గూగుల్‌కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్‌లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్‌పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్‌ల కోసం మరో ఎన్‌బీఎఫ్‌సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌తో కూడా గూగుల్‌పే జట్టు కట్టింది. గూగుల్‌పే అందిస్తున్న ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment