SBI Offers on Women's Day 2021: Discount on Home Loans, Gold - Sakshi
Sakshi News home page

Women's Day: ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు

Published Mon, Mar 8 2021 1:42 PM | Last Updated on Mon, Mar 8 2021 7:36 PM

Your Dream Home Our Goal Sbi offer onWomensDay - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది.  గృహరుణాలపై  ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది.  హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా  5 బేసిస్‌ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది.  

తాజా సవరణ ద్వారా 6.70  శాతం వద్ద  ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు  తెలిపింది. విమెన్స్‌ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని  కోరింది.  మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్‌ చేసింది. అలాగే యోనో యాప్‌ ద్వారా  జరిపే బంగారు, డైమండ్‌ ఆభరణాల కొనుగోళ్లపై  స్పెషల్ డిస్కౌంట్లను  ఆఫర్‌ చేస్తోంది.  30 శాతం దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement