టాటా గ్రూప్ ఫ్యాషన్ చైన్ జూడియో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నిమిషానికి 90 టీ-షర్టులు, 17 లిప్‌స్టిక్‌లను విక్రయించినట్లు మాతృ సంస్థ ట్రెంట్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
జూడియో ప్రతి నిమిషానికి 20 డెనిమ్‌లు విక్రయిస్తూ.. యువ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రెంట్ ఆదాయం 36.1 మిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. అంతే కాకుండా సంస్థ కొత్తగా మరో 46 నగరాల్లో స్టోర్స్ ప్రారంభించింది.
2016లో ప్రారంభించిన జుడియోకి 2024 మార్చి నాటికి 161 నగరాల్లో 545 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 86 జూడియో ఔట్‌లెట్‌లు, గుజరాత్‌లో 82 ఉన్నాయి. కర్ణాటకలో 58, ఢిల్లీలో 14 ఔట్‌లెట్‌లు జూడియోకు ఉన్నాయని మే 18న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసి.. కస్టమర్లకు చేరువ్వడం వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment