అధిక వేతనాలు బెంగళూరులోనే! | More Wages in Bangalore Linkedin Survey | Sakshi
Sakshi News home page

అధిక వేతనాలు బెంగళూరులోనే!

Published Fri, Nov 23 2018 8:19 AM | Last Updated on Fri, Nov 23 2018 8:19 AM

More Wages in Bangalore Linkedin Survey - Sakshi

హైదరాబాద్‌: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్‌ఇన్‌ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్‌ఇన్‌కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా లింక్డ్‌ఇన్‌ సంస్థ రూపొందించిన ఈ సాలరీ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలివీ...

భారత్‌లో అధిక వేతనాలు బెంగళూరులోనే ఉన్నాయి. సగటు వేతనం ఏడాదికి రూ.12 లక్షలుగా ఉంది. రూ.9 లక్షల సగటు వేతనంతో  ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ.8.5 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్‌ మూడో స్థానంలో, రూ.6.3 లక్షల వేతనంలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచాయి.  
హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఏడాదికి రూ.15 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రూ.12 లక్షల వరకూ, వినియోగ రంగంలోని ఉద్యోగులు రూ.9 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు.  
హార్డ్‌వేర్‌ జాబ్స్‌ అంటే సంప్రదాయ హార్డ్‌వేర్‌ ఉద్యోగాలు కాదు. చిప్‌ డిజైన్, కొత్త తరం నెట్‌వర్కింగ్‌ ఉద్యోగాలు. వందలాది, వేలాది ట్రాన్సిస్టర్ల, డివైజ్‌ల సమ్మేళనంతో ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లను(ఐసీ) తయారు చేసే ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు రెండేళ్ల క్రితం వారి అనుభవానికి 3 రెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వారి అనుభవానికి 4–5 రెట్ల వేతనాలు లభిస్తున్నాయి.  
భారీ స్థాయిలో డేటా వస్తుండటంతో వినియోగదారులకు భద్రత, తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి నెట్‌వర్కింగ్‌ రంగంలో నవకల్పనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నెట్‌వర్కింగ్‌ రంగంలో ఉద్యోగాలు, నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది.  
సాఫ్ట్‌వేర్‌లో డిజిటల్‌ టెక్నాలజీల కారణంగా వేతనాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌లలో వేతనాలు ఎగబాకుతున్నాయి. ప్రోగ్రామింగ్‌ బాగా వచ్చి, ఇతర (బిజినెస్, ఫైనాన్స్, మెడికల్‌) రంగాల్లో విస్తృత పరిజ్ఞానం ఉన్నవారికీ మంచి వేతనాలు లభిస్తున్నాయి.  
ఇంజినీరింగ్‌ డైరెక్టర్లు అధిక వేతనం పొందుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, వైస్‌ ప్రెసిడెంట్‌(సేల్స్‌), సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement