ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ మీడియా సంస్థ ‘వోక్స్’ నివేదిక ప్రకారం.. తొలగింపులపై మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.
ఉద్యోగుల ఉద్వాసనపై వెలుగులోకి వచ్చిన నివేదికల ఆధారంగా మెటా వచ్చే వారంలో 6 వేల మందిపై వేటు వేయనుంది. ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో 11వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 4వేల మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసింది. మే నెలలో 6 వేల మందిని ఇంటికి సాగనంపనుంది.
ఈ సందర్భంగా, మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ మాట్లాడుతూ.. వచ్చే వారం థర్డ్ వేవ్ ప్రారంభం కానుంది. ఇది నా సంస్థలోని బిజినెస్ టీమ్‌లతో సహా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది’అని క్లెగ్ చెప్పారు. ఆందోళన, అనిశ్చితి సమయం ఇది. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆ అనిశ్చితితో ఇబ్బంది పడుతున్నప్పటికీ మీ పనితీరు అమోఘం అంటూ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment