హైదరాబాద్: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాక్స్‌కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌కి ప్రాధాన్యత పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో ఇక్కడ కొత్త నియమకాలు చేపడతామని ప్రకటించింది.
ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్‌మాన్ సాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. 2021 మార్చిన హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు.
రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 700ల మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2023 నాటికి హైదరాబాద్ ఆఫీస్‌లో 2500ల మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్‌మాన్ సాక్స్ తెలిపింది.
రాబోయే రోజుల్లో తాము నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకి హైదరాబరాద్ ఆఫీస్ కీలకంగా మారబోతుందని గోల్డ్‌మాన్ సాక్స్ చైర్మన్ డేవిడ్ ఎం సాల్మోన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment