న్యూఢిల్లీ: కరోనా తెచ్చిన సంక్షోభం ఐటీ నిపుణులను కొత్త కోర్సుల వైపు ఆసక్తి చూపేలా చేస్తోంది. భారతలో అనేక మంది ప్రొఫెనషల్స్ డిజిటల్ స్కిల్స్, రిమోట్ వర్కింగ్స్ కోర్సులు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ నివేదిక తెలిపింది. అలాగే భారత్‌లో వర్చువల్ లెర్నింగ్ కోసం గడిపిన గంటలు గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో 245శాతం పెరిగినట్లు పేర్కొంది. లింక్డ్‌ఇన్ ఈ ఏడాదిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోర్సుల జాబితాను విడుదల చేసింది.
భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వినూత్న కోర్సులు నేర్చుకునే అభ్యాసకుల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్ల తెలిపింది. మనదేశంలో అత్యధికంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సు పట్ల ఫ్రొఫెషనల్స్ ఆసక్తి చూపగా, తర్వాత స్థానంలో టైమ్ మేనేజ్‌మెంట్ కోర్సు ఉంది. వాస్తవానికి, గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో లెర్నింగ్ అవర్స్ 3 రెట్ల కన్నా ఎక్కువ పెరిగినట్లు లింక్డ్‌ఇన్ లెర్నింగ్ డేటా స్పష్టంచేస్తోందని’’ అని లింక్డ్‌ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ ఆనంద్ అన్నారు. ఇక అంతర్జాతీయంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అచీవ్ కోర్సు ప్రథమస్థానంలో ఉండగా, వర్క్ బెటర్ రిమోట్లీ కోర్సు ద్వితీయ స్థానంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment