సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, మొబైల్ సబ్‌స్క్రైబర్లకు తమ ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ల వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనివార్యతపై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించేందుకు సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు కేంద్రం నివేదించింది.
రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఇప్పటివరకూ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలకు డిసెంబర్ 31లోగా ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉండగా, మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6లోగా ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. తాజాగా మార్చి 31వరకూ వీటి డెడ్‌లైన్‌ను సుప్రీం అనుమతితో కేంద్రం పొడిగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment