
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 7,714 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 9,768 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. వ్యయాలు పెరగడమే క్యూ1లో లాభాలు తగ్గడానికి కారణమయ్యాయి.
సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ. 53,628 కోట్లకు పెరిగింది. ముడి వస్తువుల ఖర్చులతో పాటు వడ్డీలు తదితర వ్యయాలు కూడా కలిపి రూ. 41,491 కోట్ల నుంచి రూ. 51,912 కోట్లకు పెరిగాయి. దేశీయంగా టాప్ 4 ఉక్కు సంస్థల్లో టాటా స్టీల్ కూడా ఒకటి. మొత్తం ఉక్కు ఉత్పత్తిలో కంపెనీ వాటా దాదాపు 18 శాతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment