
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్‌లో మరో సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తమకు ఏడు ఉండగా ఇది ఎనిమిదోది కానున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు.
సుమారు ఏడు వందల మంది సిబ్బంది సామర్థ్యంతో ఉండే ఈ చిన్న స్థాయి కేంద్రం వచ్చే ఆరేడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రస్తుతం దాదాపు 90,000 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండగా వీరిలో 37.4 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment