ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది.
అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్‌మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment