Russia Ukraine War: After Infosys Tata Steel Stops Business With Russia, Details Inside - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్‌ గుడ్‌బై 

Published Thu, Apr 21 2022 7:40 AM | Last Updated on Thu, Apr 21 2022 10:12 AM

After Infosys Tata Steel Stops Business With Russia Over Ukraine Invasion - Sakshi

న్యూఢిల్లీ: రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు టాటా స్టీల్‌ ప్రకటించింది. ‘‘టాటా స్టీల్‌కు రష్యాలో ఎటువంటి కార్యకలాపాలు కానీ, ఉద్యోగులు కానీ లేరు. దీంతో రష్యాతో వ్యాపారం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం’’ అంటూ టాటా స్టీల్‌ ప్రకటన విడుదల చేసింది.

భారత్, బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని ప్లాంట్లకు ముడి సరుకుల కోసం రష్యాపై ఆధారపకుండా ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. గతంలో రష్యా నుంచి కొంత మేర బొగ్గును టాటా స్టీల్‌ సమకూర్చుకోవడం గమనార్హం.   

చదవండి: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్‌ విచారణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement