ఐసీఐసీఐ ఆఫర్‌: ప్రతీ ఈఎంఐపై క్యాష్‌బ్యాక్‌ | ICICI Bank launches new home loan 'Cashback' facility | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ఆఫర్‌: ప్రతీ ఈఎంఐపై క్యాష్‌బ్యాక్‌

Published Thu, Sep 28 2017 12:51 PM | Last Updated on Thu, Sep 28 2017 7:34 PM

ICICI Bank launches new home loan 'Cashback' facility



సాక్షి,  ముంబై:  ప్రయివేటు బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు  వినియోగదారులకు పండుగ ఆఫర్‌  ప్రకటించింది.  పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని  హోం లోన్లపై  'క్యాష్ బ్యాక్' సదుపాయం కల్పిస్తోంది. ఈ సదుపాయం ఎన్‌ఆర్‌ఐలకు కూడా అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ  తెలిపింది.

కొత్తగా గృహ రుణాలపై 'క్యాష్ బ్యాక్'  సదుపాయంతో ప్రారంభించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.  కొత్త హోం లోన్లపై ప్రతీ ఈఎంఐ పైనా 1 శాతం   క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నట్టు   వెల్లడించింది. 36 నెలల తరువాత మొదటి విడత  క్యాష్‌ బ్యాక్‌ సొమ్మును ఖాతాదారుడి  అకౌంట్‌లో జమ  చేస్తుంది. ఇక  ఆ తరువాత నుంచి 12 నెలలకొకసారి ఈ క్యాష్‌ బ్యాక్‌ ను క్రెడిట్‌ చేస్తుంది.  కనిష్టంగా 15 సంవత్సరాల కాలపరిమితి గృహ రుణాలకు ఆఫర్ లభిస్తుంది.

అయితే ఈ ఆఫర్‌ పొందాలంటే బ్యాంకులో  గృహరుణం తీసుకునే సమయంలో  క్యాష్‌ బ్యాక్‌ ఆప్షన్‌  ఎంచుకోవాల్సి ఉంటుంది.  ప్రతి ఈఎంఐలో 1 శాతం  క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌   సొంత ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ  చెప్పారు. దీంతోపాటు ఆస్తి తనఖా రుణాలపై , ఇతర తనఖారుణాలపై కూడా తమ పండుగ ఆఫర్‌ అందుబాటులో ఉందన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement