యూరప్ ‘లాంగ్ స్టీల్’కు ‘టాటా’
గ్రేబుల్ క్యాపిటల్ చేతికి వ్యాపారం
లండన్: యూరప్‌లో తమకున్న ‘లాంగ్ ప్రొడక్ట్స్’ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. దీన్ని గ్రేబుల్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పీకి విక్రయించినట్లు తెలియజేసింది. ఆస్తుల పోర్ట్‌ఫోలియో పునర్వ్యవస్థీకరణతో సహా... గడిచిన ఏడాది కాలంలో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి సంబంధించి సమూల మార్పిడి ప్రణాళికను పూర్తి రూపాంతర ప్రణాళిక ఈ విక్రయానికి కాఉక్కు వ్యాపారానికి సంబంధించి ‘లాంగ్ ప్రొడక్ట్స్’ బిజినెస్ విక్రయాన్ని పూర్తి చేసినట్లు టాటా స్టీల్ ప్రకటించింది.
ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు సహకరించటంతోనే ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. ‘‘స్కంథోర్ప్ స్టీల్‌వర్క్స్, టీసైడ్‌లోని రెండు మిల్లులు, వర్కింగ్‌టన్‌లోని ఇంజనీరింగ్ వర్క్‌షాప్, యార్క్‌లో డిజైన్ కన్సల్టెన్సీ, వీటిని అనుబంధంగా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు, నార్తర్న్ ఫ్రాన్స్‌లోని రైల్ మిల్... ఇవన్నీ మా యూరోప్ వ్యాపారంలో భాగంగా ఉన్నాయి. ఈ రోజు నుంచీ ఇవి బ్రిటిష్ స్టీల్ పేరిట కార్యకలాపాలు సాగిస్తాయి. మొత్తంగా ఈ వ్యాపారంలో యూకేలో 4,400 మంది, ఫ్రాన్స్‌లో 400 మంది ఉద్యోగులున్నారు’’ అని టాటా స్టీల్ యూకే ప్రకటించింది.