హసన్‌పర్తి : మరుగుదొడ్ల నిర్మాణానికి అక్టోబర్ రెండో తేదీ డెడ్‌లైన్ అని.. ఆ తర్వాత మరుగుదొడ్లు లేని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంపై హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరి«ధిలోని హసన్‌పర్తి, ఎల్కతుర్తి, ఐనవోలు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు చెం దిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గాంధీ జయంతి వరకు లక్ష్యం పూర్తిచేయాలని.. ఇందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మరుగుదొడ్లులేని వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
గతంలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతు న్న మాట వాస్తవమన్నారు. ఇప్పుడు మాత్రం స్వచ్ఛభారత్ మిషన్(ఎస్‌బీఎం) కింద బిల్లులు చెల్లింపులు వెంటవెంటనే జరుగుతున్నాయని వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్‌బియ్యం, సబ్సిడీగ్యాస్, పెన్షన్‌తో పాటు ఇంటినిర్మాణ అనుమతులు కూడా నిలుపుదల చేస్తామని.. ఈ మేరకు వారికి అవగాహన కల్పించాలని కోరారు. డీఆర్‌డీఏ పీడీ రాము తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 2 డెడ్‌లైన్
Published Sat, Sep 23 2017 12:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement