న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం తగ్గి రూ. 214 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 219 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,079 కోట్ల నుంచి రూ. 1,701 కోట్లకు జంప్‌చేసింది. అయితే గత రెండు సంవత్సరాలుగా అదానీ వ్యాపారాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ఈక్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ తొలి త్రైమాసిక ఫలితాలలో నికర లాభం స్వల్పంగా తగ్గడం గమనార్హం.
అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 898 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీయంగా తొలి 390 మెగావాట్ల సౌర, పవన హైబ్రిడ్ యూనిట్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో వినీత్ ఎస్.జైన్ పేర్కొన్నారు. ఈ బాటలో సౌర విద్యుత్ సామర్థ్యం 58 శాతం జంప్‌చేసి 4,763 మె.వా.కు చేరగా.. పవన విద్యుత్ సామర్థ్యం 30 శాతం ఎగసి 647 మె.వా.కు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం పుంజుకున రూ. 2,285 వద్ద ముగిసింది.
చదవండి: Banks Privatisation: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేంద్రం క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment