Homeloans
-
ఈ జాగ్రత్తలు పాటిస్తే హోం లోన్ చెల్లింపులు ఎంతో ఈజీ !
గృహ రుణం తీసుకుంటున్నామంటే దీర్ఘకాలం పాటు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. ఆ రుణాన్ని 10–20 ఏళ్లపాటు చెల్లించేందుకు ఆర్థికంగా, భౌతికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధులై ఉండాలి. ఇలా దీర్ఘకాలం పాటు రుణ చెల్లింపుల ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత.. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి రుణ గ్రహీత మరణిస్తే.. లేదా రుణ గ్రహీత ఆదాయం నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రుణం తీసుకునే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే తన కుటుంబంపై రుణం తీర్చాల్సిన ఆర్థిక భారం పడుతుందన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో గృహ రుణం చెల్లింపులు ఆగిపోకుండా సజావుగా చెల్లించేలా చూసుకునేందుకు మార్గాలున్నాయి. రుణంపై బీమా కవరేజీ గృహ రుణం ఇచ్చే సమయంలోనే కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ కవరేజీతో చెల్లింపులకు రక్షణ ఏర్పడుతుంది. సాధారణంగా హోమ్‌లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (హెచ్‌ఎల్‌పీపీ) అన్నది మీరు తీసుకునే గృహ రుణం విలువకు సమానంగా ఉంటుంది. ఇలా కాకుండా వ్యక్తిగతంగానూ రుణ గ్రహీత టర్మ్ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. అప్పుడు హెచ్‌ఎల్‌పీపీ కూడా రూ.25 లక్షల కవరేజీతో వస్తుంది. ఇందుకు ప్రీమియం కింద సుమారు రూ.86,335 చెల్లించాల్సి వస్తుంది. ఒక ఏడాది తర్వాత చెల్లించాల్సిన గృహ రుణం రూ.20.5 లక్షలకు తగ్గిందనుకుందాం. ఆ సమయంలో రుణ గ్రహీత మరణిస్తే బీమా సంస్థే పాలసీదారు తరఫున మిగిలిన గృహ రుణ బకాయిని పూర్తిగా తీర్చేస్తుంది. టర్మ్ కవరేజీ టర్మ్ కవరేజీని విడిగా తీసుకోవడం వల్ల పాలసీదారుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టుగానే రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్న ఏడాది తర్వాత రుణ గ్రహీత మరణించించినట్టయితే.. రూ.25 లక్షల టర్మ్ ప్లాన్ పూర్తి మొత్తాన్ని పొందొచ్చు. అంటే మిగిలిన రుణ బకాయి రూ.20.5 లక్షలుపోను రూ.4.5 లక్షలను రుణ గ్రహీత కుటుంబం అందుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల పరంగా హెచ్ఎల్పీపీతో పోలిస్తే టర్మ్ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని రుణం తీసుకునే సమయంలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ బీమా ప్లాన్ మాదిరే క్రమానుగతంగా ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంటుంది. కనుక హెచ్‌ఎల్‌పీపీ, టర్మ్ప్లాన్లో అనుకూలమైన దానిని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు. అత్యవసర నిధి బీమా కవరేజీ తీసుకుని హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధమై ఉండాలి. గృహ రుణం మాదిరి పెద్ద మొత్తంలో రుణ బాధ్యతను మోస్తున్నప్పుడు.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా, గృహ రుణం ఈఎంఐలకు చెల్లింపులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. కనుక లిక్విడ్ ఫండ్స్‌లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల పెట్టుబడులపై రాబడులకుతోడు.. నిర్ణీత కాలంలో ఒక నిధి ఏర్పడుతుంది. ఈ చిన్న అడుగులతో గృహ రుణ బాధ్యత విషయంలో భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థతులు తలెత్తినా అప్పుడు మీరు కంగారు పడిపోవక్కర్లేదు. మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు అవుతుంది. గృహ రుణం ఈఎంఐను క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఏర్పడుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ అన్నది భవిష్యత్తులో రుణ అవసరాల్లో ఎంతో సాయపడుతుంది. - అరవింద్ హాలి, మోతీలాల్ ఓస్వాల్ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో చదవండి: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు.. తెలియకుండానే బోలెడంత లాస్!! -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఖాతాదారులు యోనో యాప్ నుంచి గృహరుణాలను పొందవచ్చునని ఎస్బీఐ తెలిపింది. యోనో యాప్ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఈ సందర్భంగా సంస్ధ ఎండీ సీఎస్ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ...“ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే స్థోమత బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుంద"ని పేర్కొన్నారు. ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు రూ. 30 లక్షలకు 6.70 శాతం , రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు 6.95 శాతం . రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని ఎస్బీఐ తెలిపింది. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. చదవండి: SBI Recruitment 2021: ఎస్బీఐలో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టులు -
విమెన్స్ డే : ఎస్బీఐ బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు తెలిపింది. విమెన్స్ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారు, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. Pamper yourself the right way! Avail this sparkling offer exclusively on YONO app.#SBICelebratesHer #WomensDay #Women #Jewellery #Offer pic.twitter.com/kimrjphHCW — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 Your Dream Home. Our Goal. 🏡💭 On #WomensDay, we make it special with an additional concession of 5 bps* to women borrowers and interest starting at 6.70%* onwards. To know more, visit: https://t.co/L7SN4HqGFg pic.twitter.com/CuXWtvBhxD — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 -
కీలక మైలురాయి : హోం లోన్లపై ఎస్బీఐ ఆఫర్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కీలక మైలురాయిని అధిగమించింది. హోంలోన్ బిజినెస్‌లో రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ సందర్భంగా కస్టమర్లకు హోంలోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫర్లను ఎస్బీఐ ప్రకటించింది. మార్కెట్ లీడర్‌గా ఎస్బీఐ హవా : కీలక మైలురాయి రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ (రెహబు) గత పదేళ్ళలో 5 రెట్లు పుంజుకోవడం విశేషం. కరోనా మహమ్మారి, లాక్డౌన్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ భారీ వృద్ధిని నమోదు చేసింది. అలాగే 2024 కల్లా దీనిని రూ.7 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ దిశగానే అలాగే రోజుకు వెయ్యిమంది గృహ రుణ కస్టమర్లు సరసమైన వడ్డీరేటుకే లోన్లను అందించనుంది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. కొత్త గృహ రుణ వినియోగదారుల కోసం బ్యాంక్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 7208933140 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. సొంత ఇంటి కలల్ని సాకారం చేసుకోవాలనుకునే వినియోగదారులకు సరసమైన వడ్డీరేటులో రుణాలను అందుబాటులోకి తీసుకు రావడానికి నిరంతర ప్రయత్నం చేస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. ఈ కృషిలో భాగంగానే 5 లక్షల కోట్లు మార్క్ తమకు గొప్ప విజయం, తమపై వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. మార్కెట్ లీడర్‌గా తమ స్థానాన్ని నిలబెట్టు కోవడం సంతోషంగా ఉందన్నారు. గృహ రుణ పంపిణీలో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు బ్యాంక్ వివిధ డిజిటల్ కార్యక్రమాలపై కృషి చేస్తూ, ఎండ్-టు-ఎండ్ డిజిటల్పరిష్కారాన్ని అందించేలా ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం రిటైల్ లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆర్‌ఎల్‌ఎంఎస్) లాంచ్ చేశామన్నారు. రెగ్యులర్ హోమ్ లోన్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, ఆర్మీ అండ్ డిఫెన్స్ సిబ్బందికి ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్, ఎస్బిఐ మాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బిఐ స్మార్ట్ హోమ్, ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం టాప్ అప్ లోన్, ఎస్బిఐ ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఎస్బిఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్, మహిళల కోసం హెర్‌ఘర్ హోం లోన్ లాంటి రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఏడాదికి కనిష్ఠంగా 6.8 శాతం వడ్డీతో రుణాలతో ఈ విభాగంలో 34 శాతం మార్కెట్ వాటాను సాధించామన్నారు. కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎమ్వై) సబ్సిడీని అందించేందుకు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సిఎన్ఎ)గా గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఏకైక బ్యాంకు ఎస్బీఐ. ‘2022 నాటికి అందరికీ హౌసింగ్’ అనే ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతుగా, పీఎంవై కింద గృహ రుణాలను అందిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2020 నాటికి 1,94,582 గృహ రుణాలను మంజూరు చేసింది. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
ఐసీఐసీఐ ఆఫర్: ప్రతీ ఈఎంఐపై క్యాష్‌బ్యాక్
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు పండుగ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని హోం లోన్లపై 'క్యాష్ బ్యాక్' సదుపాయం కల్పిస్తోంది. ఈ సదుపాయం ఎన్ఆర్ఐలకు కూడా అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ తెలిపింది. కొత్తగా గృహ రుణాలపై 'క్యాష్ బ్యాక్' సదుపాయంతో ప్రారంభించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. కొత్త హోం లోన్లపై ప్రతీ ఈఎంఐ పైనా 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 36 నెలల తరువాత మొదటి విడత క్యాష్ బ్యాక్ సొమ్మును ఖాతాదారుడి అకౌంట్లో జమ చేస్తుంది. ఇక ఆ తరువాత నుంచి 12 నెలలకొకసారి ఈ క్యాష్ బ్యాక్ ను క్రెడిట్ చేస్తుంది. కనిష్టంగా 15 సంవత్సరాల కాలపరిమితి గృహ రుణాలకు ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే బ్యాంకులో గృహరుణం తీసుకునే సమయంలో క్యాష్ బ్యాక్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఈఎంఐలో 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సొంత ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ చెప్పారు. దీంతోపాటు ఆస్తి తనఖా రుణాలపై , ఇతర తనఖారుణాలపై కూడా తమ పండుగ ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. Just in: ICICI Bank launches #CashbackHomeLoan, offering borrowers benefit of 1% cashback on every EMI for the entire tenure of the loan. pic.twitter.com/njnu7dzXrY — ICICI Bank (@ICICIBank) September 28, 2017 -
ఇంటి నిర్వహణ ఇక తేలికే..
కామన్‌ఫ్లోర్.కామ్, అప్నా కాంప్లెక్స్.కామ్, సొసైటీ123.కామ్, సొసైటీ రన్.కామ్, ఇట్స్ మైహోమ్.కో.ఇన్... ఇల్లు పూర్తిగా తయారయ్యాక గృహప్రవేశం చేస్తాం. తరవాత నిర్వహణ ఉంటుంది కదా!! చిన్న ఇంట్లోనే డ్రైనేజీ, విద్యుత్, నీటి వంటి నెలవారీ చెల్లింపులు, వాటిని సరిగా నడిచేలా చూడటం వంటివి సరిగా చెయ్యకపోతే సవాలక్ష సమస్యలొస్తాయి. మరి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే మరీను. అందుకే గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే దీన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించే కంపెనీలున్నాయిప్పుడు. సంఘం ఏర్పాటు నుంచి రిజిస్ట్రేషన్... నెలవారీ చెల్లింపులు... ఇలా ప్రతిదీ సకాలంలో చేసిపెట్టడమే వీటి పని. ఆ సేవల్ని చూస్తే... అకౌంటింగ్ ఫ్లాట్‌ఫాం: నివాసితుల సంఘానికి ఒక ప్రత్యేకమైన వెబ్పోర్టల్నిస్తారు. దీన్లో సంఘం సభ్యుల సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం, గృహ యజమానులు, వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలుంటాయి. నెలవారీ చెల్లింపుల గడువు రాగానే క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఫ్లాట్ వాసులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో సమాచారం అందిస్తుంది. వెంటనే వారు పోర్టల్‌లోకి లాగిన్ అయి సంఘం బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. హెల్ప్ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీలో విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, లిఫ్టుల నిర్వహణకు సంఘం తరపున ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. ఫ్లాట్‌వాసులకు వీటిల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోర్టల్ ద్వారా ఆ ఉద్యోగులకు నేరుగా సమాచారం వెళుతుంది. కమ్యూనికేషన్ కొలాబిరేషన్: ప్రతి సంఘం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (సంఘం పేరు, ప్రధాన లక్ష్యాలు, ఆఫీసు చిరునామా, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలుంటాయిందులో), సంఘం నిబంధనలు (బైలాస్), నెలవారీ సమావేశాలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలతో పాటుగా సంఘం ఖాతాలోని సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు వంటి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు సంఘం వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ఫ్లాట్వాసులందరికీ ఎలక్ట్రానికల్‌గా తెలుసుకోవచ్చు. గేట్ కీపర్: అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉండే సెక్యూరిటీగార్డ్ దగర ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇందులో అపార్ట్మెంట్ వాసులందరి వివరాలుంటాయి. ఎవరైనా ఫ్లాట్ వాసులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి వివరాలను, ఫొటోలను సంబంధిత ఫ్లాట్‌వాసులకు చేరవేరుస్తుంది. వారు సరే అంటే వచ్చినవారిని లోనికి రానిస్తారు. ‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే మాది టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సెల్ఫ్ మెయింటెనెన్స్ సిస్టమ్. ఇంటర్నెట్తో పనిలేదు. ప్రతి పనీ సకాలంలో చేయటమే మా బాధ్యత’’. - రాజశేఖర్, కో ఫౌండర్- అప్నా కాంప్లెక్స్