వృద్ధి 4శాతమే: గోల్డ్‌మన్ శాక్స్
వృద్ధి 4శాతమే: గోల్డ్‌మన్ శాక్స్
Published Wed, Sep 4 2013 6:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) 4 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అంచనావేసింది. ఈ మేరకు తన క్రితం అంచనాలను 6 శాతం నుంచి కుదించింది. 2014-15లో కూడా వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది.
రూపాయి 72కు...
రానున్న ఆరు నెలల్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 72 కనిష్ట స్థాయిలను తాకుతుందని సైతం సంస్థ విశ్లేషించింది. ఈ విలువ 3 నెలలకు 70, ఆరు నెలల్లో 72కు, 12 నెలలకు తిరిగి 70కి చేరుతుందని (60 నిర్ణీత రేటు నుంచి) తన నివేదికలో విశ్లేషించింది.
విదేశీ నిధుల క్లిష్టత
అమెరికా ఫెడ్ ఆర్థిక సహాయక చర్యలను వెనక్కుతీసుకునే పరిస్థితులు తలెత్తితే భారత్, పలు ఆగ్నేయాసియా దేశాలు క్లిష్టమైన విదేశీ నిధుల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఆయా దేశాల్లో తీవ్రమవుతాయని అంచనావేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే, భారత్ వృద్ధి తీరు ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
Advertisement
Advertisement