Dead Line
-
గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్‌లైన్
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్, మదింపు, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్-యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) మానిటరింగ్, రిస్క్-వెయిట్ అప్లికేషన్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.ఆర్బీఐ గుర్తించిన ప్రధాన లోపాలు⇒ రుణాల సోర్సింగ్, మదింపు కోసం థర్డ్ పార్టీలను ఉపయోగించడంలో లోపాలు⇒ కస్టమర్ లేకుండానే బంగారం మదింపు⇒ తగిన శ్రద్ధ, బంగారు రుణాల తుది వినియోగ పర్యవేక్షణ లేకపోవడం⇒ డిఫాల్ట్ అయిన రుణాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం⇒ ఎల్టీవీ పర్యవేక్షణలో లోపాలు⇒ రిస్క్-వెయిట్ల అమలులో తప్పులుఅంతేకాకుండా అవుట్సోర్స్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందు కోసం నెలల నెలల గడువును విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
హిందూ సమాజం ద్వేషిస్తోంది.. చావడానికి అనుమతించండి!
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ్క్షప్తి చేశౠరు. జ్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె. మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ్క్షప్తి చేశారు. అయితే.. రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
Dalit Bandhu: దళిత బంధు యూనిట్లకు డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద మంజూరు చేసిన యూనిట్ల ప్రారంభంపై ఎస్సీ అభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఈ పథకం కింద అర్హుల ఎంపిక, నిధుల విడుదలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం.. నిర్దిష్ట గడువు విధించడం ద్వారా మంజూరు చేసిన యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభించి ఆయా ఎస్సీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపర్చాలని స్పష్టం చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం యూనిట్ల ప్రారంభానికి డెడ్‌లైన్ నిర్దేశించుకుంది. డిసెంబర్ 31 కల్లా ఇప్పటివరకు యూనిట్లన్నీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా కసరత్తు మొదలుపెట్టింది. వివిధ దశల్లో యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా నాలుగో విడతకు కూడా శ్రీకారం చుట్టింది. అయితే మూడు విడతల్లో 38,476 కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు జమ చేసింది. ఇప్పటివరకు కేవలం 15,650 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ కాగా.. మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని యూనిట్ల ప్రారంభానికి ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు వేగవంతం చేస్తోంది. జిల్లాల వారీ సమీక్షకు ఆదేశం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల దళితబంధు పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంజూరు చేసిన యూనిట్లు.. ప్రారంభించిన యూనిట్ల మధ్య భారీ అంతరం ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభం కాని యూనిట్లపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షల తర్వాత యూనిట్ల ప్రారంభానికి ఏయే చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు లాభసాటిగా ఉన్న వ్యాపార యూనిట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని భావిస్తున్నారు. చదవండి: జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం -
అపర్ణా మాలిక్ ‘డెడ్‌లైన్’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
అపర్ణా మాలిక్ హీరోయిన్గా, విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డెడ్లైల్. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాను శ్రీ విఘ్నతేజ ఫిలిం పతాకంపై బొమ్మారెడ్డి వీఆర్ఆర్ రచన దర్శకత్వంలో తాండ్ర గోపాల్ నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లింప్స్ ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల గురించి చర్చించే చిత్రమే ఈ డెడ్ లైన్. నేటి యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించాం. ప్రేక్షకుడు ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాం. విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు’ అని అన్నారు. -
Russia-Ukraine war: లొంగిపోతే ప్రాణభిక్ష
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం మారియుపోల్‌పై రష్యా సైన్యం దాదాపుగా పట్టు బిగించింది. అక్కడ మిగిలిఉన్న కొద్దిపాటి ఉక్రెయిన్ సైనికులు మధ్యాహ్నంలోగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ ఆదివారం హెచ్చరించారు. లొంగిపోతే ప్రాణాలకు గ్యారంటీ ఇస్తామన్నారు. అంటే ఆయుధాలు వీడి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పరోక్షంగా సూచించారు. అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉక్రెయిన్ సైనికులంతా లొంగిపోవాలన్నారు. ఉక్రెయిన్‌కు రష్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంకా తమకు ఎదురు తిరగాలని చూస్తే చావు తప్పదని ఉక్రెయిన్ సైన్యానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ అల్టిమేటం జారీ చేశారు. మిగిలింది స్టీల్ ఫ్యాక్టరీనే మారియూపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే రష్యాకు అది అతిపెద్ద విజయం అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై రష్యా మొదటి నుంచే కన్నేసింది. ఈ నగరాన్ని జేజిక్కించుకుంటే క్రిమియాకు రష్యా నుంచి భూమార్గం ఏర్పడుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్లో పాగా వేయడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 11 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కటే ఉక్రెయిన్ దళాల ఆధీనంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో 2,500 మంది ఉక్రెయిన్ జవాన్లు ఉన్నట్లు సమాచారం. రష్యా నియంత్రణలోకి వచ్చిన మారియుపోల్‌లో ఇప్పటివరకు 21,000 మంది మృతిచెందినట్లు అంచనా. ఈ నగరంలో గతంలో 4.50 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కేవలం లక్ష మంది ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యాక చాలామంది వలసబాట పట్టారు. ఖర్కీవ్‌లో ఐదుగురు బలి ఉక్రెయిన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టడమే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బ్రొవరీ ఆయుధాగారాన్ని నేలమట్టం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ఆదివారం చెప్పారు. క్షిపణులతో దాడి చేశామని తెలిపారు. అలాగే సీవీరోడోంటెస్క్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేశామన్నారు. అలాగే కొన్ని ఆయుధ డిపోలపైనా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. డోన్బాస్ సమీపంలోని జొలోట్ పట్టణంపై రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో ఆదివారం రష్యా బాంబు దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించారు, 13 మంది గాయపడ్డారు. లొంగిపోయే ఉద్దేశం లేదు: ఉక్రెయిన్ ప్రధాని రష్యా హెచ్చరికలను ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షమీహల్ కొట్టిపారేశారు. ఈ యుద్ధంలో ఆఖరిఘట్టం దాకా పోరాడుతామని స్పస్టంచేశారు. విజయం సాధించేదాకా తమ పోరాటం ఆగదన్నారు. సాధ్యమైనంత వరకు దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేతప్ప రష్యాకు లొంగిపోయే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. మారియుపోల్ నగరం తమకు రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మాల్యార్ చెప్పారు. మతిలేని యుద్ధాన్ని ఆపండి: పోప్ ఫ్రాన్సిస్ ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న బీభత్సకాండపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తంచేశారు. మతిలేని యుద్ధాన్ని వెంటనే ఆపాలని రష్యాకు సూచించారు. ఈస్టర్ సండే సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ సందేశమిచ్చారు. శాంతికి చొరవచూపాలని రష్యాకు హితవు పలికారు. దయచేసి యుద్ధంలో ఎవరూ భాగస్వాములు కావొద్దని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ► నల్లసముద్రంలోని తమ రేవుల్లోకి రష్యా నౌకల ప్రవేశాన్ని బల్గేరియా నిషేధించింది. ► తమకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుని ఆర్థిక సలహాదారు జీ7 దేశాలను కోరారు. చర్చలకు విఘాతం: జెలెన్స్కీ మారియుపోల్‌ను గుప్పిటపెట్టే ప్రయ త్నాలు చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అక్కడి పౌరులను సైన్యం పొట్టనపెట్టుకుంటోందని మండిపడ్డారు. అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. రష్యా అణుదాడులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. -
వెనక్కి రాకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే.. ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్‌లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన. మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్గెని. అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు. -
వారిని 2024లోపు దేశం నుంచి పంపించేస్తాం: అమిత్‌షా
రాంచీ: దేశంలోకి చట్ట విరుద్ధంగా వలస వచ్చిన ప్రతి ఒక్కరినీ బయటకు పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశమంతటా నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటు దారులందరినీ 2024లోపు దేశం నుంచి బయటికి పంపించివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. చొరబాటుదారులు ఎక్కడికి వెళ్తారు..? ఏం తింటారు..? అంటూ ఆయన అమితమైన ప్రేమ చూపిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. 2024లోపు క్రమక్రమంగా దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తామని అమిత్‌షా అన్నారు. -
జనగామ: తుది ప్రచారానికి 48 గంటలే..
సాక్షి, జనగామ: సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. డిసెంబర్ ఏడున జరుగనున్న పోలింగ్‌కు అన్ని రాజ కీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా కార్యక్రమాలతో ప్రచారం తారస్థాయికి చేరుకుంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో హోరాహోరీ ప్రచారంతో అభ్యర్థులు పొలిటికల్ హీట్ పెంచారు. ప్రచారానికి మరో 48 గంటలే.. డిసెంబర్ ఏడున జరుగనున్న పోలింగ్‌కు ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనెల ఐదో తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి గడువు ఉంది. అభ్యర్థులకు మంగళ, బుధవారం రెండు రోజులు మాత్రమే ఓటర్లను కలుసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారంతోపాటు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిం చుకోవడానికి కూడా అంతే సమయం ఉంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పదునెక్కిన ప్రచారం.. ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మి గిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నవంబర్ 19వ తేదీన పాలకుర్తి, 23న జనగామ, 26న స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వద బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఆపద్ధర్మ భారీనీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రచారం నిర్వహించారు. పాలకుర్తిలో గాయని మధుప్రియ ఎర్రబెల్లి తరఫున ప్రచారం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ప్రచార సరళితో పాటు పార్టీ కార్యక్రమాలను ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ఒంటి చేత్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తుది ప్రచారానికి అగ్రనేతలు.. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో జిల్లాకు అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్‌రావు ప్రచారంచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు చేపట్టి ఓటర్లను కలవడం కోసం టూర్ షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. అగ్రనాయకుల ప్రచార కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొననుంది. -
బీపీఎస్.. చివరి అవకాశం బాస్
తాడేపల్లిగూడెం : అనుమతులు లేకుండా చేపట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం రూపొందించిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) గడువు ఈ నెలాఖరున ముగియనుంది. దీంతో ఈ పథకాన్ని మునిసిపాలిటీల్లోని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చేసుకున్న దరఖాస్తుల్లో కొన్నింటిని తిరస్కరించగా మరికొన్ని పెండింగ్‌లో ఉంచారు. వాటిపై కూడా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, తిరస్కరించిన దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను చూసేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు , లైసెన్స్డ్ సర్వేయర్లను వెంట పెట్టుకుని దరఖాస్తు చేసి క్రమబద్ధీకరించుకోని వారి ఇంటి తలుపులు తట్టనున్నారు. బీపీఎస్ గడువు నెలాఖరుతో ముగుస్తున్నందున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అర్హులైన దరఖాస్తుదారుల నుంచి సొమ్ములు కట్టించుకోవాలనే ఆదేశాలు ఇప్పటికే మునిసిపాలిటీల్లోని పట్టణ ప్రణాళికా విభాగానికి వచ్చాయి. జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 4,635 బీపీఎస్ పథకం కింద జిల్లాలోని మునిసిపాలిటీల నుంచి 4,635 దరఖాస్తులు వచ్చాయి. భీమవరంలో 1,155 దరఖాస్తులు రాగా 16 తిరస్కరించారు. 81 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 1058 దరఖాస్తులను అనుమతించారు. ఏలూరులో 695 దరఖాస్తులు రాగా 28 దరఖాస్తులను తిరస్కరించారు. 70 పెండింగ్‌లో ఉండగా, 597 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. జంగారెడ్డిగూడెంలో 78 దరఖాస్తులు రాగా, ఏడింటిని తిరస్కరించగా, ఆరు పెండింగ్‌లో ఉంచి, 65 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. కొవ్వూరులో 242 దరఖాస్తులు రాగా ఆరింటిని తిరస్కరించారు. 58 పెండింగ్‌లో ఉన్నాయి. 178 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నరసాపురంలో 142 దరఖాస్తులు రాగా, రెండింటిని పెండింగ్‌లో ఉంచి, 140 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. నిడదవోలులో 122 దరఖాస్తులు రాగా, పదింటిని తిరస్కరించగా, 16 పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 96 దరఖాస్తులను ఆమోదించారు. పాలకొల్లులో 567 దరఖాస్తులు రాగా, ఒక దరఖాస్తును తిరస్కరించగా, 14 పెండింగ్‌లో ఉంచారు. 552 దరఖాస్తులను ఆమోదించారు. తణుకులో 1,087 దరఖాస్తులు రాగా 15 దరఖాస్తులను తిరస్కరించారు. 347 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచి, 725 దరఖాస్తులను ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో 547 దరఖాస్తులు రాగా122 దరఖాస్తులను తిరస్కరించారు. 13 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 412 దరఖాస్తులను ఆమోదించారు. తిరస్కరించిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వాటిని అధికారులు గుర్తిస్తారు. అర్హత ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి తగిన రుసుములు కట్టించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియో చేసుకోవాలని జిల్లా ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టాం బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారు వారి దరఖాస్తులను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలి. దీనికోసం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. లైసెన్స్డ్ సర్వేయర్లతో డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం. అర్హత కలిగిన దరఖాస్తులు ఉంటే క్రమబద్ధీకరిస్తారు. ఈ అవకాశాన్ని దరఖ> స్తుదారులు సద్వినియో చేసుకోవాలి.– బీఎన్ఎస్.సాయిబాబా, ఆర్డీ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డిపార్టుమెంట్ -
సీపీఎస్ రద్దుకు సహకరిస్తేనే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుకు, పాత పెన్షన్ స్కీం అమల్లోకి తెచ్చేందుకు సహకరించిన వారికే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) స్పష్టం చేసింది. 2018లో సీపీఎస్‌ను ఎవరు రద్దు చేస్తారో వారికే 2019 ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని, అది కాంగ్రెస్ చేస్తే వారికి ఓట్లు వేస్తామని, బీజేపీ చేస్తే వారికే వేస్తామని, టీఆర్ఎస్ చేస్తే టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని పేర్కొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ జనజాతర జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. సీపీఎస్ రద్దుకు సహకరించని వారికి వ్యతిరేకంగా, పాత పెన్షన్ స్కీం అమల్లోకి తెచ్చేవారికి అనుకూలంగా తామే కాకుండా, తమ కుటుంబాలు, తమపై ఆధారపడిన వారు, తమకు పరిచయం ఉన్నవారితో ఓట్లు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు ఈ ఏడాది ఆగస్టు 23 డెడ్‌లైన్ అని స్థితప్రజ్ఞ ప్రకటించారు. ఆలోగా సీపీఎస్‌ను రద్దు చేయాలని, లేదంటే విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ అన్న ప్రతిసారీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలున్నాయని అంటోందని, దేశంలో 20 రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే వేతనాలు తక్కువగా ఉన్నాయని వివరాలతో సహా వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీపీఎస్‌లోనే చేరుతామని 2014 జూన్ 19న ట్రెజరీస్ డైరెక్టర్ రాసిన లేఖ, అదే నెల 23న ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఒప్పందం కాపీలను ‘ఏది నిజం’పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సీపీఎస్ రద్దు కేంద్రం పరిధిలో ఉందని సీఎం అంటున్నారని, నిజంగా కేంద్రం పరిధిలోనే ఉంటే దానినుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత మీకు లేదా? అని స్థితప్రజ్ఞ ప్రశ్నించారు. సీపీఎస్ అమలు చేసినపుడు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా, రాష్ట్రంలోనూ మీ మంత్రులు లేరా? అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం, కేంద్రం సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇస్తుంటే ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ‘సీపీఎస్ ఉద్యోగులకు ఉరి పడింది. 2004 సెప్టెంబర్ 1న కాదని, 2014 ఆగస్టు 23నాడే అని పేర్కొన్నారు. 1.32 లక్షల మంది ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి, పాత పెన్షన్ స్కీం వద్దని, సీపీఎస్‌నే అమలు చేస్తామని పీఎఫ్ఆర్డీఏకు లేఖ రాసింది.. 28న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తీరుపైనా మండిపడ్డారు. సీపీఎస్ ఉద్యోగిగా ఉండి, మరణించిన వారి కుటుంబాలు పెన్షన్‌కు కూడా నోచుకోని పరిస్థితులను ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో చెప్పించారు. ఉద్యోగుల భవిష్యత్తు స్టాక్ మార్కెట్లో తాకట్టు ప్రధాన వక్తగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ సీపీఎస్‌పై సీఎం మాటలకు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు పొంతనే లేదన్నారు. ఉద్యోగుల భవిష్యత్తును స్టాక్ మార్కెట్లో తాకట్టు పెట్టడానికి మీరెవరని ప్రశ్నించారు. ఇది పాత ఉద్యోగులకూ ప్రమాదకరమేనన్నారు. సంస్కరణలు అమలు చేసినపుడు ఒక సెక్షన్‌కు అమలు చేసి, మరో సెక్షన్‌కు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు. సీపీఎస్ విషయంలో దానిని వర్తింపజేయాలని ఎవరైనా కోర్టుకు వెళితే దానిని పాత పెన్షన్ ఉద్యోగులకు వర్తింపజేయాలని చెప్పే అవకాశం ఉందన్నారు. అందుకే సీపీఎస్ రద్దుపై ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. అంతకంటే ముందు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి ఎన్ ఉపేందర్, కార్యనిర్వాహక కార్యదర్శులు చంద్రకాంత్, సమీనాఖాద్రీ, ఉపాధ్యక్షులు దర్శన్, పి. శ్రీనివాస్, సలహాదారు రబీజుద్దీన్ ప్రసంగించారు. ఇటీవల మరణించిన సీపీఎస్ ఉద్యోగి ఆవుల సంపత్ భార్య స్వరూపకు ఈ సందర్భంగా యూనియన్ తరపున చేయించిన బీమా ద్వారా వచ్చిన రూ. లక్షను అందజేశారు. సంఘం కోశాధికారి నరేశ్‌గౌడ్ రాసిన అక్షర కరవాలం పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఒక్క రోజే గడువు
ప్రొద్దుటూరు టౌన్ :ప్రభుత్వం ఈ ఏడాది పన్ను వసూలుకు విధించిన గడువు శనివారంతో ముగియనుంది. వంద శాతం పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కాలేదు. పన్ను బకాయి ఉన్న వారి ఇళ్ల వద్దకు, వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి గంటకొడుతున్నా, విద్యుత్, కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు వసూళ్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాలు వదలి రోడ్లపైనే ఉంటున్నారు. అయినా జిల్లాలోని ఏ మున్సిపాలిటీ వంద శాతం పన్ను వసూలు చేయాలేదు. మరొక్క రోజే గడువు ఉండటంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వసూళ్లలో వెనుకబడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో బకాయిలు ఇచ్చేంత వరకు అధికారులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారానికి పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో పులివెందుల మున్సిపాలిటీ ఉండగా, చివరి స్థానంలో రాయచోటి మున్సిపాలిటీ నిలిచింది. పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల బ కాయిలు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి రూ.74లక్షలు బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కమిషనర్ బండి శేషన్న, ఆర్ఓ మునికృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని నిరసన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ విధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. గత ఏడాది కంటేరూ.2కోట్లు అధికంగా వసూలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.14.82 కోట్లు ప్రైవేటు ఆస్తులపై, కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో శుక్రవారానికి రూ.11.84 కోట్లు వసూలైంది. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.2కోట్లు అధికంగా వసూలు చేశాం. ప్రభుత్వ బకాయిలు రూ.1.80 కోట్లు ఉండగా రూ.18 లక్షలు మాత్రమే వసూలైంది. శనివారంలోగా 80 శా తానికిపైగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తాం. – మునికృష్ణారెడ్డి, మున్సిపల్ ఆర్ఓ, ప్రొద్దుటూరు. -
రేషన్‌కు మిగిలింది రెండు రోజులే...!
సాక్షి,సిటీబ్యూరో: రేషన్ సరుకుల పంపిణీకి గడువు మిగిలింది ఇక రెండు రోజులే. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి రేషన్ కోటా పంపిణీ నిలిచిపోతుంది. రేషన్ షాపులు సైతం తెరవరు. మార్చి నుంచి ప్రతినెలా15 వరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ జరుగనుంది. దీనిపై గత వారం రోజులుగా పౌరసరఫరాల శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. వినియోగదారుల సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారంతో పాటు ప్రత్యేక వాహనాలతో ప్రచారం నిర్వహిస్తోంది. రేషన్ షాపులకు వారాంతపు సెలవు రోజు సైతం రద్దు చేసింది. మహా నగరం పరిధిలో సుమారు 26 శాతం కుటుంబాలు సరుకుల పంపిణీకి దూరంగానే ఉన్నారు. ప్రజా పంపి ణీ వ్యవస్ధలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రేషన్ సరుకుల పంపిణీ గడవును కుదించిన విషయం విదితమే. గత నెల జనవరిలో పక్షం రోజుల గడువు విధించి నప్పటికీ పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 25 వ తేదీవరకు పొడిగించింది. తిరిగి ఈ నెల సరుకుల పంపిణీకి 20 వరకు డెడ్‌లైన్ విధించింది. గత నెల మాదిరిగా సమస్య పునరావృతం కాకుండా గడువుపై ప్రచారం ముమ్మరం చేస్తున్న పూర్తి స్థాయి సరుకుల పంపిణీ ప్రక్రియ మాత్రం పూర్తయ్యే అవకాశాలు కానరావడం లేదు. 2.87లక్షల కుటుంబాలు హైదరాబాద్ మహా నగరం పరిధిలోని ఆహార భద్రత (రేషన్) కార్డు దారులైన సుమారు 2.87 లక్షల కుటుంబాలు రేషన్ సరుకులు డ్రా చేయనట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. మహా నగర పరిధిలో పౌరసరఫరాల శాఖకు 12 సర్కిల్స్ ఉండగా వాటి పరిధిలో సుమారు 10.94 లక్షల ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం కార్డుల్లో ఈ నెల కోటా సరుకులు డ్రా చేసి కార్డుల సంఖ్య 8.06 లక్షలకు మించలేదు. మిగిలిన కార్డులు గడువు సమీపిస్తున్నా సరుకులను మాత్రం డ్రా చేయలేదు. రేషన్ షాపులకు వారాంతపు సెలవు దినమైన శుక్రవారం కూడా పనిదినంగా మార్చి ఒకటవ తేదీ నుంచి వరసగా 20 వరకు రేషన్ షాపు తెరిచి ఉంచి సరుకులు పంపిణీ ప్రక్రియను కొనసాగించారు. అయినప్పటికీ కొన్ని కుటుంబాలు ఆర్ధిక సమస్యనో? లేక వీలుపడకనో సరుకులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
మార్చి 31 వరకూ ఆధార్ గడువు పొడిగింపు
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, మొబైల్ సబ్స్క్రైబర్లకు తమ ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం, ఢిల్లీ సర్కార్ల వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనివార్యతపై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించేందుకు సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు కేంద్రం నివేదించింది. రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఇప్పటివరకూ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలకు డిసెంబర్ 31లోగా ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉండగా, మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6లోగా ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. తాజాగా మార్చి 31వరకూ వీటి డెడ్‌లైన్‌ను సుప్రీం అనుమతితో కేంద్రం పొడిగించే అవకాశం ఉంది. -
‘పటేళ్లకు రిజర్వేషన్లపై 24 గంటల్లో తేల్చండి’
గాంధీనగర్: గుజరాత్లో అధికారంలోకి వస్తే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) గడువు విధించింది. పాస్ నేతలతో ఢిల్లీలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సిన్హ్ తొలుత స్వల్పకాలంపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయిన తర్వాత మళ్లీ మాట్లాడతామని చెప్పి ఆయన వెళ్లిపోయారు. పాస్ నేత దినేశ్ బమానియా మాట్లాడుతూ ‘సమావేశం అయిపోయినా ఆయన మమ్మల్ని కలవలేదు. మేం ఫోన్ చేస్తున్నా స్పందించలేదు. ఇది మాకు అవమానం’ అని అన్నారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని దినేశ్ కాంగ్రెస్ వారికి కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు పాస్ నేత హర్దిక్ పటేల్ మాజీ సన్నిహితులు ఇద్దరు తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో పాస్ నుంచి బహిష్కరణకు గురైన కేతన్ పటేల్, అమరేశ్ పటేల్‌లు శనివారం బీజేపీలో చేరారు -
సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ గడువు డిసెంబర్ 31
న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆధార్ కార్డు పొందేందుకు గడువును ప్రభుత్వం డిసెంబరు 31 వరకు పొడిగించింది. అయితే ఈ పొడిగింపు ఆధార్ కార్డుకు ఇంకా దరఖాస్తు చేయని వారికి మాత్రమే వర్తిస్తుందంటూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీపై వంట గ్యాస్, ఎరువులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చే సరకులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సహా దాదాపు 135 పథకాల ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ కార్డును సెప్టెంబర్ 30లోపు అందరూ తీసుకోవాల్సిందేనని గతంలో ప్రభుత్వం గడువు విధించడం తెలిసిందే. -
అక్టోబర్ 2 డెడ్‌లైన్
హసన్‌పర్తి : మరుగుదొడ్ల నిర్మాణానికి అక్టోబర్ రెండో తేదీ డెడ్‌లైన్ అని.. ఆ తర్వాత మరుగుదొడ్లు లేని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంపై హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరి«ధిలోని హసన్‌పర్తి, ఎల్కతుర్తి, ఐనవోలు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు చెం దిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గాంధీ జయంతి వరకు లక్ష్యం పూర్తిచేయాలని.. ఇందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మరుగుదొడ్లులేని వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతు న్న మాట వాస్తవమన్నారు. ఇప్పుడు మాత్రం స్వచ్ఛభారత్ మిషన్(ఎస్బీఎం) కింద బిల్లులు చెల్లింపులు వెంటవెంటనే జరుగుతున్నాయని వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్‌బియ్యం, సబ్సిడీగ్యాస్, పెన్షన్‌తో పాటు ఇంటినిర్మాణ అనుమతులు కూడా నిలుపుదల చేస్తామని.. ఈ మేరకు వారికి అవగాహన కల్పించాలని కోరారు. డీఆర్డీఏ పీడీ రాము తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న పెళ్ళి వయసు
పద్ధెనిమిదేళ్ళ వయసుకే పెళ్లిని ఇష్టపడే అమ్మాయిలు తగ్గిపోయారు. పోనీ 20 ఏళ్లకు పెళ్ళంటే చదువంటున్నారు. పాతికేళ్లకు చేసుకోమంటే ఉద్యోగం అంటున్నారు. ముప్ఫై ఏళ్లు నిండితే గాని పెళ్లి మాట ఎత్తొద్దని ఇంట్లోని పెద్దలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. అమెరికాలో హర్ క్యాంపస్ డాట్‌కామ్ వాళ్లు ‘డెడ్ లైన్’ పేరుతో చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మొత్తం 2,600 కళాశాలలు, 677 యూనివర్సిటీలలో చదువుకుంటున్న అమ్మాయిలందరి అభిప్రాయాలు సేకరించి ఈ అధ్యయనం చేశారు. అందులో తేలింది ఏమిటంటే, 85 శాతం కాలేజి అమ్మాయిలు ముప్ఫై ఏళ్ల వయసులో పెళ్లిని ఇష్టపడుతున్నారు. ఈ విషయం గురించి హర్కాంపస్ సిఇఓ స్టెఫిన్ కప్లేన్ మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనంలో వ్యక్తమైన అమ్మాయిల అభిప్రాయాన్ని మేం ముందుగానే ఊహించాం. చదువు, ఉద్యోగం, బాధ్యతలు, ప్లానింగ్...అన్నీ సక్రమంగా చేసుకోడానికి చదువు తర్వాత అమ్మాయికి కొంత సమయం అవసరమవుతుంది. జీవితం పట్ల కచ్చితమైన ప్లానింగ్ ఉన్న ప్రతి అమ్మాయికీ లక్ష్యం చేరుకోడానికి ఈ మాత్రం సమయం పడుతుంది మరి’’ అని అన్నారామె. ఈ అధ్యయనానికి ‘డెడ్‌లైన్’ అనే పేరెందుకు పెట్టారంటే... ‘‘పెళ్లికి ముందు తను చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకోవాలి. ఫలానా సమయం లోగా పనులన్నీ పూర్తిచేసుకోవాలనే డెడ్‌లైన్ పెట్టుకుంటేనే అన్నీ సక్రమంగా పూర్తిచేసుకోగలరు. ఆ సమయాన్నే మేం ‘డెడ్‌లైన్’ అంటున్నాం’’ అంటారు ఈ అధ్యయన నిర్వాహకులు.