Govt Sector Banks
-
బ్యాంక్ ఆఫ్ బరోడా 251 పసిడి రుణాల షాపీలు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా 251 బంగారం రుణాల షాపీలను ప్రారంభించింది. వీటిలో 35 షాపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. కొత్త వాటి ప్రారంభంతో మొత్తం సంఖ్య 1,238కి చేరింది. బంగారంపై రుణాలపరమైన సరీ్వసులు అందించేందుకు బ్యాంకు శాఖలోనే ప్రత్యేకంగా కేటాయించిన ఎన్క్లోజర్ను షాపీగా వ్యవహరిస్తారు. ఇందులో ఒక ఇంచార్జి, కనీసం ఇద్దరు అప్రైజర్లు ఉంటారు. రుణాలపై నిర్ణయాధికారం ఇంచార్జికే అప్పగిచడం వల్ల ప్రాసెసింగ్ మరింత వేగవంతం కాగలదని బీవోబీ ఈడీ అజయ్ కే. ఖురానా తెలిపారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో బంగారంపై అధిక మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, రూ. 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజులు లేవని ఆయన పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదు
బాసెల్ 3 ప్రమాణాలపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ కోల్కతా: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) బాసెల్ 3 మూలధన ప్రమాణాలు అందుకోవాలంటే కేంద్రం వాటిల్లో వాటాలు విక్రయిస్తే సరిపోదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ చెప్పా రు. పీఎస్బీలు రాబోయే ఐదేళ్లలో నిధుల సమీకరణకు స్పష్టమైన ప్రణాళికను స్వయంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని శనివారం జరిగిన ఒక సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పీఎస్బీలకు నిధులు సమకూర్చే క్రమంలో వాటిల్లో త న వాటాలను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం యోచి స్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ఇలా వాటాలు తగ్గించుకోవడం ద్వారా నిధులు వచ్చినా అవి బాసెల్ 3 ప్రమాణాలు అందుకునేందుకు సరిపోవని గాంధీ పేర్కొన్నారు. పీఎస్బీలు స్వయంగా నిధులు సమీకరించుకునేందుకు నాన్-ఓటింగ్ రైట్స్ షేర్ క్యాపిటల్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ క్యాపిటల్, గోల్డెన్ ఓటింగ్ రైట్స్ షేర్ క్యాపిటల్ మొదలైన అంశాలను పరిశీలించవచ్చని తెలిపారు. రెండో అంచె మూలధన అవసరాల కోసం బ్యాం కులు కావాలంటే దీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.