భారతీయులకు చాలా కాలం నుంచి బంగారం పట్ల బలమైన అనుబంధం ఉంది. అందుకే బంగారం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా కొన్న బంగారాన్ని ప్రజలు అమ్మడానికి ఇష్టపడరు. దానికి ఒక కారణం ఉంది. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆర్ధికంగా ఇబ్బందులు గురైనప్పుడు బంగారం ఆదుకుంటుంది అనే భరోసా వారిది. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
కఠిన పరిస్థితులలో డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అంతే తప్ప ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడరు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి.
సాధారణ వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ ఇచ్చే సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో 75శాతం కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని ఇవ్వరు. బంగారు రుణాలకి సంబందించి బ్యాంక్‌కి, బ్యాంక్‌కి మధ్య మధ్య వ్యత్యాసం ఉంటుంది. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం ముందే తనిఖీ చేసుకోవాలి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. జూన్ 1, 2021న సంబంధిత వెబ్‌సైట్ల నుండి సేకరించిన డేటా ఇది.
బ్యాంకు పేరు | వడ్డీ రేటు (ఏడాదికి) |
Punjab & Sind Bank | 7.00% |
Bank of India | 7.35% |
State Bank of India | 7.50% |
Canara Bank | 7.65% |
Union Bank | 8.20% |
Karnataka Bank | 8.49% |
Indian Bank | 8.50% |
UCo Bank | 8.50% |
Federal Bank | 8.50% |
Punjab National Bank | 8.75% |
Jammu & Kashmir Bank | 8.85% |
Central Bank | 8.85% |
Indian Overseas Bank | 8.85% |
HDFC Bank | 8.95% |
Bank of Baroda Bank | 9.00% |
Dhanalaxmi Bank | 9.50% |
Karur Vyasya Bank | 10.10% |
ICICI Bank | 11.00% |
South Indian Bank | 11.95% |
AXIS Bank | 12.50% |
NBFCs | |
IIFL Finance | 9.24% |
Muthoot Finance | 11.90% |
Bajaj Finserv | 12.00% |
Manappuram Finance | 12.00% |
Comments
Please login to add a commentAdd a comment