అనంతపురం:రుణమాఫీ భారం రైతులకు శాపంగా మారుతోంది. తమ రుణాలు మాఫీ అవుతాయనుకున్న రైతులకు తీవ్ర నిరాశే ఎదురు కావడంతో వారికి ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తోంది. తాజాగా ఓ రైతు తన గోల్డ్ లోన్ మాఫీ కాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని సీకే పల్లి మండలం బస్నేపల్లిలో చోటు చేసుకుంది. తాను తీసుకున్న గోల్డ్ లోన్ మాఫీ కాకపోవడంతో రామిరెడ్డి అనే రైతు శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
రామిరెడ్డికి బ్యాంక్ అధికారులు వేలం నోటీసులు ఇవ్వడంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.