న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్‌బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది.
వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్‌బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment