18 సంస్థలతో కూడిన టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (TCS అండ్ టాటా మోటార్స్) భారీ ర్యాలీతో ఏకంగా రూ. 30 లక్షల కోట్లను దాటింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా టాటా ఓ సరికొత్త రికార్డ్ కైవసం చేసుకుంది.
టాటా గ్రూప్ కంపెనీలైన టీసీఎస్, టాటా పవర్ మొదలైన కంపెనీ షేర్లు బాగా పెరగటం వల్ల సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఇందులో కూడా టీసీఎస్ షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ TCS మార్కెట్ క్యాప్ మొదటిసారి రూ. 15 లక్షల కోట్ల మార్కును తాకింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి యూరప్ అసిస్టెన్స్ ఐటీ ఆపరేటింగ్ మోడల్‌ను మార్చడానికి ఏర్పడిన ఒప్పందం కూడా షేర్లు పెరగటానికి దోహదపడ్డాయి.
మార్కెట్ క్యాప్ లీడర్‌బోర్డ్‌లో రిలయన్స్ గ్రూప్ రూ. 21.60 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్, వివిధ మౌలిక సదుపాయాల రంగాలు రూ. 15.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి టాటా మోటార్స్, టైటాన్ సంస్థల మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లని దాటాయి.
ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది?
టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. వాహన డిమాండ్ పెరడటం, ముడి సరుకుల ధరలు కొంత తగ్గడం కారణంగా కంపెనీ ఫలితాలు కొంత వృద్ధి చెందాయి. కాగా.. ఇప్పుడు షేర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టాటా గ్రూప్ మరింత గొప్ప ఫలితాలను పొందనున్నట్లు పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment