23-Year-Old IIT Graduate Laid Off By Goldman Sachs In Bengaluru - Sakshi
Sakshi News home page

‘నా ఉద్యోగం ఊడింది..జీవితం తలకిందులైంది’..సోషల్‌ మీడియాలో ఉద్యోగుల దీనగాథలు

Published Fri, Jan 13 2023 9:24 AM | Last Updated on Fri, Jan 13 2023 10:26 AM

23-Year-Old IIT Graduate Laid Off By Goldman Sachs In Bengaluru - Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ (జీఎస్‌) గ్రూప్ దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. వారిలో ఖరగ్‌ పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. 

అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్‌మన్‌ సాచ్స్‌ పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్‌ మన్‌ సాచ్స్‌లో జాబ్‌ ఎక్స్‌పీరియన్స్‌, తొలగింపులపై లింక్డిఇన్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. అందులో..

‘వావ్‌ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా జాయిన్‌ అయ్యా. నా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్‌ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్‌కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్‌లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్‌ పోయింది కాబట్టి..  కొత్త జాబ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

ఇలా సాహూయే కాదు.. గోల్డ్‌ మెన్‌ సాచ్స్‌ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్‌1 బీ వీసా హోల్డర్‌ ఉద్యోగులు కొత్త జాబ్‌ కోసం ప్రయత్నిస్తూ సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్‌ ప్రాంతంలో ఉన్న జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. 

‘నా కుటుంబంలో విదేశాలలో మాస్టర్స్‌ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుండి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్ కోస్టర్‌గా మారింది. నేను ఎక్కడ నుండి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్‌లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్‌ పోస్ట్‌లో చెప్పారు.

చదవండి👉 ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్‌.. ఇక వేలాది మంది ఇంటికే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement