. భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సులో అమెరికా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు హాజరై డెమోలు ఇస్తారు. ఇస్రో సాధించిన విజయాలపైనా ప్రత్యేక చర్చ ఉంటుంది. వెయ్యి మంది పారిశ్రామికరంగ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రభుత్వరంగ నిపుణులూ పాల్గొంటారు. వ్యవసాయరంగంపై ప్రత్యేక సదస్సు సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొననున్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరుపుతారు. ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజయాలు, సాధించాల్సిన అంశాలపై 48 స్టాళ్లతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారత రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), ఓఎన్జీసీ, ఐబీఎం, ఇక్రిశాట్, ఇస్రో సంస్థల ప్రతినిధులు కొత్త టెక్నాలజీ అంశాలను వివరిస్తారు. ఎఫ్ఈఈ(ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్సీ), డబ్ల్యూఏఈ(వరల్డ్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్), ఏఐఎంఓ(ఆలిండియా మాన్యుఫాక్చరర్స్ ఆర్గనైజేషన్), ఏఎస్ఎంఈ (అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్), ఐఐపీఈ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఐఐపీఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉడే. పి.కృష్ణా, బెంగళూరు ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అన్నాదొరై, అగ్రిటెక్ చైర్మన్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్, ఐటీసీ నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆర్.ఎం. వాసగమ్, కర్ణాటక వ్యవసాయ, ఉద్యానవన శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మహేశ్వరరావు తదితర ప్రతినిధులు హాజరుకానున్నారు. దేశాభివృద్ధికి దోహదం సాంకేతిక రంగ నిపుణులకు ఈ సదస్సు చక్కని వేదిక. పరిశోధన, సాంకేతిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై చర్చలు జరుగుతాయి. సదస్సు మన దేశా భివృద్ధికి దోహదపడు తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగసంస్థలకు, విద్యార్థులకూ ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఎల్.వి. మురళీకృష్ణారెడ్డి, ఐటీసీ చైర్మన్