
సినీస్టార్లు, నాయకుల వల్లే నిరర్ధక ఆస్తులు
సినిమా తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించకపోతే.. ఆ బంగారాన్ని వేలం వేస్తామని కూడా సీఎండీ రాజేంద్రన్ చెప్పారు.