Tata shares
-
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు..
18 సంస్థలతో కూడిన టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (TCS అండ్ టాటా మోటార్స్) భారీ ర్యాలీతో ఏకంగా రూ. 30 లక్షల కోట్లను దాటింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా టాటా ఓ సరికొత్త రికార్డ్ కైవసం చేసుకుంది. టాటా గ్రూప్ కంపెనీలైన టీసీఎస్, టాటా పవర్ మొదలైన కంపెనీ షేర్లు బాగా పెరగటం వల్ల సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఇందులో కూడా టీసీఎస్ షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ TCS మార్కెట్ క్యాప్ మొదటిసారి రూ. 15 లక్షల కోట్ల మార్కును తాకింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి యూరప్ అసిస్టెన్స్ ఐటీ ఆపరేటింగ్ మోడల్‌ను మార్చడానికి ఏర్పడిన ఒప్పందం కూడా షేర్లు పెరగటానికి దోహదపడ్డాయి. మార్కెట్ క్యాప్ లీడర్‌బోర్డ్‌లో రిలయన్స్ గ్రూప్ రూ. 21.60 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్, వివిధ మౌలిక సదుపాయాల రంగాలు రూ. 15.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి టాటా మోటార్స్, టైటాన్ సంస్థల మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లని దాటాయి. ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది? టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. వాహన డిమాండ్ పెరడటం, ముడి సరుకుల ధరలు కొంత తగ్గడం కారణంగా కంపెనీ ఫలితాలు కొంత వృద్ధి చెందాయి. కాగా.. ఇప్పుడు షేర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టాటా గ్రూప్ మరింత గొప్ప ఫలితాలను పొందనున్నట్లు పలువురు భావిస్తున్నారు. -
లాభాల పంట పండిస్తోన్న టాటా షేర్లు
షేర్ మార్కెట్లో టాటాగ్రూపు హవా నడుస్తోంది. ఏ రంగం, ఏ బిజినెస్ అనే తేడా లేకుండా టాటా షేరు అయితే చాలు కొనేస్తాం అన్నట్టుగా ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. దీంతో టాటా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీల షేర్లు గరిష్టాలను తాకుతున్నాయి. భారతీయ మార్కెట్లో టాటాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఉన్ని కంపెనీలు ఉన్నా కొత్తగా ఎన్ని కంపెనీలు వస్తున్నా బ్రాండ్ ఇమేజ్‌లో టాటాలకు దీటుగా నిలవలేకపోతున్నాయి. ఇటీవల ఎయిర్ ఇండియాను టాటాలు తిరిగి సొంతం చేసుకున్నప్పుడు దేశంలో మెజారిటీ ప్రజలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ డీల్ కుదిరి వారం రోజుల కూడా కాకముందే ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో విస్తరణకు సంబంధించి టీపీజీ గ్రూపుతో బిలియన్ డాలర్ల ఒప్పందం టాటా చేసుకుంది. ఇటు ఎయిర్‌లైన్స్‌తో పాటు అటు ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో టాటా దూకుడుగా వ్యవహరించడంలో మరోసారి టాటా లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. ఫలితంగా మొదట టాటా మోటార్స్ షేర్లు రికార్డు ఇంట్రాడేలో స్థాయిలో 20 శాతం వృద్ధిని నమోదు చేసి ఆల్‌టైం హైని టచ్ చేశాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టాటా మోటార్ షేర్లు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలలో దాదాపు 21 శాతం లాభపడ్డాయి. షేరు ధర ఎన్ఎస్ఈలో రూ. 509 దగ్గర బీఎస్ఈలో రూ. 508.25 దగ్గర ట్రేడవుతోంది. దీంతో టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.1,49,774 కోట్లకు చేరుకుంది. - టాటా గ్రూపు నుంచి మొత్తం 17 కంపెనీలు రెండు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉండగా ఇందులో కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోగా మిగిలిన పదహారు కంపెనీల షేర్లు వృద్దిని కనబరుస్తూ లాభాల్లో ఉన్నాయి. - టాటా కెమికల్స్ లిమిటెడ్ ఎన్ఎస్ఈ (15.4), బీఎస్ఈలలో (14.6) శాతం వృద్దితో షేరు విలువ రూ.1120 దగ్గర ట్రేడవుతోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.24,720 కోట్లకు చేరుకుంది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని షేర్లు రూ.224 దగ్గర ట్రేడవుతుండగా మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 62,564 కోట్లకు చేరుకుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సైతం 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. సగం విలువ అక్కడే వందేళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపు నుంచి సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు రకరకాల ఉత్పత్తులను అందిస్తోంది, అయితే టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటల్ విలువలో సగానికి పైగా స్థానాన్ని టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నమోదు చేసింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ విలువ ఏకంగా రూ.13,51,596 కోట్టుగా ఉంది. మిగిలిన అన్ని గ్రూపుల మార్కెట్ క్యాపిటల్ కలిపినా టీసీఎస్కి సమంగా లేదు. చదవండి: అప్పుడు చైనాపై రెచ్చిపోయి..! ఇప్పుడు ష్.. గప్‌చుప్ -
సెన్సెక్స్‌ను పడేసిన టాటా షేర్లు
• 88 పాయింట్ల నష్టం • 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ముంబై: టాటా గ్రూపు యాజమాన్య మార్పిడికి సంబంధించిన అనూహ్య పరిణామాలతో ఆ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్ల చొప్పున నష్టపోయి వరుసగా 28,091.42, 8691.30 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో సోమవారం నాటి లాభాలు ఆవిరైపోయాయి. టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలకడం.... దీనిపై మిస్త్రీ, టాటాల మధ్య న్యాయపరమైన పోరాటం మొదలు కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఈ పరిణామాలు అటు విదేశీ ఇన్వెస్టర్లను సైతం ప్రభావితం చేశాయి. మరోవైపు గురువారంతో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల కాల వ్యవధి తీరనుండడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, టాటా గ్రూపులో నెలకొన్న సందిగ్ధత వల్ల మార్కెట్ నెగటివ్ జోన్లో ట్రేడ్ అయ్యిందని జియోజిత్ బీఎన్పీ పారిబా రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. టాటా షేర్లకు అమ్మకాల ఒత్తిడి: టాటా గ్రూపు నిర్వహ ణలో అనిశ్చితితో ఆ కంపెనీల షేర్లు మంగళవారం మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టాటా స్టీల్ 2.51 శాతం, టాటా పవర్ 1.5 శాతం, టీసీఎస్ 1.20 శాతం, టాటా మోటార్స్ 1.07 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.5753 కోట్లు, టాటా మోటార్స్ మార్కెట్ విలువ రూ.2432 కోట్లు, టాటా స్టీల్ రూ.1039 కోట్లు కరిగిపోయింది. టాటా స్పాంజ్ ఐరన్ 3 శాతం, టాటా కాఫీ 2.63 శాతం, టాటా గ్లోబల్ బెవరేజెస్ 2.47 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 2.26 శాతం, టాటా కెమికల్స్ 2.09 శాతం, టాటా ఎలెక్సీ 1.40 శాతం చొప్పున నష్టపోయాయి.