వారిని 2024లోపు దేశం నుంచి పంపించేస్తాం: అమిత్‌షా | Amit Shah Sets 2024 Is Nation Wide NRC Deadline | Sakshi
Sakshi News home page

వారిని 2024లోపు దేశం నుంచి పంపించేస్తాం: అమిత్‌షా

Published Mon, Dec 2 2019 6:17 PM | Last Updated on Mon, Dec 2 2019 6:22 PM

Amit Shah Sets 2024 Is Nation Wide NRC Deadline - Sakshi

రాంచీ: దేశంలోకి చట్ట విరుద్ధంగా వలస వచ్చిన ప్రతి ఒక్కరినీ బయటకు పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు.  దేశమంతటా నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటు దారులందరినీ 2024లోపు దేశం నుంచి బయటికి పంపించివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. చొరబాటుదారులు ఎక్కడికి వెళ్తారు..? ఏం తింటారు..? అంటూ ఆయన అమితమైన ప్రేమ చూపిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. 2024లోపు క్రమక్రమంగా దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తామని అమిత్‌షా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement