![Bank of Baroda launches 251 Gold Loan Shoppes - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/23/DDDD.jpg.webp?itok=znmicFov)
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా 251 బంగారం రుణాల షాపీలను ప్రారంభించింది. వీటిలో 35 షాపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. కొత్త వాటి ప్రారంభంతో మొత్తం సంఖ్య 1,238కి చేరింది. బంగారంపై రుణాలపరమైన సరీ్వసులు అందించేందుకు బ్యాంకు శాఖలోనే ప్రత్యేకంగా కేటాయించిన ఎన్‌క్లోజర్‌ను షాపీగా వ్యవహరిస్తారు.
ఇందులో ఒక ఇంచార్జి, కనీసం ఇద్దరు అప్రైజర్లు ఉంటారు. రుణాలపై నిర్ణయాధికారం ఇంచార్జికే అప్పగిచడం వల్ల ప్రాసెసింగ్ మరింత వేగవంతం కాగలదని బీవోబీ ఈడీ అజయ్ కే. ఖురానా తెలిపారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో బంగారంపై అధిక మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, రూ. 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజులు లేవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment