న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆధార్ కార్డు పొందేందుకు గడువును ప్రభుత్వం డిసెంబరు 31 వరకు పొడిగించింది. అయితే ఈ పొడిగింపు ఆధార్ కార్డుకు ఇంకా దరఖాస్తు చేయని వారికి మాత్రమే వర్తిస్తుందంటూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీపై వంట గ్యాస్, ఎరువులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చే సరకులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సహా దాదాపు 135 పథకాల ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ కార్డును సెప్టెంబర్ 30లోపు అందరూ తీసుకోవాల్సిందేనని గతంలో ప్రభుత్వం గడువు విధించడం తెలిసిందే.