'గోల్డ్ లోన్స్పై మేం హామీ ఇవ్వలేదు'
హైదరాబాద్ : ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలు మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణమాఫీపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని... అవి పంట రుణాల కిందకు రావని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. బ్యాంకుల్లో రైతుల రుణాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రూ. లక్ష లోపు రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. మరో వారంరోజుల్లో మరోసారి భేటీ కావాలని కేసీఆర్ ఆదేశించారు.రూ.లక్ష వరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకోవటంతో ప్రభుత్వంపై సుమారు రూ.12 వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది.