LinkedIn sarvey
-
LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లింక్డ్ఇన్ ఉత్తమ కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగి్నజెంట్, మక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, డెలాయిట్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ భారత్‌లోని టాప్ కంపెనీల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2024 సంవత్సరానికిగాను టాప్ 25 పెద్ద కంపెనీలతో పాటు ఈసారి టాప్ 15 మధ్యతరహా కంపెనీల అదనపు జాబితాను కూడా చేర్చింది. తదుపరి స్థాయికి వెళ్లే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి కెరీర్లో పురోగతికి దారితీసే ఎనిమిది స్తంభాలపై ఆధారపడి కంపెనీల ర్యాంకింగ్‌లు ఉన్నాయని లింక్డ్ఇన్ తెలిపింది. -
పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ..
ముంబై: దేశంలో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్ గుర్తింపు పొందింది. పనిచేయడానికే కాకుండా, కెరీర్లో పురోగతికీ టీసీఎస్ మెరుగైన కంపెనీగా లింక్డ్ఇన్ 2023 నివేదిక తెలిపింది. టీసీఎస్ తర్వాత అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ లింక్డ్ఇన్ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది లింక్డ్ఇన్ జాబితాలో టెక్ కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది జాబితాలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థిక సేవల కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రొఫెషనల్ సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలకూ చోటు దక్కింది. 25 కంపెనీల్లో 10 ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ నుంచే ఉన్నాయి. మాక్వేర్ గ్రూప్ 5వ స్థానంలో ఉంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11, మాస్టర్‌కార్డ్ 12, యుబి 14వ స్థానంలో నిలిచాయి. 20వ స్థానంలో డ్రీమ్11, 24వ స్థానంలో గేమ్స్ 24/7 ఉన్నాయి. ఈ జాబితాలో గేమింగ్ కంపెనీలకు చోటు లభించడం మొదటిసారి. ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తోంది. ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ సంస్థ జెప్టో 16వ స్థానం దక్కించుకుంది. ఈ తరహా నైపుణ్యాలకు డిమాండ్.. లింక్డ్ఇన్ జాబితాలో చోటు సంపాదించుకున్న టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం చూస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీస్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్, గేమ్ డెవలప్మెంట్ నిపుణులకూ డిమాండ్ నెలకొంది. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, విక్రయాలు, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌పై ఎక్కువగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీలు, ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, పుణెకు చెందినవి నిపుణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. -
టీ బ్రేక్ మిస్ అయ్యాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పని విధానం కొనసాగుతోంది. అయితే ఆఫీస్‌కు వెళ్లి సహోద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించేందుకు 78 శాతం మంది భారతీయ నిపుణులు ఆసక్తి కనబరిచారని లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 మధ్య సెన్సస్‌వైడ్ చేపట్టిన సర్వేలో 18 ఏళ్లు ఆపైన వయసున్న 1,001 మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఈ నివేదిక ప్రకారం.. కార్మికులు సాధారణంగా కార్యాలయానికి వెళ్లడానికే మక్కువ చూపుతారు. ఈ విషయంలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తాము సానుకూలంగా ఉన్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఉద్యోగులతో ముచ్చట్లు, మరింత సమర్థవంతమైన ముఖాముఖి సమావేశాలు, పని సంబంధాలను నిర్మించడం కోసం ఆఫీస్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఉద్యోగులతో కలిసి చాయ్.. కార్యాలయంలో చాయ్ విరామం (టీ బ్రేక్) బంధాన్ని కోల్పోయామని 72 శాతం మంది చెప్పారు. పని, వ్యక్తిగత జీవితాల గురించి సహోద్యోగులతో పరిహాసమాడవచ్చని వారు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా సహచరులు వచ్చి మరో ఉద్యోగితో సంభాషించడాన్ని (డెస్క్ బాంబింగ్) అత్యధికులు ఇష్టపడుతున్నారు. ఆకస్మిక సంభాషణలకు డెస్క్ బాంబింగ్‌ను గొప్ప మార్గంగా 62 శాతం మంది చూస్తున్నారు. జనరేషన్–జడ్‌కు చెందిన 60 శాతం మంది ఇటువంటి సంభాషణలను అనుభవించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల తమ కెరీర్‌పై ఎటువంటి హానికర ప్రభావం పడలేదని 63 శాతం మంది వెల్లడించారు. అలాగే కార్యాలయానికి వెళ్లకపోతే కెరీర్ వృద్ధి అవకాశాలు తగ్గుతాయని ఇదే స్థాయిలో నమ్ముతున్నారు. -
విక్రయాలకు టెక్నాలజీ దన్ను
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో వ్యాపారాలు అస్తవ్యస్తం అయిన నేపథ్యంలో మళ్లీ పుంజుకోవడానికి కంపెనీలు సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. విక్రయాలను పెంచుకునేందుకు రియల్ టైమ్ డేటా కోసం 73 శాతం సంస్థలు వారానికి కనీసం ఒకసారైనా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. డేటా ద్వారా కొనుగోలుదారుల అభిప్రాయాల గురించి మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. లింక్డ్ఇన్ ఆరో విడత సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సేల్స్ విభాగంలో సరైన డేటా పాత్ర కీలకంగా మారింది. దీంతో సీఆర్ఎం (కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్) సిస్టమ్‌లు, సేల్స్ ఇంటెలిజెన్స్ సాధనాల వైపు విక్రేతలు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా యువ ప్రొఫెషనల్స్ (35 ఏళ్ల లోపు వారు) ఇలాంటి టెక్నాలజీల వినియోగానికి సారథ్యం వహిస్తున్నారు. 35 ఏళ్లు పైబడిన ప్రొఫెషనల్స్‌తో పోలిస్తే వారు 1.2 రెట్లు ఎక్కువగా సీఆర్ఎం సాధనాలను వారానికి మూడు గంటల పాటు ఉపయోగిస్తున్నారు. డేటాతో సవాళ్లు .. టెక్నాలజీవైపు మళ్లుతున్నప్పటికీ అసంపూర్తిగా, కచ్చితత్వం లేని డేటాను గుర్తించడం సవాలుగా ఉంటోందని ప్రతి 5 మంది విక్రేతల్లో ఇద్దరు (46 శాతం) వెల్లడించారు. ‘గడిచిన రెండేళ్లలో ఇంటి నుంచి పని విధానాలతో వివిధ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. మా డేటా ప్రకారం దేశీయంగా మూడొంతుల మంది విక్రేతలు ప్రస్తుతం వారానికి కనీసం ఒకసారైనా సేల్స్ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. అంటే భవిష్యత్‌లో అమ్మకాలకు డేటానే చోదకంగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది‘ అని లింక్డ్ఇన్ సేల్స్ సొల్యూషన్స్ భారత విభాగం హెడ్ అభయ్ సింగ్ తెలిపారు. సేల్స్ బృందాలకు కచ్చితత్వంతో కూడుకున్న రియల్ టైమ్ డేటాను ఇవ్వడం ద్వారా కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, మెరుగైన అనుభూతి కల్పించేందుకు విక్రేతలకి టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అమ్మకాల పరిస్థితుల గురించిన నివేదికకు సంబంధించి భారత్ సహా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా తదితర 11 దేశాల్లోని 15,000 మంది పైచిలుకు కొనుగోలుదారులు, విక్రేతలపై లింక్డ్ఇన్ ఈ సర్వే చేసింది. ఇందులో భాగంగా భారత్ ఎడిషన్‌ను కూడా రూపొందించింది. దీనికోసం భారత్‌లో 750 మంది కొనుగోలుదారులు, 750 మంది విక్రేతల అభిప్రాయాలు సేకరించింది. దీని ప్రకారం భారత్‌లో ప్రతి అయిదుగురిలో నలుగురు (81 శాతం) కొనుగోలుదారులు రిమోట్ పని విధానాల వల్ల కొనుగోళ్లు సులభతరంగా మారాయని తెలిపారు. విక్రేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంలో ఉన్నారు. -
నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం
న్యూఢిల్లీ:నియామక కార్యకలాపాలు స్థిరమైన రికవరీలో ఉన్నాయని లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా నమోదయ్యాయని వివరించింది. ‘2021 ఏప్రిల్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి నుంచి రికవరీ ప్రారంభమైంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు అధికమయ్యాయి. ఒక సంవత్సరం స్తంభింపజేసిన తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. నియామకాలు క్రమంగా అధికం అవుతూనే ఉంటాయని అంచనా. ఉద్యోగాలు చేసేవారిలో కొత్తగా ప్రవేశించే వ్యక్తుల కంటే.. జాబ్ మారుతున్నవారే అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం కొనసాగుతున్నందున కొత్త, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలలో అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు మారే వ్యక్తులలో భారీ తగ్గుదల ఏర్పడింది. చదవండి: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు! -
లక్షల్లో వేతనాలు కావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే.!
న్యూ ఢిల్లీ : కోవిడ్ 19 అదుపులో ఉండటంతో ఆర్థిక కార్యకాపాలు పుంజుకుంటున్నాయి. నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా కాలంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు తమ అర్హతకు తగ్గ జాబులు వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుం జాబ్మార్కెట్లో ఏ తరహా కోర్సులు, స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉందనే అంశంపై లింక్డ్ఇన్ సర్వే చేపట్టింది. ఈ స్కిల్స్‌కే డిమాండ్ కరోనా తర్వాత అన్ని రంగాలు ఒకే సారి కోలుకోలేదు. ఎంటర్టైన్ మెంట్, నిర్మాణ రంగం ఇంకా గాడిన పడాల్సి ఉండగా ఐటీ రంగం సాధారణ స్థికి చేరుకుంటోంది. అయితే స్థూలంగా చూస్తే మార్కెట్లో నియామకాల సంఖ్య పెరిగిందని లింక్డ్ఇన్ సర్వేలో తేలింది. అదే సమయంలో ఉద్యోగాలను అన్వేషించే వారి సంఖ్య కూడా వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్లోనే ఎక్కువ నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులోనూ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు ఉన్న యువ వర్కర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని లింక్డ్ఇన్ అంటోంది. ఈ స్కిల్స్ ఉన్నవారికి భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు కంపెనీలు వెనకడుగు వేయడం లేదని, భారీ జీతం రావాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు తప్పని సరి అని లింక్డ్ఇన్ సూచిస్తోంది. పెరుగుతున్న నియామకాలు కరోనా సంక్షోభానికి ముందు నాటి 2019తో పోలిస్తే నియామకాల రేటు ఈ ఏడాది జూన్‌లో 42 శాతం అధికంగా నమోదయినట్టు లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్ కాస్త తగ్గినా. మే వచ్చేప్పటికీ సాధారణ స్థితికి చేరుకోవడం మొదలైనట్టు తెలిపింది. మేలో 35 శాతం, జూన్‌లో 42 శాతం నియామకాలు రేటు అధికంగా నమోదు అయ్యాయి. నియామకాల రేటు ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న నియామకాలను లింక్డ్ఇన్లో నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్యతో భాగించగా వచ్చిన అంకెను హైరింగ్ రేటుగా పరిగణలోకి తీసుకుని లింక్డ్ఇన్ ఈ నివేదిక రూపొందించింది. చాలాకాలంగా నిలిచిపోయిన నియామకాలను కంపెనీలు మళ్లీ చేపడుతుండటం వల్ల హైరింగ్ రేటు పెరుగుతున్నట్టు పేర్కొంది. -
డిజిటల్ స్కిల్స్‌కు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా తెచ్చిన సంక్షోభం ఐటీ నిపుణులను కొత్త కోర్సుల వైపు ఆసక్తి చూపేలా చేస్తోంది. భారతలో అనేక మంది ప్రొఫెనషల్స్ డిజిటల్ స్కిల్స్, రిమోట్ వర్కింగ్స్ కోర్సులు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. అలాగే భారత్‌లో వర్చువల్ లెర్నింగ్ కోసం గడిపిన గంటలు గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో 245శాతం పెరిగినట్లు పేర్కొంది. లింక్డ్ఇన్ ఈ ఏడాదిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోర్సుల జాబితాను విడుదల చేసింది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వినూత్న కోర్సులు నేర్చుకునే అభ్యాసకుల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్ల తెలిపింది. మనదేశంలో అత్యధికంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సు పట్ల ఫ్రొఫెషనల్స్ ఆసక్తి చూపగా, తర్వాత స్థానంలో టైమ్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. వాస్తవానికి, గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో లెర్నింగ్ అవర్స్ 3 రెట్ల కన్నా ఎక్కువ పెరిగినట్లు లింక్డ్ఇన్ లెర్నింగ్ డేటా స్పష్టంచేస్తోందని’’ అని లింక్డ్ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ ఆనంద్ అన్నారు. ఇక అంతర్జాతీయంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అచీవ్ కోర్సు ప్రథమస్థానంలో ఉండగా, వర్క్ బెటర్ రిమోట్లీ కోర్సు ద్వితీయ స్థానంలో కొనసాగుతుంది. -
అధిక వేతనాలు బెంగళూరులోనే!
హైదరాబాద్: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్ఇన్ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్ఇన్కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా లింక్డ్ఇన్ సంస్థ రూపొందించిన ఈ సాలరీ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలివీ... ♦ భారత్‌లో అధిక వేతనాలు బెంగళూరులోనే ఉన్నాయి. సగటు వేతనం ఏడాదికి రూ.12 లక్షలుగా ఉంది. రూ.9 లక్షల సగటు వేతనంతో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ.8.5 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్ మూడో స్థానంలో, రూ.6.3 లక్షల వేతనంలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచాయి. ♦ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఏడాదికి రూ.15 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు రూ.12 లక్షల వరకూ, వినియోగ రంగంలోని ఉద్యోగులు రూ.9 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. ♦ హార్డ్‌వేర్ జాబ్స్ అంటే సంప్రదాయ హార్డ్‌వేర్ ఉద్యోగాలు కాదు. చిప్ డిజైన్, కొత్త తరం నెట్వర్కింగ్ ఉద్యోగాలు. వందలాది, వేలాది ట్రాన్సిస్టర్ల, డివైజ్‌ల సమ్మేళనంతో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను(ఐసీ) తయారు చేసే ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు రెండేళ్ల క్రితం వారి అనుభవానికి 3 రెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వారి అనుభవానికి 4–5 రెట్ల వేతనాలు లభిస్తున్నాయి. ♦ భారీ స్థాయిలో డేటా వస్తుండటంతో వినియోగదారులకు భద్రత, తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి నెట్వర్కింగ్ రంగంలో నవకల్పనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నెట్వర్కింగ్ రంగంలో ఉద్యోగాలు, నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ♦ సాఫ్ట్‌వేర్‌లో డిజిటల్ టెక్నాలజీల కారణంగా వేతనాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌లలో వేతనాలు ఎగబాకుతున్నాయి. ప్రోగ్రామింగ్ బాగా వచ్చి, ఇతర (బిజినెస్, ఫైనాన్స్, మెడికల్) రంగాల్లో విస్తృత పరిజ్ఞానం ఉన్నవారికీ మంచి వేతనాలు లభిస్తున్నాయి. ♦ ఇంజినీరింగ్ డైరెక్టర్లు అధిక వేతనం పొందుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్(సేల్స్), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్లు ఉన్నారు. -
వావ్..! ప్రపంచంలో ఇండియన్సే టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలో భారతీయులే అత్యంత ఆత్మవిశ్వాసం గలవారని ఓ సర్వే తేల్చి చెప్పింది. తమ అభివృద్ధిని గురించి వ్యక్తిగతంగా గానీ, ఇంటర్ నెట్ ద్వారాగానీ చెప్పడంలో ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లోని ప్రొఫెషనల్స్ చెప్పలేనంత కాన్ఫిండెంట్గా చెప్తారని ఆ సర్వే స్పష్టం చేసింది. లింక్డన్ అనే ప్రముఖ సంస్థ 'యువర్ స్టోరీ @ వర్క్' అనే పేరిట ఈ సర్వేను నిర్వహించింది. ఇందుకుగాను మే 6 నుంచి 19 తేదీల మధ్య కెనడా, అమెరికా, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్, బ్రిటన్, ఐర్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, స్వీడన్, మెక్సికో, ఫ్రాన్స్, సింగపూర్, చైనా, జపాన్ దేశాల్లో మొత్తం 11,228మంది ఉద్యోగాల్లో ఉన్న యువకులను ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రపంచ దేశాల్లోని ఇతర యువ ఉద్యోగుల్లో కేవలం 35శాతం మాత్రమే ఆత్మ విశ్వాసం గలవారు ఉండగా ఒక్క భారత్‌లో మాత్రం 55శాతం ఆత్మవిశ్వాసం ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్వ్యూలో భారతీయ యువకులు మాత్రమే శభాష్ అనిపించుకుంటారని, వారిని మాత్రమే ప్రపంచ మార్కెట్ ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాయని ఆ సర్వే వెల్లడించింది.