సైబర్సిటీలో గోల్డ్మ్యాన్ సాక్స్ పెట్టుబడులు!
రూ.190 కోట్ల పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.లో గోల్డ్‌మ్యాన్ సాక్స్ పెట్టుబడులు పెట్టింది. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) రూపంలో రూ.190 కోట్ల నిధులను సమీకరించామని సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎండీ వేణు వినోద్ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌కు చేరువలో 8.5 ఎకరాల్లో మరీనా స్కైస్ పేరిట హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని చెప్పారు. జీ+31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,250 ఫ్లాట్లొస్తాయని.. ధర చ.అ.కు రూ.4,100గా నిర్ణయించామన్నారు. 40 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు.