గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త! | IIFL Finance Offers Low Interest Rate On Gold Loan | Sakshi
Sakshi News home page

గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త!

Published Thu, Aug 12 2021 9:23 PM | Last Updated on Thu, Aug 12 2021 10:00 PM

IIFL Finance Offers Low Interest Rate On Gold Loan - Sakshi

మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. తక్కువ వడ్డీ రేటుకు ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్ లోన్ అందిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తీసుకున్న లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించవచ్చు అని పేర్కొంది. నెల, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షికనికి ఒకసారి గోల్డ్ లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించవచ్చు. 

ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు బంగారం/ఆభరణాలతో ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ బ్రాంచీని సందర్శించవచ్చు. కేవలం 30 నిమిషాల వ్యవధిలో రుణాన్ని పొందవచ్చు అని కూడా తెలిపింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వడ్డీ తిరిగి చెల్లింపుల కొరకు 5-7 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ డిజిగోల్డ్ లోన్ ఫెసిలిటీని కూడా లాంఛ్ చేసింది. "మహమ్మారి సమయంలో రైతులు & చిన్న వ్యవస్థాపకుల మూలధన అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ కాలానికి అందిస్తున్నాం. మా కస్టమర్లలో 70 శాతం మంది మళ్లీ వ్యాపారం కోసం మా వద్దకు రావడం మా నిజాయితీ, పారదర్శకతకు నిదర్శనం" అని బిజినెస్ హెడ్ - గోల్డ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శ్రీ సౌరభ్ కుమార్ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement