దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది.
‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్‌లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి.
ధనికులంటే..
వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment