![US Congress team at TCS - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/14/TCS.jpg.webp?itok=ShiGb4aB)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రో ఖన్నా సారథ్యంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా వారికి టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వివరించారు.
అమెరికాకు విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. అమెరికన్ ఎంబసీ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment