
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే...
కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్
కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత
బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు
చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు
కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది.
రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15
బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత.
ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment