నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్‌కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్‌బీఎఫ్‌సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది.
తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్‌బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఎన్నికల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్‌లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment