గోల్డ్‌ లోన్‌ తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌...! | Punjab National Bank Reduces Gold Loan Rates | Sakshi
Sakshi News home page

Punjab National Bank: గోల్డ్‌ లోన్‌ తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌...!

Oct 13 2021 7:07 PM | Updated on Oct 13 2021 8:25 PM

Punjab National Bank Reduces Gold Loan Rates - Sakshi

పండగ సీజన్‌లో మరింత ఆనందాన్ని అందించేందుకు రకరకాల డీల్స్, ఆఫర్స్‌తో గతంలో ఎన్నడు లేని రీతిలో తన బ్యాంకింగ్‌ సేవలు, లావాదేవీలను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అత్యంత ఆకర్షణీయంగా మార్చింది.  కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్‌ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందించనుంది.
చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్‌ బుక్‌ను ముంచే విధ్వంసం
 
సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)పై 7.2%, బంగారు అభరణాలపై 7.30% రేటుకు పీఎన్‌బీ ఇప్పుడు రుణాలు అందిస్తోంది. దాంతోపాటుగా హోమ్‌ లోన్‌ రేట్లను కూడా పీఎన్‌బీ తగ్గించింది. హోమ్‌లోన్‌ వడ్డీరేటు 6.60 శాతం నుంచి అందుబాటులో ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో అతి తక్కువ వడ్డీరేట్లకే పలు లోన్లను పీఎన్‌బీ అందిస్తోంది.  కారు లోన్స్‌ 7.15 శాతం, పర్సనల్‌ లోన్స్‌ 8.95శాతం మేర వడ్డీ రేట్లకు అందుబాటులో ఉంది. 
 
ఇటీవల  హోమ్‌లోన్స్‌, వెహికిల్‌ లోన్‌పై  ప్రకటించిన విధంగా ఇప్పుడు  పండగ సీజన్‌లో బంగారు అభరణాలు, ఎస్‌జీబీపై సర్వీస్‌ ఛార్జీలు/ప్రాసెసింగ్‌ ఫీజును పీఎన్‌బీ పూర్తిగా తొలగించింది. హోమ్‌ లోన్స్‌పై మార్జిన్స్‌కు కూడా బ్యాంక్‌ తగ్గించింది. హోమ్‌లోన్‌ తీసుకోదలిచిన వారు రుణ మొత్తంపై ఎటువంటి అప్పర్‌ సీలింగ్‌ లేకుండా ఆస్తి విలువలో ఇప్పుడు 80% వరకు పొందవచ్చు.
చదవండి: పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement