టాటా గ్రూప్‌లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.
2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.
టాటా మోటర్స్ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్‌లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment