సాక్షి, ముంబై: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌నుప్రకటించింది. గెలాక్సీ ఎస్9, ఎస్ 9 ప్లస్ డివైస్‌లపై ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, లేదా పేటీఎం మాల్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండియన్ మార్కెట్‌లో గెలాక్సీ ఎస్9 64 జీబీ వేరియంట్ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్ ధర రూ .65,900 గా ఉంది. అయితే, ఎస్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్ ధర 72,900 రూపాయలు లభిస్తుంది. తాజాగా వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్‌ను క్రెడిట్ చేస్తుంది. అలాగే ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది.
Remix your everyday with Super Slow-mo on the reimagined camera of Samsung #GalaxyS9 and #GalaxyS9Plus. Get one time screen replacement* and INR 9000.00 cashback* on ICICI Bank Credit Cards or Paytm mall. Move up now: https://t.co/x6LDp29WsO pic.twitter.com/Xyk2esgrUB
— Samsung Mobile India (@SamsungMobileIN) June 2, 2018
Comments
Please login to add a commentAdd a comment