బెంగళూర్ : ఐటీలో స్లోడౌన్ కనుమరుగవుతుండటంతో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు రిక్రూట్‌మెంట్‌కు దిగుతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. మరోవైపు బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మాన్ శాక్స్ బెంగళూర్ సెంటర్‌లో ఇంజనీరింగ్ హెడ్‌కౌంట్‌ను భారీగా పెంచుకోవాలని కసరత్తు సాగిస్తోంది.
భారత్‌లో 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన గోల్డ్‌మాన్‌కు ప్రస్తుతం 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. తమ సంస్థ భారత్‌లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తోందని, గత ఐదేళ్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 20 శాతం పెరిగాయని గోల్డ్‌మాన్ శాక్స్ సర్వీసెస్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా తాము హైరింగ్ ప్రక్రియను చేపడతామని తెలిపారు. బెంగళూర్ సెంటర్ తమకు కీలకమని, ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ బిజినెస్‌ను కూడా అందిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment