Steam Leaks At Tata Steel Plant In Odisha, Workers Injured - Sakshi
Sakshi News home page

టాటా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్: కార్మికులకు గాయాలు

Published Tue, Jun 13 2023 6:19 PM | Last Updated on Tue, Jun 13 2023 6:37 PM

Steam Leaks At Tata Steel Plant In Odisha Workers Injured - Sakshi

ఒడిశాలోని మేరమండలిలోని టాటా స్టీల్ లిమిటెడ్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  కొంతమంది కార్మికుల తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాస్‌ లీక్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దాదాపు 19 మంది గాయపడగా,  ఆరుగురికి  40శాతం కంటే  ఎక్కువ గాలిన గాయాలైనట్టు సమాచారం. 

BFPP2 పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని ధృవీకరించిన సంస్థ అత్యవసర సేవలందిస్తున్నామని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం సంభవించిందని, గాయపడిన కార్మికులకు ప్రాథమిక చికిత్స అనంతరం ముందు జాగ్రత్త చర్యగా  తదుపరి చికిత్స కోసం కటక్‌కు తరలించినట్టు కంపెనీ తెలిసింది.

అలాగే బాధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి తగిన సాయం అందిస్తున్నామని, ఆందోళన అవసరం లేదని  కూడా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement