ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్‌స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య
పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్‌వైజర్ శక్తివేల్‌ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు!
Comments
Please login to add a commentAdd a comment