అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుంది. సంస్థలో మరోసారి ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు దఫాలుగా లేఆఫ్స్ ఇచ్చిన గోల్డ్‌మాన్ సాచెస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఆర్థిక మాంద్యం భయాలతో ప్రాజెక్ట్‌లలో తిరోగమనం, అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభంతో గోల్డ్‌మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తుంది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగిస్తున్నట్లు తేలింది. అయితే ఆ తొలగింపులపై గోల్డ్‌మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు.
కాగా, 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
Comments
Please login to add a commentAdd a comment