బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్, మదింపు, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్-యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) మానిటరింగ్, రిస్క్-వెయిట్ అప్లికేషన్‌లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.
ఆర్బీఐ గుర్తించిన ప్రధాన లోపాలు
⇒ రుణాల సోర్సింగ్, మదింపు కోసం థర్డ్ పార్టీలను ఉపయోగించడంలో లోపాలు
⇒ కస్టమర్ లేకుండానే బంగారం మదింపు
⇒ తగిన శ్రద్ధ, బంగారు రుణాల తుది వినియోగ పర్యవేక్షణ లేకపోవడం
⇒ డిఫాల్ట్ అయిన రుణాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం
⇒ ఎల్‌టీవీ పర్యవేక్షణలో లోపాలు
⇒ రిస్క్-వెయిట్‌ల అమలులో తప్పులు
అంతేకాకుండా అవుట్‌సోర్స్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందు కోసం నెలల నెలల గడువును విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment