gold loans
-
రుణానికి సువర్ణ అవకాశం
హిందూపురం అర్బన్: బంగారం.. ఇప్పుడు అందరికీ అత్యవసర నిధి. అందుకే ధర భగ్గుమంటున్నా కొనేందుకు జనం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చాలా మంది బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా చాలా మంది భావిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలోనూ ఆదుకునే అత్యవసర నిధిగా భావిస్తున్నారు. అందుకే ధర ఎంతగా ఎగబాకినా...కొనేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. బంగారం చేతిలో ఉంటే క్షణాల్లో రుణం.. ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులకు వెళితే.. సవాలక్ష నిబంధనలు చెబుతారు. కొన్నిసార్లు నెలల తరబడి తిరిగినా రుణం మంజూరు కాని పరిస్థితి. కానీ ‘గోల్డ్ లోన్’(Gold loan) అలా కాదు. చేతిలో బంగారు నగలుంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు క్షణాల్లో రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కోసం ‘గోల్డ్ లోన్’ తీసుకొంటున్నారు. గ్రామగ్రామానా వెలిసిన సంస్థలు.. ‘గోల్డ్ లోన్’ వ్యాపారం భారీగా జరుగుతుండగా... హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. అవసరానికి అప్పులు పుట్టని చాలామంది ‘గోల్డ్‌లోన్’ తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ప్రైవేట్’ వ్యక్తుల వద్ద తీసుకునే రుణానికి వడ్డీ కొండంత ఉండటంతో చాలా మంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు.బ్యాంకులతో పాటు ప్రైవేటు సంస్థలు బంగారం నాణ్యతను బట్టి లోన్ మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ.52 వేలకుపైగా రుణం ఇస్తున్నారు. పైగా తక్కువ వడ్డీలకే రుణాలు మంజూరవుతుండటంతో చాలా మంది ‘గోల్డ్‌లోన్’ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రధాన బ్యాంకులతో పాటు సహకార సంఘ బ్యాంకులు, ముత్తూట్ మనీ, మణప్పరం, శ్రీరామ్ చిట్స్ తదితర సంస్థలు విరివిగా ‘గోల్డ్‌లోన్’ మంజూరు చేస్తున్నాయి. కొందరైతే బంగారాన్ని కుదవపెట్టి లోన్ తీసుకొని దాని ద్వారా వ్యాపారాలు చేస్తుండటం విశేషం. లాకరు అద్దె ఎందుకనీ... డబ్బున్న వారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచడం తగ్గించేశారు. అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే తీసుకున్న రుణంలో 90 శాతం మొత్తం నెలలోపు తీర్చేస్తున్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని ఏడాది తర్వాత వడ్డీతో కలిపి కట్టేస్తున్నారు. మళ్లీ బంగారాన్ని లోన్ కోసమంటూ బ్యాంకుల్లో పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని వివిధ బ్యాంకు శాఖల్లో కిలోల కొద్దీ బంగారం నగలు ఉంటున్నాయి. గోల్డ్ రుణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాంకుల్లోని సేఫ్ లాకర్లలో నగల మూటలూ పెరిగిపోతున్నాయి. నెలకు రూ.12 కోట్ల పైమాటే⇒ జిల్లా వాసులు ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల్లో నెలకు రూ.12 కోట్ల దాకా బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. గతంలో ఈ మొత్తం రూ.9 కోట్లలోపే ఉండేది. సంక్షేమ పథకాలు అమలుకాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉండడం లేదు. దీంతో అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ⇒ 80 శాతం మంది బ్యాంకుల్లోనే తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. ⇒ బంగారు రుణాలపై బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థలు 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ⇒ గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.⇒ హిందూపురానికి చెందిన నరేష్ చిరు ఉద్యోగి. ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.3 లక్షలు అవసరం కాగా, పలువురి వద్ద రుణం కోసం ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. మరోమార్గం లేక తన భార్య నగలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా జీతం వచ్చినప్పుడు వాయిదాలు చెలిస్తున్నాడు. అవసరానికి బంగారం లేక పోతే పిల్లలను చదివించడం కష్టమయ్యేదంటున్నాడు.⇒ ధర్మవరానికి చెందిన బాలాజీకి అత్యవసరంగా డబ్బు అవసరమైంది. ఎవరినైనా అడగాలంటే మొహమాటం.. అడిగినా ఇస్తారో లేదోనన్న అనుమానం. దీంతో భార్యతో చర్చించి చివరకు బంగారు నగలతో బ్యాంకుకు వెళ్లి ‘గోల్డ్ రుణం’ తీసుకున్నాడు.⇒ పుట్టపర్తికి చెందిన శిరీష్ కు ఇటీవలే వివాహమైంది. అత్తింటివారు తనకూ భార్యకు బంగారు నగలు చేయించారు. వాటిని ఇంట్లో పెట్టుకునేందుకు ధైర్యం చాలడం లేదు. బ్యాంకుకు వెళ్లి లాకర్ అడగ్గా...అందుబాటులో లేదన్నారు. పైగా ఏడాదికి అద్దె భారీగా చెల్లించాలని చెప్పారు. దీంతో శిరీష్ నగలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. నెలలో 90 శాతం మొత్తం రుణం చెల్లించాడు. మిగతా 10 శాతానికి వడ్డీ లాకర్ అద్దె కంటే తక్కువే అయ్యింది.⇒ ఇలా అవసరానికి ఒకరు..భద్రపరిచేందుకు మరికొందరు బ్యాంకుల ద్వారా ‘గోల్డ్ లోన్’ తీసుకుంటున్నారు. ఎవరి వద్దా చేయిచాపాల్సిన అవసరం లేకుండా ఏ ఆర్థిక అవసరం వచ్చినా ‘గోల్డ్’వైపు చూస్తున్నారు. -
రుణాలు బంగారంలా పెరిగాయ్!
సాక్షి, బిజినెస్ బ్యూరో: బంగారం ధర ఒక్కటే కాదు.. బ్యాంకుల్లో పసిడి తాకట్టు రుణాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో రూ.1,01,552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు.. డిసెంబర్ నాటికి రూ.1,72,581 కోట్లకు చేరాయి. అదే 2023 డిసెంబర్‌తో పోలిస్తే బంగారం రుణాల్లో ఏకంగా 71.3 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. అంతకుముందు ఏడాదిలో ఇది 17 శాతమే. భారత్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొత్తం పసిడి రుణాలు డిసెంబర్ నాటికి 41.66 శాతం పెరిగి.. రూ.43,745 కోట్లకు చేరాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్ తీరును ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. పసిడి ధరలకు రెక్కలు రావడంతో ఆభరణాలపై అందుకునే లోన్ విలువ కూడా పెరిగింది. రుణ గ్రహీతలు తమకు ఉన్న ఇతర రుణాల చెల్లింపుల కోసం గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతు న్నాయి. పెట్టుబడికే కాదు చదువులు, ఆరోగ్యం, వివాహం ఇలా ఏ అవసరంలోనైనా ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం కొనిపెట్టుకోవడం, అవసరానికి తాకట్టు పెట్టడం పెరుగుతోంది.బంగారం లాంటి సౌలభ్యం! ఎవరైనా ఇతర రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ హిస్టరీ తప్పదు. పైగా ప్రతి నెల ఈఎంఐ రూపంలో వడ్డీ, అసలు కట్టాల్సిందే. అదే గోల్డ్ లోన్‌కు ఏ అడ్డంకీ లేదు. నగలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత రుణం. చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుంది. నిర్దేశిత కాల పరిమితి ముగిసే సమయానికి బాకీపడ్డ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు, తీసుకునే మొత్తాన్ని బట్టి వార్షిక వడ్డీ 9 నుంచి 26 శాతం వరకు ఉంది. ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. 10 నిమిషాల్లో అప్పు పుడుతుంది. ఇంటికొచ్చి మరీ బంగారం రుణాలిస్తుస్న సంస్థలూ ఉన్నాయి. ఆభరణాల స్వచ్ఛతను బట్టి విలువలో 75 శాతం వరకు రుణం అందుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు 90 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. నెల నెలా వడ్డీ కట్టే విధానంగానీ, కాలపరిమితి ముగిశాక ఒకేసారి అసలు, వడ్డీ చెల్లించే విధానంగానీ ఎంచుకోవచ్చు. రుణం చెల్లించడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తారు. అయినా స్పందించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తారు.బంగారం, రుణాల లెక్కలివీ..వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం... 2024లో దేశంలో బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా నమోదైంది. 2023లో ఇది 761 టన్నులు మాత్రమే. భారతీయుల వద్ద మొత్తంగా సుమారు 25,000 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నట్టు అంచనా. ఇందులో 5.6 శాతం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. 2023–24లో పుత్తడి రుణ విపణి రూ.7.1 లక్షల కోట్లుగా ఉంటే.. రెండేళ్లలోనే రెండింతలైంది. మొత్తం బంగారం రుణాల్లో రూరల్ వాటా 35%, సెమీ అర్బన్ 42%, అర్బన్ వాటా 23 శాతంగా నమోదైంది. ఇక ఎన్బీఎఫ్సీలు అందిస్తున్న బంగారం రుణాల్లో రూ.30,000లోపు తీసుకునేవే 50శాతం దాకా ఉన్నాయి. అన్సెక్యూర్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కంటే గోల్డ్ లోన్ చవక. బంగారం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 63 శాతంకాగా.. మిగిలినది ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులది.ఇతర రుణాలు కఠినతరం కావడంతో..బ్యాంకుల కఠిన నిబంధనల కారణంగా పర్సనల్ లోన్లు, క్రెడిట్‌కార్డులు వంటి అన్సెక్యూర్డ్ రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణగ్రహీతలు ప్రత్యామ్నాయంగా బంగారం రుణాలపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత రుణాల విభాగం 2023 డిసెంబర్లో నమోదైన 20.8%తో పోలిస్తే 2024 డిసెంబర్లో వృద్ధి 9.7 శాతమే కావడం గమనార్హం. క్రెడిట్ కార్డ్ రుణాలు 2024 డిసెంబర్లో 15.6% పెరిగాయి. ముందటి ఏడాదిలో ఇది 32.6%. గృహ, వాహనాలు, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు సహా రిటైల్ లోన్ విభాగంలో బ్యాంకుల రుణాల వృద్ధి 2023 డిసెంబర్లో 17.6% నుంచి 2024డిసెంబర్లో 14.9 శాతానికి తగ్గిపోయిందని రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.స్టేట్ బ్యాంకులో గోల్డ్‌లోన్ ఇలా..ఎస్బీఐ.. 18–22 క్యారెట్ల ఆభరణాల స్వచ్ఛతను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ప్రతి 10 గ్రాములకు రూ.45,000 వరకు రుణం ఇస్తోంది. రుణ గ్రహీత మూడేళ్ల వరకు వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత లోన్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్ రీపేమెంట్ విధానంలో 6 నెలలు లేదా 12 నెలల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ విధానంలో గరిష్టంగా 10 గ్రాములకు రూ.48,000 వరకు లోన్ అందుకోవచ్చు. ప్రతి నెలా నిర్ధేశిత వడ్డీ చెల్లించాలి. టెన్యూర్ ముగిసే ముందు అసలు మొత్తాన్ని కట్టి లోన్‌ను క్లోజ్ చేసుకోవాలి. అయితే గోల్డ్ లోన్‌పై 90 రోజులపాటు వడ్డీ చెల్లించకపోతే ఖాతా ఎన్పీఏ (మొండి బకాయి) అవుతుంది. ఆ తర్వాత 90 రోజుల దాకా కూడా కస్టమర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే బంగారాన్ని వేలం వేస్తారు. ధర పెరిగి.. ఎక్కువ రుణం.. పసిడి ధర పెరిగిపోతుండటంతో దానిపై అందుకునే లోన్ మొత్తమూ పెరుగుతోంది. దీనితో జనం తమ అవసరాల కోసం బంగారం లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.87,650 దాటింది. గతేడాది ధర సుమారు రూ.64,000 మాత్రమే కావడం గమనార్హం.బంగారంపై రుణాల తీరు ఇదీ.. వార్షిక వడ్డీ: 9% నుంచి 26% వరకు రుణమిచ్చేది: కనిష్టంగా రూ.1,500 నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు కాల పరిమితి: 7 రోజుల నుంచి 4 ఏళ్ల వరకు.. ఆభరణం విలువలో రుణం: గరిష్టంగా 75 శాతం -
గోల్డ్‌లోన్ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా
పుంగనూరు: ఓ గోల్డ్‌లోన్ కంపెనీలో సిబ్బందే తమ సన్నిహితులు, బంధువులతో నకిలీ బంగారు తాకట్టు పెట్టించి రూ.8 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘కనకదుర్గ గోల్డ్‌లోన్స్ కంపెనీ’ పుంగనూరు, పలమనేరుల్లో బ్రాంచ్ నిర్వహిస్తోంది. బంగారు తాకట్టు పెట్టుకొని.. గ్రాముకు మార్కెట్ ధరకు అనుగుణంగా 70 నుంచి 80 శాతం వరకు రుణం ఇస్తోంది. సంస్థలోని ఆరుగురు ఉద్యోగులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు పక్కదారి పట్టారు.తమ సన్నిహితులు, బంధువుల్లో 20 మందిని ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించి.. డబ్బులు ఇస్తుండేవారు. కంపెనీ యాజమాన్యం డిసెంబర్లో నిర్వహించిన ఆడిట్లో నకిలీ బంగారు నగలుతో రూ.కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించింది. దీనిపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టింది.తమ కంపెనీకే చెందిన ఆరుగురు ఉద్యోగులు.. మరో 20 మందితో కలసి సుమారు 6 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలతో రూ.8 కోట్లు (పుంగనూరులో రూ.5 కోట్లు, పలమనేరులో రూ.3 కోట్లు) స్వాహా చేసినట్లు తేల్చింది. వారందరిపైనా యాజమాన్యం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో బంగారం తాకట్టు పెట్టిన పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బెనకా గోల్డ్ ఎండి భరత్
సాక్షి, హైదరాబాద్: బెనక గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని వినియోగదారులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెనక గోల్డ్ ఎండి భరత్ కుమార్ కోరారు. జూబ్లీహిల్స్ లోని బెనక గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్, రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతోపాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై కేసు కూడా నమోదయిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలిపారు. బెనక గోల్డ్ అనేది వినియోగదారులు తమ బంగారు ఆభరణాలను వివిధ సంస్థల్లో తాకట్టు పెడితే ఆ బంగారాన్ని విడిపించి వారికి నగదు చెల్లించే సంస్థ అని అన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సంస్థకు చెందిన 15కుపైగా బ్రాంచీలు ఉన్నాయని కావాలని కొంతమంది సంస్థ పేరును పాడు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వారిపై త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా సంస్థ పేరు చెప్పి వినియోగదారులకు వద్దకు వస్తె అనుమానం కలిగితే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 6366111999 కు కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ లీగల్ అడ్వైజర్ మహమ్మద్ మోహిసిన్, రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, భాస్కర్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
గూగుల్‌పేలో గోల్డ్ లోన్..
గూగుల్‌కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్‌పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్ల కోసం మరో ఎన్బీఎఫ్సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌తో కూడా గూగుల్‌పే జట్టు కట్టింది. గూగుల్‌పే అందిస్తున్న ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. -
జీపే ద్వారా ‘బంగారు’ రుణాలు
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్‌ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు. తెలుగులోనూ.. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్‌ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్‌ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది. తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్‌కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్‌లైన్
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్, మదింపు, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్-యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) మానిటరింగ్, రిస్క్-వెయిట్ అప్లికేషన్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.ఆర్బీఐ గుర్తించిన ప్రధాన లోపాలు⇒ రుణాల సోర్సింగ్, మదింపు కోసం థర్డ్ పార్టీలను ఉపయోగించడంలో లోపాలు⇒ కస్టమర్ లేకుండానే బంగారం మదింపు⇒ తగిన శ్రద్ధ, బంగారు రుణాల తుది వినియోగ పర్యవేక్షణ లేకపోవడం⇒ డిఫాల్ట్ అయిన రుణాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం⇒ ఎల్టీవీ పర్యవేక్షణలో లోపాలు⇒ రిస్క్-వెయిట్ల అమలులో తప్పులుఅంతేకాకుండా అవుట్సోర్స్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందు కోసం నెలల నెలల గడువును విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
పసిడి రుణాలకు భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.14.19 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అవసరాల్లో బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే ధోరణి దేశంలో గణనీయంగా పెరిగిపోతోంది. సంఘటిత రంగం బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపై రూ.14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘అసంఘటిత రంగంలో (వ్యక్తులు, పాన్బ్రోకర్ల వద్ద తనఖాలు) ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 2023–24లో సంఘటిత రంగంలో బంగారం రుణాల మార్కెట్ రూ.7.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా 14.85 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరుగుతూ 2029 మార్చి నాటికి రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుంది’’ అని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. ముఖ్యంగా బంగారం రుణాల్లో 79.1 శాతం వాటాతో దక్షిణాది మార్కెట్ అగ్రగామిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘భారతీయ కుటుంబాల వద్ద 25,000 టన్నుల బంగారం ఉంటుంది. దీని ప్రస్తుత విలువ రూ.126 లక్షల కోట్లు. బంగారం విలువపై ఇచ్చే రుణం (ఎల్టీవీ) విషయంలో ఆర్బీఐ కఠిన పరిశీలనల నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో బంగారం రుణాల మార్కెట్ మోస్తరు వృద్ధిని చూడొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వివరించింది. రుణాన్ని నగదు రూపంలో రూ.20 వేలకు మించి ఇవ్వరాదంటూ ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో.. కస్టమర్లు అసంఘటిత రంగంపై ఆధారపడడం పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల ద్వారా రుణాల జారీ ప్రక్రియపైనా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇవే ఎన్‌బీఎఫ్‌సీల షేర్ల ధరలు తగ్గడానికి దారితీశాయంటూ పీడబ్ల్యూసీ తన నివేదికలో వివరించింది. నిబంధనల అమలుకు ప్రాధాన్యం.. వ్యయ నియంత్రణ చర్యల అమలుతో బంగారం రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత పెరుగుతుందని, ఇన్వెస్టర్ల విశ్వాసం అధికమవుతుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు గణనీయంగా పెరగడం వీటిపై రుణ రేట్ల విషయంలో ఎన్బీఎఫ్సీలు అప్రమత్తంగా వ్యవహరించేలా చేసినట్టు వివరించింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే అది లోన్ టు వ్యాల్యూ పరిమితిని ఉల్లంఘనకు దారితీస్తుందని, నిర్వహణ పరమైన సమస్యలకు దారితీసి బంగారం వేలం వేయాల్సిన పరిస్థితులు రావొచ్చన్న ఆందోళనను పీడబ్ల్యూసీ నివేదిక ప్రస్తావించింది. బంగారం రుణ మార్కెట్ వృద్ధిని బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీలు నడిపిస్తాయని పేర్కొంది. బ్యాంక్‌లకు ఎక్కువ లబ్ధి ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల మార్కెట్ అయిన భారత్‌లో.. పరిశ్రమ మరింత వృద్ధి చెందడం వల్ల ఈ రంగంలోని అన్ని సంస్థలు ప్రయోజనం పొందొచ్చని ఈ నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంక్‌లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేసింది. ‘‘బంగారంపై రుణాలన్నవి పూర్వకాలం నుంచి ఉన్న విధానం.. వినియోగదారులతోపాటు, రుణాలిచ్చే సంస్థలకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉంటోంది’’అని పేర్కొంది. -
గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్బీఎఫ్సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం
ముంబై: పర్యవేక్షణ లోపాల కారణంగా ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాలు ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచి్చనట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ప్రస్తుత గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన వసూళ్లు, రికవరీ ప్రక్రియలను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. పసిడి రుణాలిచ్చేటప్పుడు, డిఫాల్ట్ అయిన సందర్భాల్లో వేలం వేసేటప్పుడు బంగారం స్వచ్ఛత, బరువును విలువ కట్టడంలో లోపాలు, పరిమితికి మించి నగదు రూపంలో రుణ మొత్తాన్ని మంజూరు చేయడం .. వసూలు చేయడం తదితర తీవ్ర ఉల్లంఘనలను కంపెనీ ఆడిట్లో గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ వివరించింది. అలాగే, ప్రామాణిక వేలం ప్రక్రియలను పాటించకపోవడం, కస్టమర్లకు విధించే చార్జీలపై పారదర్శకత లోపించడం మొదలైనవి కూడా కస్టమర్ల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపేవేనని ఆర్బీఐ తెలిపింది. సంస్థపై చేపట్టిన ప్రత్యేక ఆడిట్ పూర్తయ్యాక పర్యవేక్షణపరమైన ఆంక్షలను సమీక్షించనున్నట్లు వివరించింది. -
పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలదే హవా..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్ మధ్య కాలంలో మార్కెట్ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్ వాటా 61 శాతంగా నమోదైంది. కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది. వాటా పెంచుకుంటున్న బ్యాంకులు.. బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్‌బీఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్స్ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్బీఎఫ్సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించింది. -
బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...
బంగారం ఆర్థికంగా ఆపదలో ఆదుకుంటుందని అందరూ చెబుతారు. అవసరాలకు డబ్బు అందనపుడు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి అప్పు తెస్తుంటారు. ప్రైవేటు వ్యాపారులు, ఎన్బీఎఫ్సీలు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి. అయితే ఇతర సంస్థలు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు బంగారం తనఖాపై తక్కువే రుణం ఇస్తుంటాయి. అయినా తమ సొమ్మకు భరోసా ఉంటుందని భావించి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. సదరు బ్యాంకులో దురదృష్టవశాత్తు నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖాపెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరనే ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఓ బ్యాంకు అధికారి ఇలా తనఖా పెడుతున్న బంగారానికి సంబంధించి భద్రత ఎవరిపై ఉంటుందనే అంశాలను వెల్లడించారు. తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ‘సేఫ్’లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్ ఇన్‌ఛార్జి (క్లర్క్) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్ తాళాలు ఇద్దరి దగ్గరే ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు ఇతరులకు తాళాన్ని ఇస్తే తప్పా సొత్తును అపహరించడం కష్టం. ఇదీ చదవండి: భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..! బ్యాంకు శాఖల్లో ఆడిట్ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్‌లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపంచకుండాపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుని.. దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారని సీనియర్ అధికారి వివరించారు. -
పసిడి విలువను అర్థం చేసుకోవడం ఎలా? గోల్డ్ లోన్ గురించి తెలుసుకుందామా..
శతాబ్దాలుగా అనేక సంస్కృతుల్లో సమృద్ధి, సంపదకు పర్యాయపదంగా పసిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆర్థిక భద్రతకు విశ్వసనీయమైన సాధనంగా కూడా ఉంటోంది. పసిడితో ప్రయోజనాలు పొందే మార్గాల్లో బంగారం రుణం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో బంగారం రుణాలను డీకోడ్ చేసేందుకు, పసిడి విలువను తెలియజెప్పేందుకు ప్రయత్నమే ఈ కథనం. పసిడి ఆభరణాలను (18–24 క్యారట్ల స్వచ్ఛత కలిగినవి) తనఖా పెట్టి తీసుకునే రుణాలను గోల్డ్ లోన్‌గా వ్యవహరిస్తారు. సురక్షితమైన గ్యారంటీగా పరిగణిస్తారు కాబట్టి మిగతా అన్సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్‌ను వేగవంతంగా, సులభతరంగా పొందవచ్చు. పసిడి విలువను అర్థం చేసుకోవడం.. తక్షణ లిక్విడిటీ: ఇతర అసెట్లతో పోలిస్తే బంగారాన్ని వేగంగా లిక్విడేట్ చేయొచ్చు. అంటే దాన్ని సత్వరం విక్రయించి నగదు పొందవచ్చు లేదా తనఖా ఉంచి రుణాన్నీ తీసుకోవచ్చు. ఈ లిక్విడిటీ కారణంగానే బంగారాన్ని తనఖా పెట్టినప్పుడు ఆర్థిక సంస్థలు రుణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుంటాయి. రుణ పరిమాణం విషయంలో సౌలభ్యత: సాధారణంగా బంగారం విలువలో నిర్దిష్ట శాతంగా రుణ మొత్తం ఉంటుంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీ పసిడి క్రెడిట్ విలువ కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గరున్న బంగారం విలువను తరచుగా మదింపు చేసుకుంటూ ఉంటే వాటిపై ఎంత రుణం లభించే అవకాశం ఉంటుందనేది తెలుసుకోవచ్చు. వడ్డీ రేటు తక్కువ: బంగారం రుణాలు సురక్షితమైనవి కావడంతో రుణదాతలకు రిస్కు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు వీలుంటుంది. అయితే, ఇది రుణమిచ్చే సంస్థ, లోన్–టు–వేల్యూ నిష్పత్తి ప్రకారం మారుతుంటుంది. క్రెడిట్ స్కోరుపరమైన ప్రయోజనాలు: క్రెడిట్ హిస్టరీ లేనివారికి లేక క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి బంగారం రుణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రెడిట్ హిస్టరీ పెద్దగా లేకపోయినా బంగారంపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించేస్తే మీ క్రెడిట్ స్కోరుపైనా సానుకూల ప్రభావం ఉండగలదు. రీపేమెంటులో సౌలభ్యం: చాలా మటుకు సంస్థలు నెలావారీగా చెల్లింపులు, వడ్డీని ముందస్తుగా కట్టి.. అసలును ఆఖర్లో కట్టడం లాంటి వివిధ రకాల రీపేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన అంశాలు .. బంగారంపై రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలూ కొన్ని ఉన్నాయి. అవేమిటంటే... ధరల్లో హెచ్చుతగ్గులు: బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. రేటు భారీగా పడిపోయిందంటే రుణాలిచ్చిన సంస్థలు మరింత ఎక్కువ విలువైన వాటిని తనఖా పెట్టాలని అడగొచ్చు లేదా వ్యత్యాసాన్ని చెల్లించమని అడగొచ్చు. విలువ–రుణ నిష్పత్తి: బంగారం పూర్తి రేటుపై బ్యాంకులు రుణాలివ్వవు. పసిడి విలువలో నిర్దిష్ట శాతం మాత్రమే ఇస్తాయి. ఇది బ్యాంకు, నియంత్రణ నిబంధనలను బట్టి 60–90 శాతంగా ఉండొచ్చు. భద్రత: మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచేలా రుణాలిచ్చే సంస్థ తగిన భద్రతా చర్యలు తీసుకుంటోందా లేదా చూసుకోవాలి. చివరిగా చెప్పేదేమిటంటే బంగారమనేది అలంకారానికి, ఏళ్లకు ఏళ్లు లాకర్లలో భద్రపర్చుకునేందుకు మాత్రమే పరిమితమైనది కాదు. సరిగ్గా వాడుకుంటే ఆర్థిక సమస్యల వేళ ఎంతగానో ఉపయోగపడగలదు. అయితే, మిగతా అన్ని ఆర్థిక సాధనాల్లాగే బంగారం రుణాల షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం, మెరుగైన డీల్ లభించేలా చూసుకోవడం ముఖ్యం. -
బంగారం రుణాల్లో రెండో స్థానానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దేశంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల కంపెనీగా అవతరించింది. మణప్పురం ఫైనాన్స్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.23,690 కోట్లను అధిగమించింది. మణప్పురం ఫైనాన్స్ నిర్వహణలో బంగారం రుణాలు రూ.20,809 కోట్లుగానే ఉన్నాయి. ఆస్తుల నిర్వహణ పరంగా బంగారం రుణాల వితరణలో రెండో అతిపెద్ద సంస్థగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్టు బంగారం రుణాల హెడ్ సౌరభ్ కుమార్ తెలిపారు. బంగారం రుణాల మార్కెట్లో రూ.66,089 కోట్ల నిర్వహణ ఆస్తులతో ముత్తూట్ ఫైనాన్స్ మొదటి స్థానంలో ఉంది. ‘‘18.6 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 70 శాతం మంది కస్టమర్లు మళ్లీ మళ్లీ మా సేవలను వినియోగించుకునే వారే. దీంతో ముందస్తు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు’’అని కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 25–27 శాతం వృద్ధి చెందుతుందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 1,486 పట్టణాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. -
పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్
ఆధునిక కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. మనకు సంబంధం లేకుండానే మనపేరు మీద లోన్ తీసుకోవడం వంటి సంఘటనలు గత కొంత కాలంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం పాన్, ఆధార్ జిరాక్స్ కాపీల కోసం జిరాక్స్ సెంటర్‌కు వెల్తూ ఉంటాము. అలాంటప్పుడు మన కాపీలను కొంతమంది వినియోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. నిజానికి మనకు సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మెసేజ్‌లు లేదా మెయిల్స్ వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిగ్గా పట్టించుకోకుంటే మోసపోయినట్లు చివరి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి ఉదండమే తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 8.5కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు సంబంధించిన నిల్వల్లో తేడాలున్నట్లు ఆడిట్లో తెలిసింది. దీనిపైన బ్యాంకు డిప్యూటీ మేనేజర్ 'బైరిశెట్టి కార్తీక్'పై అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 5 పద్ధతుల్లో 128 ఖాతాదారులపేరిట గోల్డ్ లోన్ పొందినట్లు రికార్డులు తయారు చేసి బ్యాంకును మోసం చేసినట్లు, వచ్చిన డబ్బును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు వెల్లడించారు. -
మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!
ఆదిలాబాద్: ఘరానా మోసగాడు దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన సంఘటన మండలంలోని కన్కపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు నాగన్న అనే రైతు ఇంటికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్‌పై వచ్చాడు. నాగన్న–లక్ష్మి దంపతులతో నేను బ్యాంకు నుంచి వచ్చాను. మీరు ఇంతకు ముందు బ్యాంకులో గోల్డ్‌లోన్ తీసుకున్నారుగా, మీకు లోన్ మాఫీ వచ్చిందని, మరింతగా రెట్టింపు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మిన ఆ దంపతులు లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును భర్త నాగన్నకు ఇచ్చింది. నాగన్నను అతడి బైక్‌పై ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ గ్రామ పరిధిలోని సబ్‌స్టేషన్ వరకు తీసుకెళ్లి అతడి వద్ద నుంచి గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా 251 పసిడి రుణాల షాపీలు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా 251 బంగారం రుణాల షాపీలను ప్రారంభించింది. వీటిలో 35 షాపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. కొత్త వాటి ప్రారంభంతో మొత్తం సంఖ్య 1,238కి చేరింది. బంగారంపై రుణాలపరమైన సరీ్వసులు అందించేందుకు బ్యాంకు శాఖలోనే ప్రత్యేకంగా కేటాయించిన ఎన్క్లోజర్ను షాపీగా వ్యవహరిస్తారు. ఇందులో ఒక ఇంచార్జి, కనీసం ఇద్దరు అప్రైజర్లు ఉంటారు. రుణాలపై నిర్ణయాధికారం ఇంచార్జికే అప్పగిచడం వల్ల ప్రాసెసింగ్ మరింత వేగవంతం కాగలదని బీవోబీ ఈడీ అజయ్ కే. ఖురానా తెలిపారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో బంగారంపై అధిక మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, రూ. 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజులు లేవని ఆయన పేర్కొన్నారు. -
ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్ అనే అగ్రిటెక్ యాప్ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ విభాగం హెడ్ మునీష్ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో ఉజ్జీవన్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా తెలంగాణకు కార్యకలాపాలు విస్తరిస్తోంది. తొలుత అయిదు శాఖలను ప్రారంభించనుంది. వీటిలో నాలుగు వచ్చే వారంలోనూ, మరొకటి వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఇతిరా డేవిస్ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాది వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు, అలాగే తమ టాప్ 10 మార్కెట్లలో తెలంగాణ కూడా ఒకటిగా నిలవగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు డేవిస్ తెలిపారు. ప్రస్తుతం 71 లక్షలకు పైగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తున్నామని, కొత్త వాటితో కలిపి ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 598 శాఖలు ఉంటాయని వివరించారు. పసిడి, ట్రాక్టర్ లోన్స్‌పై దృష్టి.. బంగారం రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, ట్రాక్టర్ లోన్స్పైనా దృష్టి పెడుతున్నట్లు డేవిస్ చెప్పారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో సూక్ష్మ రుణాల విభాగం 71 శాతంగా ఉండగా మిగతాది అఫోర్డబుల్ హౌసింగ్ మొదలైన విభాగాల్లో ఉంటోందని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోను 50 శాతానికి తగ్గించుకోవడం ద్వారా సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతౌల్యం సాధించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి శాఖల సంఖ్యను 625కి పెంచుకోనున్నామని డేవిస్ చెప్పారు. తెలంగాణ శాఖల్లో తొలుత 30 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరోవైపు, మాతృ సంస్థను విలీనం చేసుకునే రివర్స్ మెర్జర్ ప్రక్రియ జూన్–సెప్టెంబర్ మధ్యలో పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. -
గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?,ఈ బంపరాఫర్ మీ కోసమే!
ఎన్బీఎఫ్సీ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ‘గోల్డ్ లోన్ మేళా బంపర్ ధమాకా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఈ నెల 15న మొదలు కాగా, డిసెంబర్ 31వరకు కొనసాగుతుందని తెలిపింది. బంగారంపై రుణం తీసుకునే వారికి లగ్జరీ కారు, బైక్‌లు, స్మార్ట్ఫోన్లతోపా టు, కచ్చితమైన ఓ బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. -
పసిడి రుణాలపై విస్తృత ప్రచారం
హైదరాబాద్: విద్య సహా పలు కుటుంబ పురోభివృద్ధి చర్యలకు, యువత ఉన్నతకి బంగారం రుణాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దేశంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దిగ్గజ గోల్డ్‌లోన్ ఎన్బీఎఫ్సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి’ (పుట్ యువర్ గోల్డ్ టు వర్క్) అనే సందేశంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రచారాన్ని విభిన్న మాధ్యమాలు– టీవీ, ప్రింట్, రేడియో, కేబుల్ టీవీ, మ్యాగజైన్, థియేటర్, మల్టీప్లెక్స్, ఓఓహెచ్, బీటీఎల్, ఆన్ గ్రౌడ్ యాక్టివేషన్స్, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ బిజిమాన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేస్తున్న ప్రకటనల్లో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు– బ్రహ్మానందం, జానీ ఆంటోనీ, సాధు కోకి, రెడిన్ కింగ్ల్సేలు నటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
గోల్డ్ లోన్స్: ఎస్బీఐ సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుత్తడి రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన రికార్డు సృష్టించింది. రూ.1 లక్ష కోట్ల బంగారు రుణాలను మంజూరు చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. గోల్డ్ లోన్ విభాగంలో భారత్‌లో సంస్థకు 24 శాతం మార్కెట్ వాటా ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. క్రితంతో కంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా రుణం పొందే విషయంలో పుత్తడి మరింత ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా మారుతుందన్నారు. ఈ విభాగంలో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2021-22లో రిటైల్ లోన్స్ విభాగం 15 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అన్ని రకాల వృద్ధి అవసరాలను తీర్చగల స్థితిలో బ్యాంక్ ఉందని ఖరా పేర్కొన్నారు. -
భారత్‌పే.. బంగారు రుణాలు
ముంబై: ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తాజాగా బంగారం రుణాల విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం కొన్ని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో (ఎన్బీఎఫ్సీ) చేతులు కలిపింది. బంగారం తనఖాపై రూ. 20 లక్షల వరకూ రుణాలు ఆఫర్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో తమ వ్యాపార కస్టమర్లకు ఈ సర్వీసు అందుబాటులో ఉందని భారత్‌పే తెలిపింది. దీన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి 20 నగరాలకు విస్తరించనున్నట్లు, సుమారు 500 కోట్ల మేర రుణాలు మంజూరు చేయగలమని ఆశిస్తున్నట్లు వివరించింది. వడ్డీ రేటు వార్షికంగా అత్యంత తక్కువగా సుమారు 4.7 శాతంగా ఉంటుందని, దరఖాస్తు ప్రక్రియ.. రుణ వితరణ డిజిటల్ పద్ధతిలో 30 నిమిషాల్లోపే పూర్తి కాగలదని పేర్కొంది. 6,9,12 నెలల కాల వ్యవధికి కస్టమర్లు రుణాలు తీసుకోవచ్చని భారత్‌పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుహెయిల్ సమీర్ తెలిపారు. రెండు నెలల పాటు పైలట్ ప్రాతిపదికన పసిడి రుణాల స్కీమ్‌ను పరీక్షించామని, రూ. 10 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. -
బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!
ప్రముఖ మర్చంట్స్ పేమెంట్స్ ఫ్లాట్ ఫారం భారత్ పే తమ మర్చంట్ భాగస్వాములకు శుభవార్త చెప్పింది. తమ మర్చంట్ భాగస్వాములకు బంగారు రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇంతకు ముందు అసురక్షిత రుణాల కేటగిరీలోని కొలాటరల్ ఫ్రీ రుణాలను అందజేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుహైల్ సమీర్ నేతృత్వంలోని ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆమోదం గల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ)తో చేసుకున్న భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షల వరకు బంగారు రుణాలను అందించనున్నట్లు తెలిపింది. భారత్ పే కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వ్యాపారులకు బంగారు రుణాలను అందిస్తున్నట్లు ప్రారంభించింది. 2022 చివరి నాటికి 20 నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. 2022 చివరి నాటికి ₹500 కోట్ల రుణాలను నెలకు 0.39% వడ్డీరేటుతో అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, అసెస్ మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లోనే రుణం మంజూరు చేయనున్నట్లు భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పే యాప్‌లో సులభంగా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ భాగస్వామ్యంతో సంస్థ డోర్ స్టెప్, బ్రాంచ్ కలెక్షన్ సేవలు రెండింటినీ అందిస్తోంది. వ్యాపారులు ఆరు, తొమ్మిది, 12 నెలల పాటు రుణాలు తీసుకోవచ్చు. ఈజీ డైలీ ఇన్స్టాల్ మెంట్(ఈడిఐ) ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్ కూడా వారికి ఉంది. కంపెనీ త్వరలో ఈక్వేటెడ్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) చెల్లింపును ప్రారంభించనుంది. భారత్ పేను 2018లో షష్వత్ నక్రానీ, భావిక్ కొలదియా కలిసి స్థాపించారు. (చదవండి: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం..!) -
బంగారు రుణ ఎన్బీఎఫ్సీలు జిగేల్!
ముంబై: బ్యాంకుల నుంచి పోటీ తీవ్రతరం అవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరింత దూకుడుగా తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లిక్విడిటీపరంగా సురక్షితమైన బంగారం రుణాలపై అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం చాలా మటుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యంకులు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు బ్యాంకుల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 2021 ఆరి్థక సంవత్సరంలో 89 శాతం ఎగిసి రూ. 60,700 కోట్లకు, ఆ తర్వాత 2022 ఆరి్థక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ. 70,900 కోట్లకు చేరినట్లు వివరించింది. ‘బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, పసిడి ధరల్లో భారీ పెరుగుదల అవకాశాలు (గతంలో చూసినంతగా) కనిపించకపోతుండటంతో ఎన్బీఎఫ్సీలు.. ముఖ్యంగా భారీ స్థాయిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఉన్నవి.. తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దూకుడుగా వ్యూహాలు అమలు చేయవచ్చు. కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చు‘ అని ఏజెన్సీ పేర్కొంది. మార్జిన్ల విషయంలో రాజీపడినా సరే.. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లను పోగొట్టుకోకుండా వీలైన ప్రయత్నాలు అన్నీ చేయ నున్నాయి. అవసరమైతే భారీ రుణాలపై మార్జిన్లను తగ్గించుకోవడంతో పాటు నిబంధనలను సరళతరం చేయడం మొదలైనవి చేసే అవకాశం ఉంది. దీని వల్ల నిర్వహణ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కోవిడ్ కష్టాలతో వేలం.. కరోనా వైరస్ కష్టకాలం కారణంగా బంగారం రుణ గ్రహీతలకు ఆరి్థక ఇబ్బందులు నెలకొనడం, గతేడాది జూన్–సెపె్టంబర్ మధ్య కాలంలో పసిడి ధరలు 10 శాతం మేర కరెక్షన్కు లోనవడం తదితర అంశాల కారణంగా ఎన్బీఎఫ్సీలు ఏప్రిల్–డిసెంబర్ కాలంలో తనఖా పెట్టిన బంగారాన్ని భారీ స్థాయిలో వేలం వేయాల్సి వచ్చింది. అక్టోబర్ నుంచి పసిడి ధరలు కాస్త స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేలం విషయంలో పరిస్థితులు కాస్త చక్కబడగలవని నివేదిక అభిప్రాయపడింది. ఎన్బీఎఫ్సీల్లో పసిడి వేలం భారీగా పెరిగినప్పటికీ.. బ్యాంకుల్లో మాత్రం దీని తీవ్రత అంతగా నమోదు కాలేదని పేర్కొంది. బంగారం విలువపై బ్యాంకులు ఇచ్చే రుణం (ఎల్టీవీ) నిష్పత్తి ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!
ఎస్బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది. అలాగే, ఎస్బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది. Upgrade to a good life with fantastic deals for your brand new four-wheels on Car Loan by SBI. Apply now on YONO app or Know more: https://t.co/aYhi3C6dC8#SBI #StateBankOfIndia #SBICarLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zOmgzHH4rS — State Bank of India (@TheOfficialSBI) January 17, 2022 Give your gold the opportunity to enhance your life with Gold Loan by SBI! Apply now on YONO app or Know more: https://t.co/u3h7OdQHtZ#SBI #StateBankOfIndia #SBIGoldLoan #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/XgJ8Z9ooAC — State Bank of India (@TheOfficialSBI) January 16, 2022 ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్‌తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. Grab the opportunity to fulfil all your dreams with great offers on Personal Loan by SBI. Avail SBI Personal Loan on YONO app or Know more: https://t.co/biL9usmNSz#SBI #StateBankOfIndia #SBIPersonalLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zLx823coPd — State Bank of India (@TheOfficialSBI) January 18, 2022 (చదవండి: ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!) -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
తనయుడిని హత్య చేసి దంపతుల ఆత్మహత్య
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్వైజర్ శక్తివేల్‌ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు! -
తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్..
విజయవాడ: అదితి గోల్డ్ లోన్ సంస్థ నిర్వాహకులు తక్కువ వడ్డీకే రుణం అంటూ ప్రచారం గుప్పించారు. ఆపై తమ వద్ద ప్రజలు కుదువ పెట్టిన బంగారంతో పరారయ్యారు. తమ సంస్థలో వ్యాపార భాగస్వామ్యం ఇస్తామంటూ కూడా పలువురిని మోసగించారు. ఈ కంపెనీ నిర్వాహకుల మోసాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ మహర్షి విజయవాడ భవానీపురంలోని స్వాతి సెంటర్లోని ఓ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని ఈ ఏడాది జూన్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థను ఏర్పాటు చేశారు. 75 పైసల వడ్డీకే బంగారంపై రుణం ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. కొద్ది రోజుల్లోనే వందలాది మంది ఈ సంస్థను ఆశ్రయించారు. వేరే ఇతర ఫైనాన్స్ సంస్థల్లో, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన వారు సైతం ఈ సంస్థకు బంగారాన్ని మార్చారు. వడ్డీ తక్కువ కావడంతో ఎక్కువ మొత్తంలో బంగారం తాకట్టు పెట్టిన వారు అధికంగా ఉన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం భవానీపురానికి చెందిన ఓ గృహిణి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థలో అరకిలో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఆగస్టులో 200 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సెప్టెంబర్ చివరి వారంలో సంస్థ బోర్డ్ తిప్పేయడంతో బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేయడం మినహా బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం పలువురు బాధితులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ సంస్థ ద్వారా మోసం పోయిన బాధితులు వందల్లో ఉంటారని సమాచారం. వ్యాపార భాగస్వామ్యం పేరుతో.. వ్యాపార భాగస్వామ్యం ఇస్తామని ఇదే సంస్థ నిర్వాహకులు జిల్లాలో పలువురిని మోసం చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వాహకుడి నుంచి రూ.5 లక్షలు, మరో గోల్డ్ టెస్టింగ్ షాపు యజమాని నుంచి రూ.5 లక్షలు తీసుకుని ఉడాయించారు. నకిలీ ఐఎస్ఓ, జీఎస్టీ, మైక్రో ఫైనాన్స్ సర్టిఫికెట్లను చూపించి అదితి గోల్డ్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భవానీపురం సీఐ మురళీకృష్ణను వివరణ కోరగా గోల్డ్ లోన్ సంస్థపై ఫిర్యాదులు అందాయని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చదవండి: ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది! -
ముత్తూట్ లాభం అప్
ముంబై: గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,002 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 926 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,821 కోట్ల నుంచి రూ. 3,052 కోట్లకు ఎగసింది. దీనిలో వడ్డీ ఆదాయం రూ. 2,729 కోట్ల నుంచి రూ. 3,003 కోట్లకు బలపడింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నిర్వహణలోని ఆస్తుల(రుణాలు) విలువ(ఏయూఎం) 17 శాతం ఎగసి రూ. 60,919 కోట్లను తాకింది. బంగారు రుణాలకు డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ ప్రారంభంకావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లోనూ పటిష్ట పనితీరును చూపగలమని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిని సాధించగలమని అంచనా వేశారు. -
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్...!
పండగ సీజన్లో మరింత ఆనందాన్ని అందించేందుకు రకరకాల డీల్స్, ఆఫర్స్‌తో గతంలో ఎన్నడు లేని రీతిలో తన బ్యాంకింగ్ సేవలు, లావాదేవీలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అత్యంత ఆకర్షణీయంగా మార్చింది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందించనుంది. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)పై 7.2%, బంగారు అభరణాలపై 7.30% రేటుకు పీఎన్బీ ఇప్పుడు రుణాలు అందిస్తోంది. దాంతోపాటుగా హోమ్ లోన్ రేట్లను కూడా పీఎన్బీ తగ్గించింది. హోమ్‌లోన్ వడ్డీరేటు 6.60 శాతం నుంచి అందుబాటులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీరేట్లకే పలు లోన్లను పీఎన్బీ అందిస్తోంది. కారు లోన్స్ 7.15 శాతం, పర్సనల్ లోన్స్ 8.95శాతం మేర వడ్డీ రేట్లకు అందుబాటులో ఉంది. ఇటీవల హోమ్లోన్స్, వెహికిల్ లోన్‌పై ప్రకటించిన విధంగా ఇప్పుడు పండగ సీజన్లో బంగారు అభరణాలు, ఎస్‌జీబీపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజును పీఎన్బీ పూర్తిగా తొలగించింది. హోమ్ లోన్స్‌పై మార్జిన్స్‌కు కూడా బ్యాంక్ తగ్గించింది. హోమ్‌లోన్ తీసుకోదలిచిన వారు రుణ మొత్తంపై ఎటువంటి అప్పర్ సీలింగ్ లేకుండా ఆస్తి విలువలో ఇప్పుడు 80% వరకు పొందవచ్చు. చదవండి: పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త! -
రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చేసిన ఒక ట్వీట్లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) Start the festive celebrations with special offers on Car Loan, Gold Loan and Personal Loan from SBI. Get started today! Apply Now: https://t.co/BwaxSb3HYQ#SBI #StateBankOfIndia #HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan pic.twitter.com/Ebx69ujTYf — State Bank of India (@TheOfficialSBI) September 22, 2021 అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. Get drenched in happiness, as it's raining offers with SBI. Avail a 100% Processing Fee waiver on Car Loan, Gold Loan and Personal Loan. Know more at https://t.co/8gV2D7FEFG#SBI #CarLoan #GoldLoan #PersonalLoan #ItsRainingOffersWithSBI pic.twitter.com/fTcMvYShyq — State Bank of India (@TheOfficialSBI) August 16, 2021 కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లను’ ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు 14 వరకు అమల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది. -
బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!
భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది. ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్‌బీఎఫ్‌సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది. కరోనా కష్టాల్లో ఆసరా.. బంగారం రుణాల మార్కెట్ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్డౌన్లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి. గతేడాది ఆగస్ట్‌లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. ప్రభుత్వ బ్యాంకుల పాత్ర బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్ బరోడా రిటైల్ బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్ బ్యాం కు 70 శాతం, సీఎస్బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి. లిక్విడిటీ ఎక్కువ.. బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్‌ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది. అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు. ‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో అంత చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్ ఎన్బీఎఫ్సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్బీఎఫ్సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్ లోన్స్). డిఫాల్ట్ (రుణ ఎగవేతలు) రిస్క్ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి. పెరిగిన ధరలతో అధిక రుణం ఒకవైపు అధిక ఎల్టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్‌ను అధిక శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలే శాసిస్తుంటాయి. కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్బీఎఫ్సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది. -
గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త!
మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. తక్కువ వడ్డీ రేటుకు ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్ లోన్ అందిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తీసుకున్న లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించవచ్చు అని పేర్కొంది. నెల, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షికనికి ఒకసారి గోల్డ్ లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు బంగారం/ఆభరణాలతో ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ బ్రాంచీని సందర్శించవచ్చు. కేవలం 30 నిమిషాల వ్యవధిలో రుణాన్ని పొందవచ్చు అని కూడా తెలిపింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వడ్డీ తిరిగి చెల్లింపుల కొరకు 5-7 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ డిజిగోల్డ్ లోన్ ఫెసిలిటీని కూడా లాంఛ్ చేసింది. "మహమ్మారి సమయంలో రైతులు & చిన్న వ్యవస్థాపకుల మూలధన అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ కాలానికి అందిస్తున్నాం. మా కస్టమర్లలో 70 శాతం మంది మళ్లీ వ్యాపారం కోసం మా వద్దకు రావడం మా నిజాయితీ, పారదర్శకతకు నిదర్శనం" అని బిజినెస్ హెడ్ - గోల్డ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శ్రీ సౌరభ్ కుమార్ అన్నారు. -
గోల్డ్‌లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ శుభవార్త...!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్తను అందించింది. ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ రుణాలను తీసుకునేవారికి వడ్డీరేట్లపై రాయితీని ప్రకటించింది. గోల్డ్రుణాల వడ్డీరేట్లపై సుమారు 0.75 శాతం రాయితీను ఎస్బీఐ అందించనుంది. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. ఎస్బీఐ గోల్డ్ రుణాలపై 7 శాతం నుంచి 29 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తోంది. ఎస్బీఐ గోల్డ్లోన్లను ఇప్పుడు యోనో యాప్‌ను ఉపయోగించి కూడా రుణాలను పొందవచ్చును. తక్కువ పేపర్ వర్క్, తక్కువ ప్రాసెసింగ్ టైంతో గోల్డ్‌లోన్స్ యోనో యాప్ ద్వారా పొందవచ్చును. కరోనా రాకతో ఖాతాదారులు ఎక్కువగా గోల్డ్ లోన్‌పై ఆధారపడ్డారు. అంతేకాకుండా కరోనా సమయంలో గోల్డ్ లోన్స్ కూడా గణనీయంగా పెరిగాయి. యోనో యాప్ ఉపయోగించి ఇలా గోల్డ్‌లోన్ పొందండి. ముందుగా మీ మొబైల్లోని యోనో యాప్‌ను ఓపెన్ చేయండి. యోనో యాప్‌లోకి లాగిన్ అయ్యాక హోమ్‌పేజీలో ఎగువ ఎడమవైపు ఉన్న మెనూ (మూడు లైన్లు) పై క్లిక్ చేయాలి. లోన్స్ ఆప్షన్లపై క్లిక్ చేయాలి. గోల్డ్ లోన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆప్లై నౌ పైక్లిక్ చేయండి. తరువాత పేజీలో ఆభరణాల వివరాలను (రకం, పరిమాణం, క్యారెట్ నికర బరువు) డ్రాప్‌డౌన్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర వివరాలతో (రెసిడెన్షియల్ రకం, వృత్తి రకం) నింపాల్సి ఉంటుంది. , మీ నెలవారీ ఆదాయాన్ని ఫిల్ చేయండి. అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి. బంగారంతో దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకును సంప్రదించండి. తాకట్టు పెట్టాల్సిన బంగారంతో పాటు 2 ఫోటోలు, కేవైసీ పత్రాలతో బ్రాంచ్‌కు వెళ్లండి. సంబంధిత లోన్ ఆప్లికేషన్ ఫాంలో సంతకం చేయండి. బ్యాంకు సిబ్బంది బంగారాన్ని నిర్ధారించిన తరువాత మీకు బంగారం విలువను బట్టి బ్యాంకు రుణాలను ఇస్తుంది. -
పర్సనల్ లోన్, బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే
ప్రతి ఒక్కరికి ఆర్ధిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు బ్యాంక్‌లోన్, లేదంటే బంగారంపై లోన్ తీసుకోవడమో చేస్తుంటారు. అదే సమయంలో ఏ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మంచిదో ఆలోచించరు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామా? లేదా? అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. అయితే ఆర్ధిక నిపుణులు మాత్రం బ్యాంక్ లోన్, బంగారంపై లోన్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాంక్‌లోన్, బంగారంపై లోన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వడ్డీ రేట్లు: బ్యాంక్ లోన్ మన ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటే పర్సనల్ లోన్‌పై సాధారణంగా 10నుంచి 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారనే అంశంతో పాటు రిస్క్ అసెస్మెంట్ను బట్టి బంగారంపై తీసుకునే లోన్లపై వడ్డీ రేటు 7.00 నుంచి 29 శాతం వరకు ఉంటుంది. రుణం మొత్తం: తీసుకున్న మొత్తాన్ని ఎంత కాలంలో చెల్లిస్తారనే అంశాన్ని బట్టి రూ .50,000 నుండి 15 లక్షల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు 30 లక్షల నుండి 40 లక్షల వరకు లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంటాయి. బంగారంపై రుణం: బంగారంపై ఇచ్చే రుణం లోన్-టు-వాల్యూ (ఎల్టివి) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది. ప్రస్తుత మార్కెట్లో దాని వ్యాల్యూ ఎంత ఉంది. మీరు ఎంత లోన్ కావాలనుకుంటున్నారు? మీకు కావాల్సిన లోన్ కి, మార్కెట్ లో బంగారంపై ఉన్న రేట్‌కి ఎంత వ్యత్యాసం ఉంది' అనే విషయాల్ని పరిగణలోకి తీసుకొని లోన్ వ్యాల్యూను మార్చేస్తుంటాయి. బంగారు లోన్ ఎల్టివి నిష్పత్తిపై ఆర్బీఐ 75 శాతం విధించింది. ప్రాసెసింగ్ టైమ్ : లోన్ ఇచ్చే ముందు జరిగే ప్రాసెస్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇలా జత చేసిన అనంతరం లోన్ ఇచ్చే సమయం 2 రోజుల నుంచి 7వరకు ఉంటుంది. లోన్ ప్రాసెస్ తొందరగా పూర్తయితే మనకు కావాల్సిన లోన్ తొందరగానే వస్తుంది. తిరిగి చెల్లించే సమయం : తీసుకున్న లోన్ ను కొన్ని బ్యాంక్ లు లేదంటే ఆర్ధిక సంస్థలు 7 సంవత్సరాల వరకు గడువును విధిస్తాయి. అయితే పర్సనల్ లోన్ సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బంగారంపై తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే సమయం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంక్‌లు 4 నుంచి 5 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాయి. పేలవమైన క్రెడిట్ ప్రొఫైల్: వడ్డీ రేట్లు మీ బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారిపోతుంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్‌లు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ స్కోర్లు, నెలవారీ ఆదాయం, జాబ్ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ మొదలైనవి పర్సనల్ లోన్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్స్ ఆధారంగా, కొన్ని సంస్థలు ఇచ్చే లోన్లపై ఎంత వడ్డీ విధించాలో నిర్ణయిస్తాయి. ఏది మంచిది : కొంతలో కొంత పర్సనల్ లోన్ కంటే బంగారంపై లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ లో తీసుకున్న పర్సనల్ లోన్‌ను విధించిన గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే బంగారంపై లోన్ తీసుకుంటే గడువులోపు పే చేయలేదంటే అదే బంగారాన్ని వేలం వేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు: బంగారంపై తీసుకునే లోన్ ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 2 శాతం వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు లోన్ తీసుకునే వ్యక్తులు, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. -
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వ్యాపారాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా అనేక చిన్న, చిన్న వ్యాపారాల మీద పడింది. అయితే, ఈ ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ భరోసా ఇచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు. కెనరా బ్యాంక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈల) కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. "కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీరేట్లతో అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీకు ఎల్లప్పుడూ మాతో భద్రతా ఉంటుంది" అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది. Canara Bank #GoldLoans provide emergency financial assistance to our customers in exchange for gold with attractive interest rates. With us, you’ll always have a safety net.#CanaraBank pic.twitter.com/Hy4i0REvPt — Canara Bank (@canarabank) June 20, 2021 కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే "గోల్డ్ లోన్"ను అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక అవసరాలకు అనువైనదని పేర్కొంది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ను వేగంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఏవైనా ఎంక్వైరీల కోసం 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. రేపో రేటుతో ముడిపడి ఉన్న 7.35 శాతం పోటీ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుకి దేశ వ్యాప్తంగా 10,495 శాఖలు, 13,023 ఎటిఎంలు ఉన్నాయి. Need funds to kickstart your MSME business? Avail “CANARA MSME GOLD LOAN” from Canara Bank, for financial assistance up to 20 lakhs. With us, your business goals can be achieved!#CanaraBank #TogetherWeCan #MSME #BusinessLoans pic.twitter.com/2rpDhRkp5K — Canara Bank (@canarabank) June 18, 2021 చదవండి: పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా? -
బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
భారతీయులకు చాలా కాలం నుంచి బంగారం పట్ల బలమైన అనుబంధం ఉంది. అందుకే బంగారం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా కొన్న బంగారాన్ని ప్రజలు అమ్మడానికి ఇష్టపడరు. దానికి ఒక కారణం ఉంది. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆర్ధికంగా ఇబ్బందులు గురైనప్పుడు బంగారం ఆదుకుంటుంది అనే భరోసా వారిది. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కఠిన పరిస్థితులలో డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అంతే తప్ప ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడరు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణ వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ ఇచ్చే సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో 75శాతం కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని ఇవ్వరు. బంగారు రుణాలకి సంబందించి బ్యాంక్‌కి, బ్యాంక్‌కి మధ్య మధ్య వ్యత్యాసం ఉంటుంది. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం ముందే తనిఖీ చేసుకోవాలి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. జూన్ 1, 2021న సంబంధిత వెబ్సైట్ల నుండి సేకరించిన డేటా ఇది. బ్యాంకు పేరు వడ్డీ రేటు (ఏడాదికి) Punjab & Sind Bank 7.00% Bank of India 7.35% State Bank of India 7.50% Canara Bank 7.65% Union Bank 8.20% Karnataka Bank 8.49% Indian Bank 8.50% UCo Bank 8.50% Federal Bank 8.50% Punjab National Bank 8.75% Jammu & Kashmir Bank 8.85% Central Bank 8.85% Indian Overseas Bank 8.85% HDFC Bank 8.95% Bank of Baroda Bank 9.00% Dhanalaxmi Bank 9.50% Karur Vyasya Bank 10.10% ICICI Bank 11.00% South Indian Bank 11.95% AXIS Bank 12.50% NBFCs IIFL Finance 9.24% Muthoot Finance 11.90% Bajaj Finserv 12.00% Manappuram Finance 12.00% చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు
మీ కలల గృహం లేదా కారు కోసం లోన్ తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. వివిధ అవసరాల కోసం లోన్ తీసుకునే వారి కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్, విదేశాలలో విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ వంటి మీకు అవసరమైన రుణం పొందొచ్చు. లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రుణం తీసుకోవాలని భావించే వారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకోవాలని వారికీ వడ్డీ రేటు 6.7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కొత్త కారు కోసం లోన్ పొందాలని చూస్తే 7.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. బంగారంపై లోన్ కోసం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్ లోన్‌పై 9.3 శాతం వడ్డీ ఉంటే ఎస్బీఐ కొంత మంది కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తోంది. ఈ తరహా పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటు ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపోతే సిబిల్ స్కోర్ ప్రాతిపదికన మీరు పొందే రుణంపై వడ్డీ రేటు మారొచ్చు. కొత్త ఇళ్ల కోసం రుణాలు తీసుకునే వారికీ ఇది వర్తిస్తుంది. చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్! -
కరోనా : బంగారంపై రుణాలకు భారీ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ సంస్థలే కాదు.. బ్యాంకులు సైతం బంగారం రుణాల పట్ల ఉత్సాహంగా ఉన్నాయి. బంగారం, బంగారం ఆభరణాలను హామీగా ఉంచుకుని, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అమితాసక్తి చూపిస్తున్నాయి. ఒకవేళ రుణ చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైనా.. వేలం వేసి బకాయిల కింద సర్దుబాటు చేసుకునే రక్షణ ఉండడంతో బ్యాంకులు ఈ విభాగం పట్ల సౌకర్యంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉండడం-21 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో (2020 ఏప్రిల్-డిసెంబర్) బ్యాంకులు అధిక లిక్విడిటీ సాధనాలైన బంగారం లేదా ప్రభుత్వ సెక్యూరిటీలపై తనఖా రుణాలు ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కారణం కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడడంతో రుణ గ్రహీతల చెల్లింపుల సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉండొచ్చన్న ఆందోళనే బ్యాంకులు బంగారం రుణాలపై ఎక్కువగా దృష్టి సారించడానికి కారణమని తెలుస్తోంది. ఎస్బీఐ రుణాలు నాలుగు రెట్లు ఎస్బీఐ ‘పర్సనల్ గోల్డ్ లోన్’ పుస్తకం కేవలం ఆరు నెలల్లోనే (2020 జూలై-డిసెంబర్) నాలుగు రెట్లు పెరగడం దీన్నే రుజువు చేస్తోంది. ఎస్బీఐ పర్సనల్ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో డిసెంబర్ చివరికి రూ.17,492 కోట్లుగా ఉంది. ఎస్బీఐకి ఈ రుణ విభాగంలో స్థూల ఎన్పీఏలు కేవలం 0.04 శాతమే. బ్యాంకు ఆఫ్ బరోడా బంగారంపై ఇచ్చిన వ్యవసాయ రుణాలు డిసెంబర్ చివరికి వార్షికంగా 29 శాతం పెరిగి రూ.21,116 కోట్లకు చేరుకున్నాయి. 2019 డిసెంబర్‌కు ఇది రూ.16,325 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘వ్యవసాయ రుణ విభాగాన్ని పరిశీలిస్తే 40 శాతం వృద్ధి (రుణాలకు డిమాండ్) బంగారం రుణాల నుంచే ఉంటోంది. మా మొత్తం వ్యవసాయ రుణాల్లో 21 శాతం బంగారంపై ఇచ్చినవే. రానున్న రోజుల్లో వ్యవసాయ రుణాల్లో వృద్ధి 40–50 శాతం మేర బంగారం రూపంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నాము’’ అంటూ బ్యాంకు ఆఫ్ బరోడా ఎండీ, సీఈవో సంజీవ్ చందా చెప్పడాన్ని గమనించాలి. సీఎస్బీ బ్యాంకు సైతం.. ఇక బ్యాంకింగ్ రంగంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో ఎక్కువగా ఉన్న (మొత్తం రుణ ఆస్తుల పరంగా) సీఎస్బీ బ్యాంకు గురించి కూడా ప్రస్తావించుకోవాలి. త్రిస్సూర్ కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్బీ బ్యాంకు బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో వార్షికంగా చూస్తే 60 శాతం వృద్ధితో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.5,644 కోట్లకు విస్తరించింది. 2019 డిసెంబర్ నాటికి బ్యాంకు బంగారం రుణాల పుస్తకం రూ.3,523 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకు మొత్తం రుణాల్లో బంగారం రుణాల వాటా 40 శాతానికి చేరుకుంది. ‘‘మా బంగారం రుణాల పుస్తకాన్ని తగ్గించుకోబోము. కానీ, అదే సమయంలో ఇతర రుణ పుస్తకాల సైజును పెంచుకుంటాము. దాంతో మొత్తం మీద చూస్తే బంగారం రుణాల వాటా తగ్గనుంది. మా బంగారం రుణ పుస్తకం కేవలం రూ.6,000 కోట్లే. కానీ, ఒక అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు బంగారం రుణ పుస్తకం అయితే ఏకంగా రూ.70,000 కోట్ల స్థాయిలో ఉంది. కనుక నేడు బంగారం రుణాల్లోనూ కచ్చితంగా వాటా ఉండాల్సిందే’’ అని అని సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో సీవీఆర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో సౌకర్యం.. ఇతర ప్రైవేటు బ్యాంకుల్లోనూ బంగారం రుణాలు విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫెడరల్ బ్యాంకు బంగారం రుణ పోర్ట్‌ఫోలియో వార్షికంగా చూస్తే 67 శాతం వృద్ధితో డిసెంబర్ త్రైమాసికం చివరికి రూ.14,000 కోట్లుగా ఉంది. అదే కరూర్ వైశ్యా బ్యాంకు మొత్తం రుణాల్లో బంగారంపై ఇచ్చిన రుణాలు 2020 డిసెంబర్‌కు 23 శాతానికి (రూ.12,069 కోట్లకు) చేరాయి. 2019 డిసెంబర్‌కు బంగారం రుణాల వాటా 17 శాతంగా ఉంది. బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో రుణదాలు, రుణ స్వీకర్తలు ఈ రుణాల విషయంలో సౌకర్యంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గ్రూపు హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు. -
గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్లను అందిస్తుంది. ఇప్పుడు బంగారంపై రుణాలను రూ.50లక్షల వరకు తీసుకోవచ్చు అని పేర్కొంది. గతంలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు దానికి రెట్టింపు రుణాలను తీసుకోవచ్చు అని ఎస్బీఐ పేర్కొంది. గరిష్ట రుణ మొత్తం రూ.50 లక్షలు ఉంటే కనీస రుణ మొత్తం రూ.20వేలుగా ఉంది. ఎస్బీఐలో బంగారం రుణాలను తీసుకోవాలనుకునేవారు 7208933143కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా GOLD అని టైపు చేసి 7208933145కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు. ప్రస్తుతం ఈ బంగారం రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే బంగారం రుణాలను ఎస్బీఐ అందిస్తుంది. అలాగే కాగితం పని కూడా తక్కువ ఉండనున్నట్లు తెలిపింది. బంగారు నాణేలతో సహా బంగారు ఆభరణాలపై ఎస్బీఐ బంగారు రుణాన్ని పొందవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమి లేదు చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం రుణాలను 18 సంవత్సరాల పైబడిన వారు తీసుకోవచ్చు. రుణం కోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. Business ke liye achhi investment chaho toh #PehleSBI socho. Apply for a #GoldLoan with SBI and enjoy exciting deals like 7.50% Interest Rate, Nil Processing Fee, and many more. For a call back, give a missed call on 7208933143 or SMS GOLD at 7208933145 #SBI #StateBankOfIndia pic.twitter.com/OiY1SWt7Rg — State Bank of India (@TheOfficialSBI) February 21, 2021 చదవండి: బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి
మన దేశంలో అందరికి బంగారంపై మక్కువ ఎక్కువ. తరతరాల నుంచి బంగారాన్ని కొని దాచుకోవడం ఒక అలవాటు. ఇంట్లో ముఖ్యమైన వేడుకలు జరిగినప్పుడు బంగారం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనప్పుడు దీనిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇది చాలా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. బంగారంపై రుణాలను జారీ చేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కార్‌లను పరిగణలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణ గ్రహిత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవు. ప్రస్తుతం మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే మనం బంగారంపై కొన్ని విషయాలు గురుంచుకోండి. బ్యాంకులు వర్సెస్ ఎన్బీఎఫ్సీ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే ఎన్బీఎఫ్సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు అందజేస్తాయి. అలాగే బ్యాంకులు ఎక్కువ మొత్తం రుణాలు అందజేస్తాయి. కాకపోతే బ్యాంకులతో పోలిస్తే వడ్డీరేటు 1 నుంచి 2 శాతం ఎక్కువ ఉంటుంది. ఉదాహారణకు మీ దగ్గర ఉన్న 20గ్రాముల బంగారానికి రుణాలు తీసుకుంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రెండు వాస్తవిక బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. మీకు ప్రభుత్వ బ్యాంకులు 10 గ్రాముల బంగారానికి రూ.40వేలు అందిస్తే, ఎన్బీఎఫ్సీలు కొంచెం ఎక్కువ అందించే అవకాశం ఉంటుంది. కానీ ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. రుణ మంజూరు విషయంలో ఎన్బీఎఫ్సీలు ముందు ఉంటాయి. ఎలాంటి బంగారం తాకట్టు పెట్టొచ్చు? బంగారం రుణం కావాలంటే బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. మనం సాధారణంగా ధరించే బంగారం 22 క్యారెట్లు ఉంటుంది. 18 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత ఉంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేయవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు కానీ బంగారు కడ్డీలపై చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాగే తనఖా పెట్టిన అభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదు. కేవలం బంగారం విలువను మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో కూడా స్వేచ్ఛత అడగవచ్చు. 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు. బంగారంపై ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి. రీపేమెంట్ రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీగా వాయిదాలలో(ఈఎంఐ) చెల్లించవచ్చు లేదా రుణ కాలపరిమితి ఉన్నంత వరకు వడ్డీని మాత్రమే చెల్లించి చివరలో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. అసలుతో పాటు వడ్డీ కలిపి చివరలో చెల్లించవచ్చు. గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది? రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకెపోతే రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. విక్రయించే ముందు బ్యాంకు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు నోటీసులు ఇస్తాయి. బంగారం ధర పడిపోతే రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కోరే అవకాశం ఉంది. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!
బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే ఇష్ట పడుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. భవిష్యత్ లో వీటి ధరలు పెరుగుతుంటాయి కాబట్టి బ్యాంకులు కూడా త్వరగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం. కెనెరా బ్యాంక్- 7.65 శాతం. కర్నాటక బ్యాంక్- 8.38 శాతం. ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. యూకో బ్యాంక్- 8.50 శాతం. ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం. యూనియన్ బ్యాంక్- 8.85 శాతం. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం. సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.50 శాతం. బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం. యెస్ బ్యాంక్- 9.99 శాతం. ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం. ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం. కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.50 శాతం. ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం. మణప్పురం ఫైనాన్స్- 12 శాతం. యాక్సిస్ బ్యాంక్- 13 శాతం.చదవండి చదవండి: బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
ఎస్బీఐ ఉద్యోగుల నిర్వాకం..కస్టమర్ల బంగారం తాకట్టు
మలికిపురం/తూర్పు గోదావరి: ఖాతాదారులకు భద్రత కలి్పంచాల్సిన వారే అక్రమాలకు ఊతమిచ్చారు.. చివరికి చిక్కారు.. ఇప్పుడేమో తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బేరసారాలకు దిగారు.. గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే. సఖినేటిపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను ఆ బ్యాంకు ఉద్యోగులే మరోసారి అక్రమంగా తాకట్టు పెట్టిన వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. వారం రోజులుగా ఈ పనిలోనే వారున్నారు. ఇప్పటి వరకూ ఎంత మేరకు అక్రమంగా రుణాలు పొందారనే విషయమై ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై హైదరాబాద్ కేంద్రంగా అధికారులు ఖాతాదారులకు నేరుగా ఫోన్లు చేసి బంగారంపై ఎంత మేరకు రుణాలు తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. తమ బ్యాంకులో లోన్ గడువు ముగిసినట్లు సమాచారం ఉంటే రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని కూడా సూచించారు. దీనివల్ల ఖాతాదారులు ఎంతమేరకు రుణాలు తీసుకున్నారనే సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకూ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ. 6.5 కోట్ల నగదు ఈ వ్యవహారంలో బ్యాంకు ఇంటి దొంగలు అక్రమంగా కాజేశారని తెలియవచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులను సస్పండ్ చేశారు. ఇందులో ఓ ప్రధాన సూత్రధారి తొలి విడత రూ. మూడు కోట్లు చెల్లిస్తానని ఉన్నతాధికారులకు రాయబారం పంపినట్లు సమాచారం. సదరు నిందితులు రొయ్యల చెరువులు, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఇంటి దొంగలే కావడంతో అసలు ఈ వ్యవహారం బయటకు వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బ్యాంకులో బంగారం కుదువ పెట్టిన వారితో పాటు నగదు దాచుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కుంభకోణాన్ని సీబీఐ లేదా, సీఐడీలకు అప్పగించే యోచనలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నట్లు మరి కొందరు చెబుతున్నారు. -
స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?
బెంగళూరు: బంగారు ఆభరణాలపై రుణాలందించే స్టార్టప్ రుపీక్ ను చెంతకు చేర్చుకోవాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎస్బీఐ యాప్ లో రుపీక్ కు చోటు కల్పించాలని చూస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా 2015లో ప్రారంభమైన గోల్డ్ లోన్స్ స్టార్టప్ రుపీక్.. కస్టమర్ల ఇంటి వద్ద రుణ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 350- 375 కోట్లవరకూ రుణాలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇవి రూ. 20 కోట్లేకాగా.. ఇప్పటికే కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంక్ లతో జత కట్టింది. ఇటీవల కాథోలిక్ సిరియన్, యాక్సిస్ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోన్స్ కు డిమాండ్ కోవిడ్ -19 నేపథ్యంలో కొద్ది రోజులుగా గోల్డ్ లోన్స్ కు డిమాండ్ పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కావడంతో ఎస్బీఐ నుంచి గోల్డ్ లోన్స్ కు మరింత డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశాయి. నిజానికి బ్యాంకుకున్న నెట్వర్క్ సామర్థ్యం రీత్యా రోజుకి రూ. 150 కోట్లవరకూ రుణాలు విడుదల చేయవచ్చని చెబుతున్నాయి. అయితే డిమాండుకు అనుగుణంగా ప్రస్తుతం సర్వీసులను అందించలేకపోతున్నట్లు వివరించాయి. దీంతో గోల్డ్ లోన్ మార్కెట్లో 30 శాతం వాటాకు బదులు 15 శాతాన్నే కైవసం చేసుకున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే రుపీక్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేశాయి. రూ. 1200 కోట్లు రుపీక్ తో స్టేట్ బ్యాంక్ జట్టు కడితే.. 2021 మార్చికల్లా రూ. 1,200 కోట్లమేర గోల్డ్ లోన్స్ ను పంపిణీ చేసే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల కారణంగా ఎన్బీఎఫ్సీ తదితర ఫిన్ టెక్ సంస్థలు మార్కెట్లో విస్తరించేందుకు వీలు చిక్కడంలేదని ఫైనాన్షియల్ నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గోల్డ్ లోన్స్.. భద్రత కలిగినవి కావడంతో డిఫాల్ట్ సమస్యలు తక్కువేనని చెబుతున్నారు. -
గోల్డ్ లోన్ కంపెనీలు జిగేల్!
సాక్షి,ముంబై: బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వ్యక్తులు, చిరు వర్తకుల నుంచి గోల్డ్ లోన్ల డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్-జూన్ కాలంలో బంగారంపై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది. లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నారు. చిరుద్యోగులు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, వ్యాపారులకు ఇచ్చే రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేశాయి. దీంతో వినియోగదార్లు గోల్డ్ లోన్లను ఎంచుకుంటున్నారు. పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలకే.. ఇతర లోన్లతో పోలిస్తే వసూళ్లు, పంపిణీ, తిరిగి తనఖా విషయంలో గోల్డ్ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ వెల్లడించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు వసూళ్లు చేయలేకపోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్లతోసహా బంగారంపై రుణాల పంపిణీ వరుసగా సెప్టెంబరు త్రైమాసికంలో రెండింతలకు పైగా అధికమైంది. 12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్ తెలిపింది. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. -
ఎస్బీఐలో రూ.కోటికి టోకరా!
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలో బినామీ గోల్డ్ లోన్లతో ఆ బ్యాంక్ నగదు అధికారే రూ.కోటికి టోకరా వేశాడు. బ్యాంక్‌లో మూడు వారాలుగా జరుగుతున్న ఆడిట్లో ఈ బినామీ గోల్డ్ లోన్ల అవినీతి వెలుగు చూసింది. బ్యాంక్‌లో దాదాపు రెండు వేల గోల్డ్ లోన్లకు సంబంధించిన నగలను భద్రపరిచిన బ్యాగ్‌లు ఉన్నాయి. అధికారులు ఆడిట్ నిర్వహించినప్పుడు గోల్డ్ లోన్లకు సంబంధించి బ్యాగ్‌ల లెక్కల ప్రకారం 25 బ్యాగులు కనిపించకపోవడంతో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి మరోసారి ఆడిట్ నిర్వహించారు. అసలు బంగారు నగలు లేకుండానే.. బ్యాగ్లనేవి ఉంచకుండానే బినామీ పేర్లతో అంటే ఆ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేరుతో బినామీ గోల్డ్లోన్లు తానే తీసుకుని రూ.కోటి వరకు బ్యాంక్ సొమ్ములను రుణాల రూపంలో నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు అధికారి ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో నష్టం రావడం వల్లే వాటి భర్తీకి బ్యాంక్‌లో బినామీ గోల్డ్ లోన్ల పేరుతో పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం విజయవాడ నుంచి మరో ఆడిట్ అధికారుల బృందం సమనస బ్యాంక్‌కు రానుంది. అవకతకలపై ఆరోజు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
ఆర్బీఐ: ఆభరణాలపై ఇక 90 శాతం రుణాలు
మూడు రోజుల పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ యథాతథ రేట్ల కొనసాగింపునకే కట్టుబడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 4 శాతం వద్ద, రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు సైతం 4.25 శాతంగా అమలుకానుంది. ఈ నిర్ణయాలతోపాటు బంగారు ఆభరణాలపై రుణాల పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆభరణాల విలువలో ఇకపై 90 శాతం వరకూ రుణాన్ని ఇచ్చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటివరకూ 75 శాతం విలువవరకూ రుణాల మంజూరీకి అనుమతి ఉంది. ఈ నిర్ణయాలు 2021 మార్చి వరకూ అమలుకానున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గితే.. ప్రస్తుతం పసిడి ధరలు అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆభరణాలపై 90 శాతం రుణాలను మంజూరు చేస్తే బంగారం ధరలు తగ్గినప్పుడు రికవరీ సమస్యలు ఏర్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలపై రుణాలిచ్చే ఫైనాన్షియల్ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేలచూపులో.. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 1198 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1325 వరకూ ఎగసిన ఈ షేరు తదుపరి రూ. 1196 వరకూ నీరసించింది. ఈ బాటలో మణప్పురం ఫైనాన్స్ 1 శాతం క్షీణించి రూ. 158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 169 వద్ద గరిష్టాన్నీ, రూ. 157 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ముత్తూట్ క్యాపిటల్ 4 శాతం వెనకడుగుతో రూ. 358 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 354 వరకూ నష్టపోయింది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : ఆభరణాలపై 90 శాతం రుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు బంగారం విలువలో 75 శాతం మించకుండా రుణాలు జారీ చేస్తున్నాయి. కోవిడ్-19 కుటుంబ ఆదాయాలపై పెను ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ తరహా రుణాలకు రుణ విలువ నిష్పత్తి (ఎల్టీవీ)ని 90 శాతం వరకూ పెంచాలని నిర్ణయించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఎల్టీవీ పెంపుతో బ్యాంకులు బంగారు ఆభరణాలపై అధిక మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగింది. గోల్డ్ లోన్లు జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ నిర్ణయం సానుకూల పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాలయ వరకూ రుణం పొందవచ్చు. అయితే బంగారం విలువలో అధిక మొత్తం రుణంగా పొందితే వడ్డీ భారం కూడా అదేస్ధాయిలో పెరుగుతుందనేది గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. చదవండి : కీలక వడ్డీ రేట్లు యథాతథం -
రైతుపై బ్యాంక్ ఉద్యోగుల దాడి
ఇల్లెందు: బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా.. బ్యాంకు ఉద్యోగులు నానా యాగి పెట్టడంతో ప్రశ్నించిన పాపానికి ఓ రైతు మీద బ్యాంకు ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. మండలంలోని పోచారం పంచాయతీ అమర్‌సింగ్ తండాకు చెందిన బాధిత రైతు అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 7 నెలల క్రితం అశోక్ తండ్రి గుగులోతు భద్రూ ఆంధ్రాబ్యాంక్(యూనియన్ బ్యాంక్)లో నాలుగు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 70 వేలు రుణం తీసుకున్నాడు. ఇంటిలో శుభకార్యం ఉండటంతో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు భద్రూ తన కుమారుడు అశోక్‌తో కలిసి మంగళవారం బ్యాంకుకు వెళ్లాడు. బంగారం రుణానికి సరిపడా డబ్బులు కూడా చెల్లించారు. అయితే బ్యాంక్ అధికా రులు మాత్రం బంగారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినందుకు దూషించారు. తన తండ్రిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అడ్డు తగిలిన అశోక్ తమ బంగారం ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకు ఉద్యోగులను ప్రశ్నించారు. అయితే భూమి పట్టా తీసుకుని రావాలని సమాధానం ఇచ్చారు. బంగారం రుణానికి పట్టాకు సంబంధం ఏంటని తండ్రీ కొడుకులు ప్రశ్నించారు. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కోపంతో.. మీకు చెబితే అర్థ«ం కాదా అంటూ కులం పేరుతో దూషించారు. అక్కడి నుంచి వారిని బయటకు నెట్టుకుంటూ వచ్చారు. మీ పేరుతో ఉన్న పంట రుణం పూర్తిగా చెల్లిస్తేనే బంగారం ఇస్తానని మెలిక పెట్టి బయటకు నెట్టారు. తమ ఇంటిలో శుభకార్యం ఉందని ఎంత బతిమలాడినా వినకుండా బయటకు నెట్టివేస్తుండగా లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో బ్యాంకు ఉద్యోగులు కృష్ణకాంత్, అంబయ్య, డేవిడ్, రాజు, రాజేష్‌లు బయటకు వచ్చి తన మీద దాడి చేశారని అశోక్ తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై బి.రవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతకుముందు డీఎస్పీ రవీందర్‌రెడ్డిని కలిసి జరిగిన సంఘటనపై వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ వివరణ.. బంగారం మీద రుణం చెల్లించినప్పటికీ అతడికి పంట రుణం కూడా ఉందని, మూడేళ్లుగా బాకీ చెల్లించడం లేదని మేనేజర్ అంబయ్య తెలిపారు. ఈ విషయమై అతనితో వాగ్వాదం జరిగిందని, కరోనా జాగ్రత్తలు పాటించేందుకుగానూ బయటకు వెళ్లాలని తెలుపగా తమపై దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ క్రమంలో బయటకు నెట్టే క్రమంలో తమ ఉద్యోగి చొక్కా పట్టుకోవడంతో ఆగ్రహంతో దాడి జరిగిందన్నారు. -
బంగారం ఉండగా.. చింత ఎందుకు దండగ!
సాక్షి, హైదరాబాద్ : వరుసగా మూడు నెలల లాక్‌డౌన్‌తో అన్ని రంగాలూ ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఫలితంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు అప్పు పుట్టడం మరింత కష్టమైంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మెజార్టీ కుటుంబాలు బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల వైపు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉండటం, నిబంధనలు సైతం సంతృప్తికరంగా ఉండటంతో రుణాలు పొందాలనుకుంటున్న 90 శాతం మంది జాతీయ బ్యాంకులవైపే పరుగులు పెడుతున్నారు. అరగంటలో బంగారు రుణం.. కోవిడ్-19 పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ అత్యధిక రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించింది. వాస్తవ ప్రణాళికతో పాటు కోవిడ్-19 ప్రొగ్రామ్ కింద బంగారు రుణాలను ఇబ్బడిముబ్బడిగానే ఇస్తున్నాయి. ఇతర రుణాలతో పోలిస్తే బంగారంపై రుణాల మంజూరీ బ్యాంకులకు లాభాన్ని చేకూర్చేవే.. దీంతో వీటిపై పెద్దగా షరతులు లేకుండా రుణాలు ఇస్తున్నాయి. సగటున ఒక బ్యాంకులో బంగారు రుణం పొందేందుకు అరగంట నుంచి గంట సమయంలో మంజూరవుతోంది. జాతీయ బ్యాంకుల్లో బంగారు రుణంపై వడ్డీ 85 పైసల్లోపే ఉంటుంది. అయితే బంగారు రుణంపై ముందుగా బ్యాంకర్‌కు సమాచారమిస్తే టోకెన్లు జారీ చేస్తూ వాటి ఆధారంగా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకుల్లో భౌతిక దూరం పాటించే క్రమంలో టోకెన్లు ఇస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. 38 శాతం పెరుగుదల.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది బంగారు రుణాల తాకట్టు వైపు చూస్తున్నారు. ఇప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేలా లేదు. దీంతో శుభకార్యాలు, పెళ్ళిళ్లు జరిగే అవకాశం తక్కువగా ఉండటం, ఒకవేళ ఈ కార్యక్రమాలు జరిగినప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దానికి తోడు ఎక్కువగా నగలు వేసుకుని వెళ్లే వేడుకల హాజరుకు మెజారిటీ జనం జంకుతున్నారు. ఈ సమయంలో బంగారం ఇళ్లలో ఉండటం కంటే బ్యాంకుల్లో ఉంటే భద్రత ఉంటుందనే భావన.. దానికి తోడు ఆర్థిక అవసరాలను సైతం అధిగమించవచ్చనే ఆలోచనతో బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నారు. 3 నెలల్లో బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య 38% పెరిగినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో రోజుకు సగటున ఒక బ్యాంకులో 6-10 మందికి కొత్తగా బ్యాంకు రుణాలిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8-12కు పెరిగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ పాతూరి వెంకటేశ్‌గౌడ్ ‘సాక్షి’తో అన్నారు. రెన్యువల్స్ జోరు.. బంగారు ఆభరణాలపై రుణ పరిమితి పెరిగింది. ఇదివరకు గ్రాము బంగారంపై రూ.2,200 వరకు రుణం ఇవ్వగా.. ప్రస్తుతం ఈ పరిమితిని రూ.3,200కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఇదివరకే బ్యాంకు రుణాలు తీసుకున్న వారు.. ఆ ఖాతాను రెన్యువల్ చేసుకుంటూ అదనపు రుణాన్ని పొందుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారు రుణం గడువు గరిష్టంగా 12 నెలల కాల పరిమితి ఉంటుంది, ఈక్రమంలో కాలపరిమితి ముగిసిన వారు సైతం తిరిగి రెన్యువల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోల్డ్ లోన్లలో 85 శాతం రెన్యువల్ చేసుకుని తిరిగి అదనపు రుణాన్ని పొందినట్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ బీఓబీ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా వేతనం అందలేదు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో ఉద్యోగంలో చేరినప్పటికీ వచ్చే వేతనంతో ఆర్థిక సమస్యలు తీరేలా లేవు. దీంతో కొత్తగా అప్పులు చేస్తే వడ్డీ భారం తలకు మించినట్లవుతుందని భావించి బంగారు రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. గంటసేపట్లో రూ.60 వేల రుణం 72 పైసల వడ్డీకే పొందాడు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ వాయిదాల పద్ధతిలో బంగారు రుణాన్ని చెల్లించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. -అనిల్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి -
ముత్తూట్ ఫైనాన్స్ షేరు రికార్డ్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 1150 సమీపానికి చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 1129 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి పావుగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 3.12 మిలియన్ షేర్లు చేతులు మారాయి. కాగా.. ఈ ఏడాది మార్చి 24న ముత్తూట్ ఫైనాన్స్ షేరు రూ. 477 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ర్యాలీ బాటలో సాగుతూ రెట్టింపునకుపైగా ఎగసింది. నిధుల దన్ను గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం 59 శాతం వృద్ధితో రూ. 836 కోట్లను తాకింది. కన్సాలిడేషన్ ప్రాతిపదికన నిర్వహణలోని ఆస్తులు(రుణాలు) 22 శాతం పెరిగి రూ. 46,871 కోట్లను తాకాయి. క్యూ4లో గోల్డ్ లోన్ పోర్ట్‌పోలియో రూ. 3113 కోట్లు పెరిగి రూ. 41,611 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాలలో ముత్తూట్ ఫైనాన్స్ ఈసీబీల జారీ ద్వారా 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. బంగారం ధరల ర్యాలీ, పసిడిపై రుణాలకు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
అందుకే బంగారు రుణాల వైపు మొగ్గు
ముంబై: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమొ అందరికి తెలిసిందే. పసిడి మన సంస్కృతిలో అంతర్భాగమని నిపుణులు చెబుతుంటారు. కరోనా వైరస్ విలయతాండవంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి తిరిగి వ్యాపారంలో పుంజుకునేందుకు ప్రజలు బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంక్‌లు కూడా వివిధ ఆస్తుల గ్యారెంటీ కన్నా బంగారు రుణాలే మేలని భావిస్తున్నాయి. దేశంలో బంగారు రుణాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రెసిల్ పేర్కొంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, ఎక్కువ శాతం ప్రజలు బంగారు రుణాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెడ్ పీఆర్ సోమ సుందరం పేర్కొన్నారు. కాగా దేశంలోని ప్రజలు సగటున (రూ.40,000) బంగారు రుణాలు తీసుకుంటున్నట్లు ముథుట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముథూట్ తెలిపారు. బంగారు రుణాలు ఇవ్వడానికే తమ బ్యాంక్ ప్రాధాన్యమిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖాజురియా పేర్కొన్నారు. (చదవండి: మీ రుణం ‘బంగారం’ గాను..) -
వినియోగదారులకు ఎస్బీఐ బాసట
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు మరో వెసులుబాటును కల్పించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు భారీ ఊరట కల్పించనుంది. యోనో కృషి యాప్ ద్వారా వ్యవసాయదారులకు గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం, లాక్ డౌన్ సమయంలో అన్ని నిబంధనలను పాటిస్తూ కూడా నిరంతరాయంగా తమ కస్టమర్లకు సేవలందిస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇలాంటి రుణాలను 5 లక్షలకు పైగా చెల్లిచినట్టు తెలిపింది. దీంతోపాటు తన వినియోగదారులకు ప్రిఅప్రూవ్డ్ లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్లో వివరాలను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి భారీ ఊరటనిచ్చింది. అలాగే లాక్డౌన్ కారణంగా ఆరోగ్యం అత్యసవర సమయంలో ఇబ్బంది పడకుండా కేవలం నాలుగు క్లిక్స్ ద్వారా రూ. 5 లక్షల వరకు ప్రిఅప్రూవ్డ్ పెర్సనల్ రుణాలను సొంతం చేసుకోవాలంటూ ఒక వీడియోను షేర్ చేసింది. Unlock the value of your gold and fulfill the financial needs for agricultural activities. Follow these 4 steps and avail Agricultural Gold Loan through YONO Krishi. Download now: https://t.co/UaI8IqyqlN#SBIForFarmers #YONOKrishi #YONOSBI #SBI pic.twitter.com/erlzs7lrI9 — State Bank of India (@TheOfficialSBI) May 3, 2020 ఎస్బీఐ అందిస్తోందన్న ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు 45 నిమిషాల్లో రుణం పొందొచ్చు. అయితే గమనించాల్సిన అవసరం ఏమిటంటే ఈ రుణాలు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో వుంటుంది. 567676కు ఎస్ఎంఎస్ పంపి రుణం వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. (జియో మరో భారీ డీల్ ) రుణం పొందాలంటే పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి. మన అర్హతను బట్టి తిరిగి బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. అర్హత పొందిన కస్టమర్లు, ప్రిఅప్రూవ్డ్ లోన్‌పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలు నమోదు చేయాలి. వివరాల పరిశీలన తరువాత లోన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఓటీపీ నిర్ధారణ ద్వారా రుణం మొత్త సంబంధిత ఖాతాలో జమ అవుతుంది. అంతేకాదు ఈ సౌకర్యానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. (మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు) Live your best life with #PreApprovedPersonalLoans in just 4 clicks on #YONOSBI. SMS PAPL to 567676 to check your eligibility. Know more: https://t.co/ybclMjMkyg#SBILoans #SBI #StateBankOfIndia #YONO #YONOSBI #PersonalLoans #Loans #PAPL pic.twitter.com/Ha3Eh3XKM6 — State Bank of India (@TheOfficialSBI) April 24, 2020 -
బంగారం రుణాలు @ 4.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్ రూ.4,617 బిలియన్ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది. నివేదికలోని అంశాలు - 2018–19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి. - ఎన్బీఎఫ్సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. - బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. - ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. - బంగారం రుణ మార్కెట్ ధరల పరంగా అస్థిరత, ఎన్బీఎఫ్సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం. -
నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా
ముంబై: కస్టమర్ల నుంచి స్వీకరించిన బంగారంతో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.3.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ముంబైలోని ధారావి ఇండియన్ బ్యాంకు గోల్డ్‌లోన్ విభాగంలో పనిచేస్తున్న రామస్వామి నాడార్ ఆ పక్కనే ఓ జువెల్లరీ షాపు నడుపుతున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు బంగారం దాచిన 77 పాకెట్లు ఉన్న లాకర్లను తెరిచి చూడగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో వారు ధారావి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్ల నుంచి బంగారాన్ని తనిఖీ చేసి వారికి సర్టిఫికెట్ జారీ చేయడం నాడార్ పని. అయితే ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా అతడు 12 మంది నకిలీ కస్టమర్లను సృష్టించాడు. వీరి పేర్లతో నకిలీ బంగారాన్ని డిపాజిట్ చేసి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. -
మా బంగారాన్ని తిరిగి ఇచ్చేయండి!
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొప్పెర్ల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గందరగోళం నెలకొంది. ఖాతాదారులు నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారంటూ వదంతులు రావడంతో దుమారం చెలరేగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒసారి తనిఖీ చేసుకోవాలంటూ ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు నోటిసులు పంపించారు. దీంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. బంగారాన్ని మార్చేసి నకిలీ బంగారం పెట్టారేమోనని బ్యాంక్ యాజమాన్యంపై ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేస్తే విడుపించుకుపోతామని బ్యాంకు ఎదుట క్యూ కడుతున్నారు. -
వడ్డీ చెల్లించినా బంగారం వేలం
రాయదుర్గం రూరల్: వ్యవసాయ పెట్టుబడుల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను రైతుకు తెలపకుండా కార్పొరేషన్ అధికారులు వేలం వేసేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి తిప్పేస్వామి వ్యవసాయ పెట్టుబడుల కోసం తన భార్య నాగలక్ష్మి బంగారు నెక్లెస్‌ను 2013లో కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ప్రతి ఏటా వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నాడు. 2017 ఆగస్టు నుంచి వడ్డీ చెల్లించలేదు. 2018 జూన్ ఐదో తేదీన అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపించారు. కానీ రైతుకు జూలై 15న నోటీసు అందింది. జూలై 16న బ్యాంకుకు వచ్చి గోల్డ్‌లోన్ ఖాతాకు రూ.4వేల వడ్డీ చెల్లించి రెన్యూవల్ రసీదు తీసుకున్నాడు. కానీ అదే నెల 20 వతేదీన బ్యాంకు వారు బంగారు నెక్లెస్‌ను బహిరంగవేలంలో రూ.29,200కు విక్రయించేశారు. ఈ విషయం రైతు తిప్పేస్వామికి తెలియదు. రుణం తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తానని, తన బంగారును ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే మీ బంగారాన్ని గత సంవత్సరం ఆగస్టులోనే వేలం వేసేశామని చెప్పడంతో రైతు గుండెలపై బండరాయి వేసినంత పనైంది. బంగారాన్ని వేలం వేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు తనవద్ద నుంచి వడ్డీ మొత్తంలో రూ.4వేలు ఎలా కట్టించుకున్నారని ప్రశ్నిస్తున్నాడు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాలకు తాము బలైపోయామని బాధితుడు కావలి తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు వెళతానని చెప్పాడు. ఈ విషయంపై రాయదుర్గం కార్పొరేషన్‌బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జయరాంను వివరణ కోరగా ఈ విషయం జరిగినప్పుడు తాను లేనన్నారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకునే హక్కు ఉందన్నారు. -
భద్రత పెరుమాళ్లకెరుక..!
‘‘ చిత్తూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఒకే వ్యక్తి 90కు పైగా ఖాతాల్లో బంగారు ఆభరణాలు కుదువపెట్టడం ఈ మధ్యకాలంలో పత్రికల్లో చదివే ఉంటారు. చుట్టుపక్కల ఉన్నవారి ఆభరణాలన్నీ ప్రైవేటు సంస్థలో కుదువపెట్టి డబ్బులు కాజేయడం, అడిగిన వారిని రౌడీలతో బెదిరించడం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తే కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అరెస్టు చేశారు.’’ ‘‘ రెండు నెలల క్రితం 5.25 కిలోల బంగారు ఆభరణాలను బెంగళూరులోని ఓ దుకాణంలో డెలివరీ ఇవ్వడానికి విశాఖ నుంచి ఇద్దరు వ్యక్తులు బస్సులో బయలుదేరారు. అదే బస్సులోనే ప్రయాణికుల అవతారంలో ఉన్న వ్యక్తులు బంగారుపాళ్యం వద్ద రూ.1.62 కోట్ల విలువ చేసే ఆభరణాలు కొట్టేశారు. తరువాత దొంగలను, ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇంతటి విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టుకోకపోవడం దుకాణ యజమాని నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది.’’ చిత్తూరు అర్బన్ : బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థలు.. బంగారు ఆభరణాలు సరఫరా చేస్తే సంస్థలు.. వీటి లావాదేవీలు రూ.కోట్లలో జరుగుతుంటాయి. అయితే డబ్బులకు, సొమ్ములకు బాధ్యత వహించాల్సిన ఉద్యోగులే చాలాచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివిధ అవసరాలకు ప్రజలు కుదువ పెట్టిన నగలకు భద్రత కొరవడుతోంది. జిల్లాలోని పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలో గత రెండేళ్ల కాలంలో పలు ఉదంతాలు బయటపడ్డాయి. సాక్షాత్తు వీటిల్లో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, అప్పులు పెరగడంతో ఈ పనికి పాల్పడుతున్నారు. అంతర్గతంగా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని విచ్చలవిడిగా రుణాలు ఇస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఫైనాన్స్ కంపెనీలో వెలుగు చూసిన నకిలీ బంగారం ఉదంతమే ఇందుకు నిదర్శనం. రోల్డ్‌గోల్డ్ నగలను తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. నిబంధనలు తూచ్.. ♦ చాలా బ్యాంకు శాఖల్లో నగదులో కొంత మొత్తాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఎప్పుడో వారం, పది రోజులకు మళ్లీ తెచ్చి జమ చేస్తున్నారు. బ్యాంకు నగదును సొంత అవసరాలకు వినియోగించకూడదు. దీన్ని కొన్ని శాఖల్లో పట్టించుకోవడం లేదు. బ్యాంకు ప్రారంభ సమయంలో ఉన్న నగదు మూసే సమయానికి సరిపోవాలి. అయినా పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరిగితే ఇటువంటి చోటుచేసుకోవు. ♦ నగలను తాకట్టు పెట్టుకొని రుణం ఇచ్చే సమయంలోనూ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. 14 క్యారెట్ నగలను 22 క్యారెట్‌గా చూపిస్తూ రుణాలు ఇచ్చేస్తున్నారు. నగల స్వచ్ఛతను పరిశీలించే అప్రైజర్లను పొరుగుసేవల పద్ధతిలో పెట్టుకుంటున్నాయి. దీనివల్ల వారిలో బాధ్యత ఉండడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలు తేలికగా మంజూరవుతున్నాయి. ♦ కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే వ్యాపారుల పాలిట ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు తిరోదకాలు ఇస్తున్నాయి. చెక్కుల మంజూరులో ఈ వైఖరి ప్రదర్శిస్తున్నాయి. చెక్కు భౌతికంగా ఇవ్వకుండా కేవలం దాని నంబరును చెప్పినా సంబంధిత మేనేజరు ఆమోదిస్తున్నారు. ఆనక వాటిని తెప్పించుకుంటున్నారు. లాకర్ల నిర్వహణలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఇక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదు. తూతూ మంత్రంగా పెట్టి వదిలేస్తున్నారు. కీలకమైన ఈ విభాగం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ♦ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను ఎప్పటికప్పుడు చూడడం లేదు. దీనివల్ల మొగ్గలోనే మోసాన్ని అరికట్టే అవకాశాన్ని కోల్పోతున్నారు. లాకర్ల వద్ద ఉంటున్న రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. సీసీ కెమెరాలు పెడితే ఖాతాదారులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. దొంగిలించిన బంగారాన్ని కూడా వీటిల్లో తాకట్టు పెడుతున్నారు. కనీసం విచారించడం లేదు. దీంతో ఇటీవల నగర పోలీసులు ప్రైవేటు సంస్థల కార్యకలాపాలపై దృష్టి సారించాయి. ఈ లోపాలను సవరించి పర్యవేక్షణ పెంచితేనే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. కనీస భద్రత చర్యలు పాటించాలి.. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ అనేది కనీస భద్రత చర్యల్లో భాగం. ఇక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రతీ బ్యాంకులో పెట్టుకోమని చెబుతున్నాం. గతంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, బంగారు ఆభరణాల దుకాణాల నిర్వాహకులతో సెక్యూరిటీ ఆడిట్ సమావేశాలు పెట్టాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాం. ప్రతి సంస్థ సొంతంగా కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే నేరం జరగకుండా ముందస్తుగా నివారించవచ్చు. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ, చిత్తూరు -
మహిళను మోసం చేసిన యువకుడు
జోగిపేట(అందోల్): బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుందామని బ్యాంకుకు వచ్చిన మహిళను బోల్తా కొట్టించి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం జోగిపేట ఆంధ్రాబ్యాంకు వద్ద జరిగింది. టేక్మాల్ మండలం దాదాయపల్లికి చెందిన నాగమ్మ బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుందామని జోగిపేట ఆంధ్రాబ్యాంకుకు దూరపు బంధువు శ్రీశైలంతో కలిసి వచ్చింది. బంగారంపై లోన్ ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరగా బంగారం తూకం వేసే వ్యక్తి వస్తాడని, ఫోన్ నంబర్ ఇచ్చి అతనికి ఫోన్ చేయాలని సూచించారు. శ్రీశైలం అతడికి ఫోన్ చేయగా..అరగంట తర్వాత వస్తానని చెప్పాడు. ఇది గమనించి ఒక వ్యక్తి శ్రీశైలం, నాగమ్మ వద్దకు వెళ్లి బంగారం లోన్ కోసం ఫోన్‌చేసింది మీరేనా? ఎన్ని తులాలు ఉంది? అని ప్రశ్నించాడు. రెండు తులాలు ఉందని, రూ.30వేలు లోన్ కావాలని బాధితులు చెప్పారు. గొలుసు రెండు తులాలు ఉందోలేదో చూస్తానని, ఈ లోగా పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకురా అని శ్రీశైలంను అక్కడి నుంచి పంపించాడు. మహిళను బ్యాంకు ముందు కూర్చోపెట్టి బంగారంతో లోపలికి వెళ్లిన మోసగాడు కనిపించకుండా బయటకు వెళ్లిపోయాడు. అతను ఎంతకూ బయటకు రాకపోయే సరికి శ్రీశైలం, నాగమ్మలు బ్యాంకులో వెతికి, కనిపించకపోయే సరికి బోరున విలపించారు. ఫుటేజీల ఆధారంగా నిందుతుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకులోని సీసీ కెమరాల ఫుటేజీని పరిశీలించారు. రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తే తమను మోసం చేశాడని బాధితులు గుర్తించారు. ఫోటోలో ఉన్న వ్యక్తి సుమారుగా 25 ఏళ్ల వయస్సు ఉండవచ్చునని, ఎవరికైనా అతడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ రమణ సూచించారు. దొంగను పట్టించిన వారికి పారితోషకం ఇస్తామన్నారు. -
మళ్లీ కదులుతోంది
► తెరపైకి నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం ► కోర్టును ఆశ్రయించిన నిందితులు, బ్యాంకర్లపై ఫిర్యాదు రాజాం: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని కరూర్ వైశ్యాబ్యాంకులో నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఘటన వారం రోజుల క్రితం కలకలం రేపగా బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు రాజాం కోర్టుకు కేసును అప్పగించారు. ఈ లోగా నిందితుల్లోని ఓ వ్యక్తి రాజాం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. బ్యాంకు అధికారులు, పోలీసులు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది గురువారం కరూర్ వైశ్యాబ్యాంకుకు చేరుకొని మళ్లీ దర్యాప్తు నిర్వహించినట్టు తెలిసింది. అయితే పోలీసులు గాని, బ్యాంకు అధికారులు గాని ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు ఇప్పటికీ బ్యాంకులో రుణాలు కోసం బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులు విడిపించుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. -
గోల్డ్లోన్లపై వడ్డీరేటు తగ్గింపు
- రైతునేస్తం రుణ పరిమితి రూ. 5లక్షలకు పెంపు - 1997కు ముందటి రుణాల రికవరీ కోసం వన్‌టైమ్ సెటిల్మెంట్ - డీసీసీబీ బోర్డు, సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నుంచి తీసుకునే గోల్డ్లోన్లపై వడ్డీరేటును 11.50 శాతానికి తగ్గించినట్లు బ్యాంకు చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు 12 నుంచి 14శాతం వరకు వడ్డీ రేటుందని, ఇక నుంచి కామన్‌గా తగ్గించిన వడ్డీ రేటు వసూలు చేస్తామన్నారు. నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్‌లో శుక్రవారం చైర్మన్ అధ్యక్షతన డైరెక్టర్ల బోర్డు సమావేశం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. 1997కు ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు బకాయి పడిన వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణాలపై వడ్డీ అసలుకు రెండు, మూడు రెట్లు అయి ఉంటుందని చెప్పిన చైర్మన్.. వన్‌టైమ్ సెటిల్మెంట్లో భాగంగా అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతు నేస్తం కింద ఇప్పటి వరకు సహకార సంఘాలు రూ.3లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయని, ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఎర్రగుంట్ల, రామదుర్గం,పెద్దహరివాణం, పాములపాడు రైతు సహకార సేవా సంఘాలకు సభ్యత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఇందువల్ల డీసీసీబీకి దాదాపు రూ. 11కోట్లకు పైగా డిపాజిట్లు పెరిగాయన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్.. రూపే కార్డును ఆవిష్కరించారు. 1.05 లక్షల కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని సహకార సంఘాలకు మైక్రో ఏటీఎంలు ఇస్తున్నామని, వీటి ద్వారా నగదు తీసుకోవడంతో పాటు జమ కూడా చేసుకోవచ్చన్నారు. ఎరువుల వ్యాపారానికి అవసరమైన బ్యాంకు గ్యారంటీని కూడా ఇస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యాళ్లూరుకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఐసీడీపీ కింద జిల్లాకు రూ.126 కోట్లు విడుదలయ్యాయన్నారు. రానున్న రోజుల్లో అన్ని సహకార సంఘాలు ధాన్యం సేకరణకు ముందుకు వస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశాల్లో ఆప్కాబ్ జీఎం బాణుప్రసాద్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పసిడి పేరుతో బురిడీ!
- బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు - రూ.19.40 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్న ఘనుడు జమ్మికుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లో పసిడి పేరుతో ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.19.40 లక్షల వరకు గోల్డ్‌లోన్ తీసుకున్నాడు. ఇతనికి బ్యాంకులో పనిచేసే అప్రైజర్ సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కరూర్ వైశ్యాబ్యాంకులో కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన ముక్క సునీల్ కుమార్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ.5 కోట్ల వరకు పలువురికి బ్యాంకు నుంచి గోల్డ్‌లోన్ ఇప్పించాడు. 2016 జూలై నుంచి ఫిబ్రవరి 2017 వరకు పట్టణానికి చెందిన వ్యాపారి చిటికేశి జయప్రకాశ్ ద్వారా కిలో బంగారం తాకట్టు పెట్టించి రూ.19.40 లక్షల వరకు రుణం ఇప్పించాడు. మొదట రూ.80 వేలు రుణంగా తీసుకున్న జయప్రకాశ్.. నకిలీ బంగారాన్ని తాకట్టుపెడుతూ.. భారీ ఎత్తున నగదు తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో వైజాగ్ రీజియన్ కార్యాలయం నుంచి వచ్చిన వారు లాకర్లు తనిఖీ చేయగా, నకిలీ బంగారం బయట పడింది. విషయాన్ని బయటకు పొక్క కుండా వెంటనే అప్రైజర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రశ్నించారు. రికవరీ కోసం సునీల్ సస్పెన్స్ ఖాతాలో రూ.20 లక్షల వరకు రెండు చెక్కులతో డబ్బులను డిపాజిట్ చేయించుకున్నారు. ఖాతాను ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, బ్యాంకు మేనేజర్ సాయిబాబు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తనను బలిపశువు చేశారంటూ సునీల్‌కుమార్ మనోవేదనతో అనారోగ్యం పాలై హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రుణం తీసుకున్న జయప్రకాశ్ పరారీలో ఉన్నాడు. -
పునరుద్ధరుణం దిశగా..
జంగారెడ్డిగూడెం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 15 రోజులపాటు పరిమితులకు లోబడి నగదు మార్పిడి, పాతనోట్ల డిపాజిట్లకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు.. ఇకపై సాధారణ సేవలపైనా దృష్టి సారించబోతున్నాయి. రోజువారీ నిర్వహించే అన్నిరకాల లావాదేవీలను పునరుద్ధరించాలని బ్యాంకు లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం నుంచి సాధారణ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో ఇచ్చి చిల్లర నోట్లు తీసుకునే కార్యక్రమానికి శుక్రవారం నుంచి ఫుల్స్టాప్ పడుతోంది. ఎవరి వద్దనైనా పాతనోట్లు ఉంటే.. శుక్రవారం నుంచి వారి అకౌంట్లలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నోట్లకోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దృష్ట్యా గురువారం నుంచి పంట రుణాలు, బంగారాన్ని కుదువపెట్టుకుని ఇచ్చే రుణాలతోపాటు ఇతర కార్యాకలాపాలను యథావిధిగా చేపట్టనున్నారు. రుణాల వసూళ్లు, మొండి బకాయిల రికవరీ వంటి కార్యకలాపాలు సైతం మొదలు పెట్టాలని బ్యాంకులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రుణాల మంజూరుకు ప్రత్యేక ఏర్పాట్లు బ్యాంకుల్లో 15 రోజులపాటు నిలిచిపోయిన రోజువారీ విధుల పునరుద్ధరణతో రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. రబీ సీజన్ కు సంబంధించి రైతులకు పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుణం పొందిన రైతులు వారానికి రూ.50 వేల వరకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యక్తుల ఖాతాలో ఉన్న నగదును డ్రా చేసుకునేందుకు వారానికి రూ.24వేలు పరిమితి అలానే ఉంది. ప్రజల చెంతకు మొబైల్ ఏటీఎంలు చిల్లర నోట్ల కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొబైల్ ఏటీఎంలను రంగంలోకి దింపింది. జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఏటీఎంలు ప్రజల ముంగిటకు వెళ్లాయి. బ్యాంక్ సిబ్బంది వాహనాల్లో నగదు తీసుకెళ్లి క్యాష్ యాక్ట్ పోస్ మెషిన్ల ద్వారా ఖాతాదారులకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారంతా రూ.2000 తీసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటిద్వారా పూర్తిగా రూ.100 నోట్లు ఇస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తాం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. బంగారంపై రుణాలతోపాటు రబీకి సంబంధించి పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు తెరిచాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజువారీ సాధారణ సేవలను పునరుద్ధరించాం. బ్యాంకుల్లో చాలావరకు రద్దీ తగ్గింది. అన్ని ఏటీఎంలను పునరుద్ధరించాం. ఇకపై మా బ్యాంకులో అన్ని రకాల సేవలు పొందవచ్చు. – కె.త్రినాథరావు, చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, జంగారెడ్డిగూడెం -
‘బంగారం’లాంటి ఐడియా!
నల్ల కుబేరుల బ్లాక్ టు వైట్ ‘పథకం’ బ్యాంకులోని ఆభరణాలు విడిపించేందుకు పాతనోట్లతో అప్పు వడ్డీ లేకుండా అసలు ఆరు నెలల్లో ఇచ్చేలా ఒప్పందాలు ముందుజాగ్రత్తగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకుంటున్న వైనం సాక్షి, అమరావతి: ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ రద్దయిన పెద్ద నోట్లు మార్చుకునేందుకు దండిగా ఉపాయాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం రూ.రెండున్నర వేలకోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూకట్టి సామాన్యుడు రోజుల తరబడి సతమవుతుంటే ధనవంతులు దర్జాగా పెద్ద నోట్లు మార్చుకునే పనిలో పడ్డారు. గతంలో భూములు, బంగారం పరపతికి ప్రతీకగా భావించేవారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుతో పాత పద్ధతి వైపు దృష్టి మరలింది. బంగారం, భూములపై నల్ల డబ్బు పెట్టుబడికి దారులు వెదుకుతున్నారు. బంగారం షాపుల్లో లెక్కల్లో చూపని బంగారం బిస్కెట్లను పాత నోట్లతో కొనుగోలు చేస్తున్నారు. వంద గ్రాముల బంగారం బిస్కెట్ గురువారం నాటి మార్కెట్లో రూ.3.15 లక్షలుండగా ఆ మొత్తానికి మరో రూ.10 వేలు అదనంగా ఇచ్చి పెద్ద నోట్లను చెలామణి చేస్తున్నారు. దీనికితోడు బ్యాంకుల తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించే లా పెద్ద నోట్లు పరుస్తున్నారు. వ్యవసాయం, ఇంటి ఖర్చుల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆభరణాలను విడిపించే మిషతో రూ.500, 1000 నోట్లను విరివిగా వినియోగంలోకి తెస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా బ్యాంకు తాకట్టులో ఉన్న బంగారం వస్తువులను విడిపించే ఒప్పందాలు జోరందుకున్నాయి. తెలిసిన వారివి, బంధు మిత్రులవి బంగారం నగలను బ్యాంకుల నుంచి విడిపించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో అవసరార్థం తీసుకున్న అప్పలు తీర్చలేక అవస్థలు పడుతున్న సగటు జనం కొత్తగా వచ్చిన అవకాశంపై ఆసక్తి చూపుతున్నారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్టు బ్యాంకులో ఉన్న నగలను సొంత డబ్బుతో పనిలేకుండా విడిపించుకోవడంతోపాటు తెలిసిన వారికి సాయం చేసినట్టు అవుతుందనే కొత్త తరహా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. వడ్డీలేని అప్పుగా పెద్ద నోట్లు పెట్టుబడి.. పెద్ద నోట్లు మార్చేందుకు మధ్యవర్తులు 15 నుంచి 40 శాతం కమిష¯ŒS వసూలు చేస్తుండటంతో బం గారం తాకట్టు నుంచి విడిపించే పేరుతో పెద్ద మొత్తాల్ని పెట్టుబడి పెడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఒక రైతు వ్యవసాయ పెట్టుబడి కోసం రెండు బ్యాంకుల్లో తీసుకున్న రూ.1.20 లక్షలను సకాలంలో చెల్లించలేకపోయారు. బ్యాంకు అప్పు తీసుకుని రెండో ఏడాది గడుస్తుండటంతో ఆ రైతు బకాయిని పాతనోట్లుతో తీర్చేలా ఆదే ప్రాంతానికి చెందిన పెద్ద ఆసామి ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు వడ్డీతో సహా బ్యాంకులో రూ.500, రూ.1000 నోట్లతో బాకీ తీర్చిన పెద్ద ఆసామి ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా తనకు ఆరు నెలల్లో తిరిగి వ్వాలంటూ పెద్దల సమక్షంలో కాగితాలు రాయిం చుకున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండి లో ఒక రైతు కుటుంబ అవసరాల కోసం బంగారం నగలపై రూ.3 లక్షలు బ్యాంకు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిం చేందుకు ఒక ఆసామి సెటిల్మెంట్ చేసుకున్నారు. తీరా ఆ రైతుకు పా¯ŒS కార్డు లేకపోవడంతో బ్యాంకు అప్పును రూ.50 వేల లోపు మొత్తాల చొప్పున దఫదఫాలుగా జమ చేసి మొత్తం బంగారం అప్పును రూ.3 లక్షలు వడ్డీతో తీర్చాలని బ్యాంకు అధికారులు సూచించారు. ఎలాగైనా పర్వాలేదు పెట్టుబడిగా పెద్ద నోట్లిస్తానని ఒక పెద్ద ఆసామి ఒప్పుకు న్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా బంగారం రుణాల్ని రదై్దన పెద్ద నోట్లుతో తీర్చే వెసులుబాటుతో పెద్దలు భారీగానే వడ్డీలేని పెట్టుబడులు పెడుతున్నారు. కాగా, బంగారం రుణాల్ని తీర్చేందుకు పెద్ద నోట్లు ఇస్తున్న ధనవంతులు ఆలస్యమైనా కొత్త నోట్లు రాబట్టుకునేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆభరణాలపై అప్పులు తీర్చినందుకు అసలును 6 నెలల్లో చెల్లిం చేలా రుణగ్రస్తులతో అంగీకారపత్రాలు రాయించుకుంటున్నారు. మరీ పెద్ద మొత్తాలైతే ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ముందు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటున్నారు. -
బంగారంపై రుణాలివ్వద్దనడం తగదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు రైతులను ప్రభుత్వం నిండా ముంచుతోందని ఎద్దేవా కరప : రైతులకు రుణమాఫీ కాక, పావలావడ్డీ రాయితీ రాక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు బంగారంపై కూడా రుణాలు ఇవ్వవద్దని బ్యాంకర్లకు ఆదేశాలివ్వడం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కరపలో పర్యటించారు. గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నసమారాధనలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో భక్తిభావం, ఐకమత్యం వర్ధిల్లుతాయన్నారు. రుణమాఫీ పేరుతో మోసపోయామని ఇప్పటికే చాలా మందికి రుణమాఫీ రాలేదని, సహకారం సంఘాల్లో తీసుకొన్న పంటరుణాలకు రెండేళ్లుగా రావాల్సిన పావలా వడ్డీ రాయితీ రావడం లేదని, బ్యాంకులకు వెళ్తే బంగారు నగలపై అప్పు పుట్టడం లేదని రైతులు కన్నబాబుకు వారి గోడు వివరించారు. రైతులు అధైర్యపడవద్దని వైఎస్సార్సీపీ రైతులు తరుపున పోరాడుతుందన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అధికారంలోనికి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పేరుతో అరకొర రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకొందన్నారు. దివంగత నేత వైఎస్పార్ హయాంతో రైతులకు పావలావడ్డీ ఎప్పటికప్పుడు చెల్లించేవారన్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడం వల్ల ప్రయివేట్ వ్యక్తులు వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సివస్తోందన్నారు. రైతులును నిండాముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతు పక్షపాతిగా చెప్పుకొనే అర్హత లేదన్నారు. కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో రాజకీయ జోక్యం తగదని అర్హులైన కాపుపేదలను గుర్తించి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ జ్వరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని రక్తం, ప్లేట్లెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాను పర్యవేక్షించి, రక్షితనీటిని అందించేందుకు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. కరప సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, ఎంపీటీసీలు పాట్నీడి భీమేశ్వర్రావు, పెంకే సత్తిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వర్రావు, పార్టీ నాయకులు నక్కా సత్తిబాబు, ముద్రగడ వీరబాబు, మేడిశెట్టి సత్తిబాబు, బి.శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం రుణాలు ఇవ్వొద్దు..!
–బ్యాంకర్లకు సూచించిన సీఎం చంద్రబాబు –వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రయత్నం –గగ్గోలు పెడుతున్న రైతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో షాక్ ఇచ్చారు. ఇక నుంచి రైతులకు బంగారంపై రుణాలు ఇవ్వొద్దని నేరుగా బ్యాంకర్లకు సూచించారు. విజయవాడలో సోమవారం జరిగిన 195వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భూమి వివరాలు ఆధారంగా ప్రాథమిక రుణాలే అందజేయాలని, బంగారం తాకట్టు రుణాలు అందజేయొద్దని ఆదేశించారు. ఇప్పటికే అడంగల్ సరిగా లేకపోవడం, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. సులభంగా లభ్యమయ్యే బంగారు ఆభరణాల తాకట్టు రుణాలు కూడా ఇవ్వొద్దని సీఎం చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు సీఎం కుట్రపన్నారంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ అంటూ మోసం చేశారు. ఇప్పుడు మరోసారి కష్టాల పాలచేసేందుకు పూనుకుంటున్నారని, రైతు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వాపోతున్నారు. నెరవేరని రుణ లక్ష్యం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 5.4 లక్షల మంది రైతులకు రూ.1,375 కోట్ల రుణాలు మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ గడువు ముగిసే సమయానికి 2.9 లక్షల మంది రైతులకు రూ.700 కోట్ల రుణాలు అందజేశారు. ఈ ఏడాది రైతులు కేవలం 51 శాతం మాత్రమే లక్ష్యాలు చేరగలిగారు. అంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ కారణాలు, ప్రభుత్వ వైఫల్యాలు, నిబంధనల వల్ల సగం మంది రైతులు రుణాలు పోందలేక పోయారన్నది వాస్తవం. రైతులకు బంగారు రుణాలు ఎండమావే.. రైతులు వ్యవసాయ మదుపులు కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం సహజం. ఈ ఏడాది జిల్లాలో సుమారు 60 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టి సుమారు వందకోట్ల రుణాన్ని పొందినట్టు సమాచారం. ఏడాది లోపల ఈ రుణాన్ని బ్యాంకర్లకు చెల్లిస్తే వడ్డీ రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న విధానం. ప్రస్తుత సీఎం దీనికి కోత పెట్టారు. వడ్డీ రాయితీ భారాన్ని తప్పించుకునేందుకు రైతులకు బంగారు రుణాలు మంజూరు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. -
వడ్డీ తక్కువే... మరి చార్జీలో..!
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతామంటూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవటం స్టాక్ మార్కెట్లకు శరాఘాతమే. కరెన్సీలతో పాటు క్రూడ్ వంటి కమోడిటీలకూ గడ్డుకాలమే. కాకపోతే ఇలాంటి అనిశ్చితిలో అందరూ చక్కని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించేది బంగారమే. ఈ నేపథ్యంలోనే దూసుకుపోతున్న పసిడి, ఈ ఏడాది చివరకు మరింతగా పెరగవచ్చనేది అంచనా. ఆభరణాలుగా, పొదుపు సాధనంగా, ద్రవ్యోల్బణాన్ని కాచుకునే రక్షణ కవచంగా, అవసరమైతే రుణం రూపంలో ఆదుకునే మిత్రునిగా ఇలా బంగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మామూలుది కాదు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 10% భారతీయుల ఇళ్లలోనే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, పిల్లల చదువులు, సాగు కోసం పెట్టుబడి, ఇల్లు కొనుగోలు... అవసరం ఏదైనా వారికి ముందుగా కనిపించేది బంగారమే. కాకపోతే బంగారంపై రుణాల విషయంలో చాలామందికి అంతంతమాత్రం అవగాహనే ఉంది. ఈ విషయంలో తెలుసుకోవాల్సిన వాస్తవాలెన్నో ఉన్నాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం.. గోల్డ్‌లోన్ తీసుకునే ముందు అవగాహన అవసరం ⇒ వడ్డీ రేటు తక్కువే కానీ... దానికి సవాలక్ష కండిషన్లు ⇒ ప్రాసెసింగ్ నుంచి ఆలస్యానికి, ప్రీపేమెంట్కూ చార్జీలు ⇒ ఇవన్నీ కలిపితే పర్సనల్‌లోన్ కన్నా ఎక్కువే వడ్డీరేటు ⇒ బంగారం విలువ తగ్గితే మరింత హామీ కావాలంటూ ఒత్తిళ్లు ⇒ ఇవన్నీ భరించేబదులు విక్రయించటమే బెటరంటున్న నిపుణులు మన అవసరం... వారికి వ్యాపారం బంగారం రుణాల్లో ఎక్కువ శాతం రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు తీసుకునేవే ఎక్కువ. తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగా లభించే బంగారం రుణాలవైపు ఆకర్షితులవుతుంటారు. వాటిపై వడ్డీ, ఇతర చార్జీల రూపంలో పడే భారం గురించి వారికి తెలిసింది తక్కువే. పైగా, అత్యవసరాల్లో ఎక్కడా అప్పు దొరకని పరిస్థితుల్లోనే మరో మార్గం లేక బంగారాన్ని కుదువపెడుతుంటారు. దీంతో బంగారంపై రుణాలు ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి వ్యాపార వనరుగా మారింది. బంగారం రుణాల్లో 75 శాతం అవ్యవస్థీకృత రంగం (వ్యక్తులు సొంతంగా నడిపేది)లోనే ఉన్నాయి. మిగిలిన 25 శాతం మార్కెట్ వాటా ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల చేతిలో ఉంది. బంగారంపై రుణం చిటికెలో పని! మిగిలిన రుణాలతో పోలిస్తే బంగారంపై రుణం తేలిగ్గా లభిస్తుంది. వీధిలో ఉన్న వడ్డీ వ్యాపారి అయినా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ అయినా... విలువైన బంగారాన్ని కుదువపెడితే కళ్లకద్దుకుని రుణాలిచ్చేస్తారు. సామాన్యులను ఎక్కువగా ఆకర్షించే విషయమిదే. ఆదాయ వివరాలు, పే స్లిప్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. క్రెడిట్ స్కోర్‌తో పనిలేదు. కుదువపెట్టే నాటికి మార్కెట్లో ఉన్న బంగారం విలువలో 75 శాతం లేదా అంతకంటే తక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు. అయితే బంగారం ధర ఉన్నట్టుండి 25 శాతం వరకు పడిపోతేనే సమస్య ఎదురవుతుంది. కానీ, బంగారం ధరలు తక్కువ వ్యవధిలో ఇంత మేర పడిపోయిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువేనని చెప్పాలి. ఒకవేళ ఆ స్థాయిలో పడిపోతుంటే రుణదాత వెంటనే అప్రమత్తమై... వెంటనే రుణాన్ని కొంతమేర తీర్చివేయాలని లేదా మరికొంత మొత్తం బంగారాన్ని హామీగా సమర్పించాలని రుణగ్రహీతను కోరతారు. చెప్పేది వేరు... చేసేది వేరు చాలా వరకు ఎన్బీఎఫ్సీలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాలిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తుంటాయి. కానీ, రుణం కోసం వెళ్లినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. బంగారాన్ని చూశాక గానీ రుణం ఎంతన్నది తేల్చవు. తాకట్టు పెట్టాలనుకునే బంగారం స్వచ్ఛత, విలువ పరీక్షించిన తర్వాతే ఎంత రుణం ఇచ్చేదీ చెబుతాయి. బంగారు ఆభరణాల విలువను లెక్కించడంలో అనుసరించే విధానం కూడా గోప్యమేనని స్వయంగా రిజర్వ్ బ్యాంకు బృందమే గుర్తించింది. రుణ పత్రాలు, రుణాల జారీ విషయంలో పాటించే విధానం కూడా సంస్థను బట్టి మారుతుంటుంది. రుణగ్రహీతకు తాకట్టు పత్రం, రుణ ఒప్పంద పత్రాన్ని ఇస్తున్నాయి. కానీ, వాటిలో ఆభరణాల వివరాలు, ఎన్ని గ్రాములు, మదించిన విలువ వంటివి వేయటం లేదు. వార్షిక వడ్డీ రేటు వివరాలను కూడా పేర్కొనడం లేదు. రుణం కాల వ్యవధి ఎంత? గడువులోపు చెల్లించడంలో విఫలమైతే వేలం విషయంలో అనుసరించే విధానమేంటి? ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? ఇలాంటి వివరాలు ఎన్బీఎఫ్సీ సంస్థలు జారీ చేసిన పత్రాల్లో ఉండటం లేదని ఆర్బీఐ బృందం తేల్చింది. అలాగే, రుణగ్రహీత చెల్లింపుల విషయంలో విఫలమైతే హామీగా ఉంచిన బంగారు ఆభరణాలను వేలం వేసే ముందు ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. కానీ, కంపెనీలు ఈ నిబంధనను పాటించ డం లేదు. రుణగ్రహీతకు చెప్పకుండా వేలం ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. వేలం వేసే రోజు మార్కెట్ విలువ ఎక్కువగా ఉండి... ఆ వేలం ద్వారా అధిక మొత్తం సమకూరితే రుణం, దానిపై వడ్డీ పోను మిగిలిన నగదును రుణ గ్రహీతకు తిరిగి చెల్లించడం లేదని కూడా ఆర్బీఐ గుర్తించింది. వడ్డీ నెలనెలా... అసలు చివర్లో నెలనెలా వడ్డీ చెల్లిస్తూ గడువు తీరిన తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేసి తనఖా పెట్టిన బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. బంగారంపై రుణాలిచ్చే బ్యాం కులు లేదా ఎన్బీఎఫ్సీలు ఈ విధానాన్నే ఎక్కువగా పాటిస్తుంటాయి. వడ్డీతోపాటు అసలు కలిపి ఒకేసారి చెల్లించే అవకాశమూ ఉంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం వడ్డీపై వడ్డీ జమకూడి చెల్లించాల్సిన మొత్తం బాగా పెరిగిపోతుంది. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం వడ్డీ ఎంత...!? ప్రకటనలను చూస్తే బంగారు రుణాలపై వడ్డీ చాలా తక్కువే అనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ వడ్డీ ఎక్కువే. ఎందుకంటే వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీ, విలువ మదింపు చార్జీలు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపితే వడ్డీ ఎక్కువే అవుతుంది. పైగా నెలవారీ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే సంస్థలు విధించే జరిమానా భారీగా ఉంటుంది. రుణాన్ని ముందుగా తీర్చేసినా చార్జీలు తప్పవు. మార్కెట్లో ఉన్న రెండు ప్రముఖ రుణ సంస్థల వడ్డీ రేటును పరిశీలిస్తే... 12 నుంచి 24 శాతం వరకూ ఉన్నట్టు వెల్లడయింది. రుణం తీసుకునే కస్టమర్, తాకట్టు పెట్టే ఆభరణాలు, రుణ మొత్తం, వ్యవధిని బట్టి ఈ వడ్డీరేటు మారిపోతుంది. వాస్తవంలో గరిష్ట వడ్డీ ధర 24 శాతాన్ని దాటిపోయి 30% వరకూ ఉన్న సందర్భాలూ లేకపోలేదు. ఎన్బీఎఫ్ఎసీల మొత్తం బంగారం రుణాల్లో కేవలం 2 శాతమే 12% వడ్డీకి ఇస్తున్నవని వెల్లడయింది. మిగిలిన రుణాలపై వడ్డీ రేటు 24-26% మధ్యనే ఉంటోంది. రుణం తీసుకోవాలా? బంగారం విక్రయించాలా? ఒక గోల్డ్‌లోన్ సంస్థ ఇస్తున్న బంగారు రుణాలపై వడ్డీ నెలకు 2 శాతం. బంగారం మార్కెట్ విలువపై రుణం రేషియో (ఎల్టీవీ) కూడా 70 శాతం వరకే ఉంది. రుణం కాల వ్యవధి మూడు నెలలే. ప్రతి త్రైమాసికం చివర్లో వడ్డీ మొత్తం చెల్లిస్తే మరో మూడు నెలలకు రుణం పొడిగిస్తుంటారు. అసలు చెల్లించే వరకు ఇలా రుణం కాల వ్యవధి కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ తగ్గి, ఎల్టీవీ రేషియో కూడా తగ్గితే అదనంగా బంగారాన్ని హామీగా ఉంచాలని సంస్థ నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. చార్జీలన్నీ చెల్లించి, ఇలాంటి ఇబ్బందులు పడేకంటే కొన్నిసార్లు బంగారాన్ని విక్రయించడమే లాభసాటిగా కనిపిస్తుంది. అయితే, బంగారం ధరలు పెరిగేటపుడు ఈ ఆప్షన్ అంత మంచిదికాదు. సెంటిమెంటుతో చిక్కు.. భారతీయులకు, ముఖ్యంగా స్త్రీలకు ఆభరణాలతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. తండ్రి తన పుట్టిన రోజున ప్రేమగా బహూకరించిన హారం, పెళ్లి నిశ్చితార్థం రోజున కాబోయే వరుడు చేతి వేలికి తొడిగిన ఉంగరం, పెళ్లి సందర్భంగా నాన్న చేయించిన బంగారు గాజులు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళి ఇలా ప్రతీ దానికీ ఓ చెరగని జ్ఞాపకం ఉంటుంది. అయితే, మంగళసూత్రం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో సెంటిమెంటును పక్కన పెడితేనే లాభమన్న విషయాన్ని తెలుసుకోవాలి. పైగా అమ్మడం వల్ల తర్వాత కావాలంటే కొత్త ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు. విక్రయించే ముందు వాటిని ఫొటో తీసి పెట్టుకుంటే అవే డిజైన్లతో ఆభరణాలను చేయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పసిడి... మెరుపు తగ్గదు! న్యూయార్క్/ముంబై: స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి ధర తగ్గే పరిస్థితి లేదని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని వారి అంచనా. బ్రెగ్జిట్ నేపథ్యంలో మూడేళ్ల గరిష్ట స్థాయికి (జూన్ 23వ తేదీన ఔన్స్‌కు 1,355 డాలర్లు) ఎగసిన ధరలు మున్ముందూ ఇదే ధోరణిని కొనసాగిస్తాయన్నది వారి అంచనా. క్లుప్తంగా పరిశీలిస్తే... * గోల్డ్ రిఫైనరీస్ జాతీయ సంఘం అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ సెక్రటరీ జేమ్స్ ఈ అంశంపై మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ధర అంతర్జాతీయ ప్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,400 డాలర్లకు చేరడం ఖాయమని పేర్కొన్నారు. * దేశీయంగా రూపాయి బలహీనత, పసిడి ధర భారీ పెరుగుదలకు కారణం అయ్యే అవకాశం ఉందని ట్రెజరీ అండ్ బ్యాంక్‌నోట్స్ సెంట్రల్ డెరైక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ హరిప్రసాద్ అంచనావేశారు. * కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని ఏవీపీ సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ హెచ్ బీరేంద్రకుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడిన ఆయన, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8 శాతం బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉంటుందని అన్నారు. వారంలో వెండి మెరుపులు: అంతర్జాతీయంగా ఔన్స్ 25 డాలర్లు ఎగసి 1,344 డాలర్లకు చేరింది. ముం బైలో శుక్రవారం శుక్రవారంతో ముగిసిన సమీక్ష వారంలో కొంత నెమ్మ దించింది. 99.9 స్వచ్ఛత ధర రూ.10 నష్టపోయి, 30.905 వద్ద ముగిసింది. అయి తే వెండి భారీగా కేజీకి రూ.2,150 ఎగసి రూ.45,080కి చేరింది. -
స్నాచింగ్ సొమ్ము ఎక్కడికి వెళుతోంది?
సాక్షి, ముంబై: దొంగలు అపహరించిన సొమ్మును ఏం చేస్తారు.. తెలిసిన వారికి తక్కువ ధరకు అమ్మేసుకుంటారు.. ఇదేనా మీ సమాధానం.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే!! చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే 80 శాతం మంది బంగారు ఆభరణాలను ప్రముఖ గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. స్నాచింగ్‌కు సొంత వాహానాలనే వాడుతున్నారని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉంటున్నారని డీసీపీ ధనుంజయ్ కుల్కర్ణి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా నేరాలకు పాల్పడటంతో వీరు నాకాబందీ సమయంలో కూడా తప్పించుకుంటున్నారని కుల్కర్ణి తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించకుండా గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నారని చెప్పారు. వారికి ఈ విధానం అనుకూలంగా ఉందని, దీంతో మళ్లీ మళ్లీ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని రాష్ట్ర దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. బైకుల ద్వారా చోరీకి పాల్పడుతున్న వారిలో కల్యాణ్‌లోని అంబివెల్లిలో నివాసముంటున్న ఇరానియన్ల హస్తముందని దర్యాప్తులో తేలిందన్నారు. ఏడాదిలో వెయ్యికిపైగా కేసులు కాగా, నగరంలో 2015 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 1,066 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని నగర పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దుండగులు అత్యాధునిక బైక్‌లను ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. చైన్ స్నాచింగ్‌కు సంబంధించి 80 శాతం నేరాలు బైకులు ఉపయోగించి చేసినవేనని వెల్లడైంది. నెలకు రూ.10 లక్షలు లక్ష్యం.. 2015 డిసెంబర్ 12న డీఎన్ నగర పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లు అతిఫ్ అన్సారీ (32), ఇర్షద్ ఖాన్ (22)లను అరెస్టు చేశారు. నెలకు రూ.10 లక్షల విలువజేసే బంగారు చైన్లను దొంగిలించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు వారు విచారణలో వెల్లడించారని కుల్కర్ణి తెలిపారు. ఆ ఇద్దరిపై ముంబై, థానేల్లో 60 వరకు కేసులు నమోదు అయ్యాయన్నారు. తన కొడుకు కేన్సర్ చికిత్స కోసం ఈ నేరాలను ఎంచుకున్నట్లు అన్సారీ చెప్పగా, బైకులను ఆధునీకరించే వ్యాపారం కోసం నేరాలకు పాల్పడినట్లు ఇర్షద్ చెప్పినట్లు వెల్లడించారు. -
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
► బంగారం రుణాలపై బ్యాంకుల నోటీసులు ► మంత్రి తెలియదనడంపై మహిళల మండిపాటు ► బాబును నమ్మినందుకు నట్టేట ముంచారని శాపనార్థాలు ► ఏడాది క్రితం తీసుకున్న అప్పులూ చెల్లించాలని అప్పుడే ఒత్తిడి తెనాలి : ‘వస్తున్నా....మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు దగాపడ్డారు. ‘ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు...మీ నగలు మీరు తీసుకుందురు’ అనే వాగ్దానాలకు పొంగిపోయిన ఆడపడుచులు తీవ్రంగా భంగపడ్డారు. అధికారంలోకి వచ్చాక బాబు తీరు మారిపోయింది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణ పరిమితి తగ్గించి, వాయిదాల పద్ధతిలో మాఫీ అన్న ముఖ్యమంత్రి మాటల గారడీకి అంతా నివ్వెర పోయారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినవారిపై ప్రభుత్వ పెద్దలు బుకాయింపునకు దిగుతున్నారు. బంగారు నగలపై రుణాలు తీసుకున్న ఖాతాదారులకు బ్యాంకులు మళ్లీ ఇప్పుడు వేలం నోటీసులు పంపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని బుధవారం శాసనసభలో ప్రస్తావిస్తే, అటువంటి సమాచారమేదీ తనకు తెలియదని రా్రష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిస్సిగ్గుగా ప్రకటించటం చూసిన ప్రజలు మండిపడుతున్నారు. ఏడాదిగా కరవు ఛాయలు.. జిల్లాపై ఏడాదిగా కరవు ఛాయలు ముసురుకున్నాయి. ఖరీఫ్‌లో వరి, పత్తి, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గాయి. ఫలితంగా జిల్లాలోని రైతులు రూ.800 కోట్లకు పైగా నష్టపోయివుంటారని అంచనా. ప్రస్తుత రబీలోనూ పంటల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతులు ఎందరికో చంద్రబాబు హామీనిచ్చినట్టు రుణమాఫీ జరగలేదు. అన్ని లెక్కలు సరిచూసుకుని మాఫీ పరిధిలోకి వచ్చిన రైతులకు తొలి విడతగా ఖాతాలో పడిన డబ్బులు కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు. శాపనార్థాలు పెడుతున్న మహిళలు... గురజాల దగ్గర్లోని మాడుగులకు చెందిన కౌలురైతు సంకురాత్రి భూదేమ్మను రుణమాఫీపై కదిలిస్తే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూడేళ్ల క్రితం గురజాల ఎస్బీఐలో నగలు తాకట్టుపెట్టి రూ.35 వేల రుణం తీసుకుంది. బాబు హామీని నమ్మినందుకు రుణమాఫీ చేయకపోగా తన నగలను వేలం వేశారని తెలుసుకుని నివ్వెరపోయినట్టు చెబుతూ శాపనార్థాలు పెట్టసాగింది. తెనాలి సమీపంలోని కొలకలూరు మహిళ రమాదేవి మూడేళ్ల క్రితం రూ.54 వేలు రుణం తీసుకున్నారు. ఇప్పటికి రూ.37 వేలు వడ్డీకింద చెల్లించినా, రుణమాఫీ కాలేదనీ, ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ప్రకటన వ్యయం రైతునెత్తిపైనే... బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు కలవరపడుతూ ఏదొకవిధంగా వడ్డీ చెల్లిస్తామని వెళితే ప్రతికలో వేలం ప్రకటన వ్యయాన్ని కూడా వారినుంచి బ్యాంకులు రాబడుతున్నాయి. పత్రికలో వేసినందుకంటూ తననుంచి రూ.750 అదనంగా వసూలుచేశారని సింగరయ్య అనే మరో రైతు చెప్పటం ఇందుకు నిదర్శనం. వార్షిక సంవత్సరం ఆఖరు కావటంతో బ్యాంకులన్నీ కొద్దిరోజులుగా బంగారు ఆభరణాల నగల వేలం నోటీసులను పంపుతున్నాయి.జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల రైతులు వీటిని అందుకుంటున్నారు. బాబు రుణమాఫీ హామీ కారణంగా బ్యాంకులకు ఎదురైన చేదు అనుభవాలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదిక్రితం తీసుకున్న రుణాలనూ చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులతో ఒత్తిడిచేస్తున్నట్టు కొలకలూరు రైతు శివనాగేంద్రం చెప్పారు. వాస్తవాలిలా ఉంటే, ఇప్పటికీ రుణాలు మాఫీ కాని రైతులు ఉన్నారనీ, నగలపై రుణాల చెల్లింపు డిమాండుతో నోటీసులు జారీచేస్తున్నారని తెలియదని స్వయానా మంత్రి చెప్పటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోటీసుల పేరుతో బ్యాంకుల ఒత్తిడి... ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు వేలం నోటీసులు పంపటం, వేలం ప్రకటనలను పత్రికల్లో ప్రచురించటం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఖరీఫ్‌లో పంట రుణాలతో పెట్టుబడులు సరిపోక, స్థానికంగా ఉండే రైతులు, వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నారు. పంటలు వచ్చే ముందు చివరి విడత అవసరాలకు బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పు తీసుకున్నారు. దాదాపు 2.50 లక్షల రైతులు ఈ విధంగా ఆభరణాలపై అప్పులు తీసుకుని వుంటారని అంచనా. ఈ క్రమంలో నోటీసుల పేరుతో బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనపుడు క ంగుతిన్న రైతులు పరువు పోతుందన్న గుండె గుబులుతో అందినకాడల్లా అప్పులు చేసి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకొన్నారు. ఆ పరపతి కూడా లేని రైతులు తమ నగలను వదిలేసుకున్నారు. నోటీసులు ఇచ్చారు 2013లో ఆంధ్రాబ్యాంక్‌లో బంగారంపెట్టి రూ.1.2లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ కాకపోవడంతో కొంత నగదు చెల్లించాం. మిగిలిన నగదు కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలిశెట్టి సుధారాణి, కొలకలూరు -
బంగారు రుణాలు వేలాలను ఆపివేయాలి
సలకంచెర్వు(శింగనమల): ఎన్నికల్లో టీడీపీ పార్టీ బంగారు రుణాలు మాఫీ చేస్తామని తెలుపడంతో, రైతులు ఆ రుణాలు చెల్లించలేదని, ప్రస్తుతం పంటలు పండక పోవడంతో రుణాలు చెల్లించలేక పోతున్నారని, వాటిని రెన్యూవల్ చేసుకోకుండా వేలం వేస్తున్నారని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని సలకంచెరువు స్టేట్ బ్యాంక్‌లో గురువారం మధ్యాహ్నం బంగారు వేలం వేయడాన్ని సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. బ్యాంక్ ఎదుట మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చెన్నప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకే రైతులు అప్పట్లో రుణాలు చెల్లించలేదని, ప్రస్తుతం వారి వద్ద రుణాలు చెల్లించే స్థోమత లేదన్నారు. బ్యాంక్ అధికారులు బంగారు వేలం వేయకుండా, రుణాలును రెన్యూవల్ చేసుకోవాలని ప్రాధేయపడుతున్న రెన్యూవల్ చేసుకోలేదన్నారు. ఆదేవిదంగా అర్హులైన రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రుణాలు మంజూరు చేయాలని, మహిళ సంఘాలకు రూ. 5లక్షల వరుకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పాడి పశువులకు, గొర్రెలు, మేకలుకు నాబార్డు రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజరు ప్రకాష్‌రావు ఆర్ఎం దృష్టికీ సమస్యను తీసుకెళ్లడంతో బంగారు రుణాల వేలంను అపి వేశారు. పంటల రుణాలతో సంబంధం లేకుండా బంగారు రుణాలురెన్యూవల్ చేసుకున్న, రుణాలుచెల్లించిన బంగారు ఇస్తామని తెలుపడంతో ధర్నాను విరమించారు. ఈధర్నా కార్యక్రమంలో సీపీఐ నాయకులు పోతన్న, సూరి, వెంకటరెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు. -
బంగారంపై ‘వ్యవసాయ రుణమాఫీ’ ఎగవేత
అర్హత లేదంటూ 18లక్షల మంది రైతుల ఖాతాలు తిరస్కరణ ♦ ‘వ్యవసాయ రుణం’ అని రాసినా పట్టించుకోని వైనం ♦ రూ.15వేల కోట్ల మేర భారం తగ్గించుకున్న సర్కారు ♦ ఇప్పుడు బంగారంపై పంట రుణాలు వద్దని ఆంక్షలు... సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని చెల్లించకండి... అంటూ ఎన్నికలకు ముందు ఊరూరా ప్రచారం చేసిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక మాఫీకి సవాలక్ష షరతులు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. పథకాన్ని నీరుగార్చేందుకు బాబు సర్కారు మరో ఎత్తు వేసింది. బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న 18 లక్షల రైతులకు చెందిన రూ.15వేల కోట్లకు ఎగనామం పెట్టింది. వ్యవసాయ రుణమాఫీ కోసం ‘బంగారం తనఖాపెట్టిన’ బ్యాంకు ఖాతాలను తిరస్కరించింది. అరకొర మాఫీ కూడా వీరికి కుదరదంటూ నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఈ రైతులు వ్యవసాయం కోసం రుణాలు తీసుకోలేదని, ఇతర అవసరాలకు తీసుకున్నారనే నెపాన్ని ప్రభుత్వం ఆపాదిస్తోంది. దీంతో బంగారం తనఖా పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు చెల్లించాల్సిందేనని రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. లేకుంటే వేలం వేస్తామంటున్నాయి. దీంతో ఈ రైతులు లబోదిబో అంటున్నారు. మాఫీ కాకపోగా వడ్డీల మీద వడ్డీల భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ అవుతుందని భావించి రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఇప్పుడు వడ్డీ రాయితీ కూడా దక్కకపోగా 18 శాతం మేర వడ్డీ భారం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బంగారంపై పంట రుణాలు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షల కారణంగా రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంపై రుణాల కన్నా వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలనే మంజూరు చేయాలని గతంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. వేలం నోటీసులే నిదర్శనం సర్కారు తాజా తీరుకు రైతులకు బ్యాంకులు జారీ చేస్తున్న వేలం నోటీసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.13 జిల్లాల్లో ప్రస్తుతం బ్యాంకులన్నీ బంగారం వేలం పాటలకు పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు కుప్పంబాదూరు శాఖ ఏకంగా 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ బంగారం తాకట్టుపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలుగా పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లా భారతీయ స్టేట్ బ్యాంకు శ్రీరామ్‌నగర్ శాఖ, తూర్పుగోదావరి జిల్లా సిండికేట్ బ్యాంకు బంగారం వేలం పాటలకు గాను రైతులకు నోటీసులు జారీ చేశాయి. తిరస్కరించిన ఈ తరహా రుణాలు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కలిపి 18 లక్షలమంది రైతులకు చెందిన రూ.15వేల కోట్ల వరకు ఉన్నాయని ‘సాక్షి’కి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారమవుతున్న ‘పసిడి’ రుణాలు సాక్షి, విజయవాడ బ్యూరో: తగ్గుతున్న బంగారం ధరలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ధర మరింత పతనమైతే రైతుల నుంచి గోల్డులోన్ల రికవరీలు తగ్గుతాయని భావించి రాష్ట్రంలోని బ్యాంకులన్నీ వేలం పాటలకు తెరలేపి నోటీసులు జారీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు సుమారు రూ.11 వేల కోట్లకు పైగా బంగారు రుణాల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఏటా లక్షలాది మంది రైతులు వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి రుణాలు పొందడం పరిపాటి. బ్యాంకులు ఏడాది కాలపరిమితి కింద బంగారం రుణాలు ఇస్తుంటాయి. కిందటేడాది వ్యవసాయ సీజనులో 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేలకు పైగానే ఉంది. అప్పట్లో గ్రాము బంగారానికి గరిష్టంగా రూ.2వేల దాకా రుణ మిచ్చాయి. నెల రోజుల నుంచి బంగారం ధరలు తగ్గడం మొదలయ్యాయి. దీంతో కాలపరిమితి ముగిసిన బంగారం రుణాలను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. వ్యత్యాసపు నగదు, వడ్డీ చెల్లిస్తేనే... వేలం నోటీసులకు భయపడి రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లించి ఆయా రుణాలను రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల్లో చుక్కెదురవుతోంది. మార్కెట్లో బంగారం ధర బాగా తగ్గిన నేపథ్యంలో కిందటేడాది తీసుకున్న గోల్డులోన్లను రెన్యువల్ చేయడం సాధ్యం కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారం ధరలో ఉన్న వ్యత్యాసపు ధరను చెల్లించడంతోపాటు ఏడాది కాలానికి అయిన వడ్డీ చెల్లిస్తేనే రెన్యువల్ చేయడం సాధ్యమని తేల్చి చెబుతున్నారు. -
గోల్డ్ లోన్ మాఫీ కాలేదని....
అనంతపురం:రుణమాఫీ భారం రైతులకు శాపంగా మారుతోంది. తమ రుణాలు మాఫీ అవుతాయనుకున్న రైతులకు తీవ్ర నిరాశే ఎదురు కావడంతో వారికి ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తోంది. తాజాగా ఓ రైతు తన గోల్డ్ లోన్ మాఫీ కాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని సీకే పల్లి మండలం బస్నేపల్లిలో చోటు చేసుకుంది. తాను తీసుకున్న గోల్డ్ లోన్ మాఫీ కాకపోవడంతో రామిరెడ్డి అనే రైతు శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రామిరెడ్డికి బ్యాంక్ అధికారులు వేలం నోటీసులు ఇవ్వడంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది. -
గోల్డ్.. గోల్మాల్
ఐఐఎఫ్ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది చేతివాటం... లక్షలాది రూపాయల స్వాహా: ఖాతాదారుల గగ్గోలు వనస్థలిపురం: వనస్థలిపురంలోని ఓ గోల్డు లోన్ సంస్థ సిబ్బంది చేతివాటంతో పలువురు ఖాతాదారులు మోసపోయారు. బాధితులు సద రు సంస్థ వద్ద ఆందోళనకు దిగడంతో సిబ్బంది మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివరాలు... వనస్థలిపురం సుష్మ చౌరస్తా సమీపంలో విజయవాడ జాతీయ రహదారి పక్కన ఐఐఎఫ్ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. అయితే ఈ సంస్థలో గోల్డు లోన్ తీసుకుని డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా డబ్బు కట్టాలని సంస్థ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పలువురు ఖాతాదారులు కొంత కాలంగా ఆ సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్గత విచారణలో ముగ్గురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు రుజువుకావడంతో యాజమాన్యం వారిని డిసెంబర్లో తొలగించింది. ఈ క్రమంలో బుధవారం సయ్యద్ అసద్ ఖాద్రీ అనే వ్యక్తి తాను రెండున్నర తులాల బంగారంపై రూ. 40 వేలు రుణం తీసుకోగా 52 వేలు రుణం తీసుకున్నారంటూ చెప్తున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సంస్థ ఏరియా మేనేజర్ రాంరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గతంలో పనిచేసిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ సిబ్బంది ఖాతాదారులకు ఇచ్చిన రుణాలకంటే ఎక్కువ రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపించి ఆ డబ్బు కొట్టేశారని, అలాగే అసలు చెల్లించిన కొందరు ఖాతాదారులకు నగలు తిరిగి ఇవ్వకుండా వాటిని వేరే చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసపోయిన ఖాతాదారులు ఒక్కొక్కరుగా బయటికి వస్తుండటంతో సంస్థలో లక్షలాది రూపాయల అక్రమాలు జరినట్టు తెలుస్తోంది. -
సినీస్టార్లు, నాయకుల వల్లే నిరర్ధక ఆస్తులు