Cybercity Builders and Developers
-
సైబర్సిటీలో గోల్డ్‌మ్యాన్ సాక్స్ పెట్టుబడులు!
రూ.190 కోట్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.లో గోల్డ్‌మ్యాన్ సాక్స్ పెట్టుబడులు పెట్టింది. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) రూపంలో రూ.190 కోట్ల నిధులను సమీకరించామని సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎండీ వేణు వినోద్ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌కు చేరువలో 8.5 ఎకరాల్లో మరీనా స్కైస్ పేరిట హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని చెప్పారు. జీ+31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,250 ఫ్లాట్లొస్తాయని.. ధర చ.అ.కు రూ.4,100గా నిర్ణయించామన్నారు. 40 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. -
నేడే సాక్షి ప్రాపర్టీ షో
తాజ్‌కృష్ణలో శని, ఆదివారాల్లో.. సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాంతాల్లో నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్మెంట్ల సమాచారం కొనేవారికి చేరువకావాలన్న ఉద్దేశంతో సాక్షి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు అపూర్వ స్పందన లభిస్తోంది. చిన్న సైజు ఫ్లాట్ల నుంచి లగ్జరీ విల్లాల వరకూ అన్ని రకాల గృహాలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్న నమ్మకంతో ప్రదర్శనకు విచ్చేసి.. చాలా మంది తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న మెట్రో రైల్.. వచ్చే ఏడాదికల్లా పరుగులు పెడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, నూతన పారిశ్రామిక విధానంతో వెల్లువలా వస్తున్న దేశ, విదేశీ కంపెనీలు, పెట్టుబడులు.. ఫలితంగా భాగ్యనగరం విశ్వ నగరంగా మారనుంది. సమీప భవిష్యత్తులో స్థిరాస్తి ధరలు పుంజుకోనున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాణ సంస్థలు, బ్యాంకులను ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి.. నగరవాసుల సొంతింటి కలను చేరువ చేస్తోంది ‘సాక్షి ప్రాపర్టీ షో’!! పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్, పూర్వాంకర, రాంకీ కో-స్పాన్సర్స్: సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎన్సీసీ అర్బన్, సిరి సంపద ఫాంల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ పాల్గొనే సంస్థలు: మంజీరా, శాంతా శ్రీరామ్, అక్యురేట్ డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సాకేత్ ఇంజనీర్స్, జనప్రియ, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, గ్రీన్ హోమ్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, నార్త్ స్టార్ హోమ్స్, గిరిధారి హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్, ప్రతిష్ట ప్రాపర్టీస్, స్పేస్ విజన్, మహేంద్రా లైఫ్ స్పేసెస్, ఏఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీనిధి ఇన్ఫ్రాటెక్, యూఎస్ఎం మై సిటీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. -
ప్రతికూలంలోనూ అమ్మకాలు!
2,250 ఫ్లాట్ల అమ్మకానికి చేరిన రెయిన్బో విస్తాస్ సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ అమ్మకాల వేగం ఏమాత్రం తగ్గలేదని సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి. ఎండీ వేణు వినోద్ చెప్పారు. ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత, వేగం వంటి వి ఇందుకు కారణమన్నారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి మూసాపేటకు వెళ్లే దారిలో 68 ఎకరాల్లో నిర్మిస్తున్న రెయిన్బో విస్తాస్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల అమ్మకాలు 2,250 మైలురాయిని చేరినట్లు తెలిపారు. ►68 ఎకరాల్లో నిర్మిస్తున్న రెయిన్బో విస్తాస్ ప్రాజెక్ట్‌ను రెండు సహజ సిద్ధమైన చెరువులతో.. మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నాం. ఫేజ్-1లో 7 ఎకరాల్లో 448 ఫ్లాట్లను పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించాం కూడా. ఫేజ్-2లో 22 ఎకరాల్లో రాక్ గార్డెన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 20 అంతస్తుల్లో 2,250 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. 7 ఎకరాల్లో సెంట్రల్ పార్క్, లక్ష చ.అ.ల్లో క్లబ్ హౌజ్ ఉంటాయి. చ.అ. ధర రూ.4,400గా నిర్ణయించాం. ►మివాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం దీని ప్రత్యేకత. దీంతో ఇతర ప్రాజెక్ట్‌తో పోలిస్తే రెయిన్బో విస్తాస్ 9 నెలల ముందుగా పూర్తవుతుంది. అంతేకాదు కార్పెట్ ఏరియా కూడా ఎక్కువొస్తుంది.