ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ శాక్స్ సింగపూర్ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్) ప్రయివేటు రంగ దిగ్గజబ్యాంకు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్‌మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇండస్‌ఇండ్ బ్యాంక్ జోరుమీదుంది. గురువారం ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్ 8.47 శాతం పెరగడం విశేషం.
ఓపెన్ మార్కెట్లో గోల్డ్‌మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment